For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన టాప్ 10 మసీదులు: రంజాన్ స్పెషల్ ..

|

భారత దేశం లో సుమారు 300,000 మసీదులు ఉన్నాయి. ఇవి ప్రపంచం లోని ఈ ఇతర దేశంలో కన్నా ఎక్కువే. ముస్లిం దేశాలు కూడా ఈ రికార్డుని అధికమించలేదు. ముస్లిమ్‌ల ప్రార్థనాలయం మస్జిద్. ప్రపంచంలో పేరెన్నికగన్నవి, అత్యద్భుతమైనవి వందల సంఖ్యలో మస్జిద్‌లు ఉన్నాయి. ఈ కట్టడాలను ఒక్కసారి దర్శిస్తే చాలు ముస్లిమ్‌ల నిర్మాణ నైపుణ్యాలు ఎంత గొప్పవో అర్థమవుతాయి.

ఇస్లామ్ చక్రవర్తులు తమ కళలను ప్రపంచమంతా ఎలా వ్యాపింపచేశారో తేటతెల్లం అవుతాయి. యూరప్, ఆఫ్రికా సంస్కృతులు ఎక్కువగా కనిపించే మస్జిద్‌లు ప్రపంచం నలుమూలలా అన్ని దేశాలలోనూ అత్యంత సుందరంగా, ఠీవిగా దర్శనమిస్తున్నాయి. రంజాన్ మాసం సందర్భంగా ప్రపంచ ప్రసిద్ధి పొందిన పవిత్ర మస్జిద్‌ల గురించి తెలుసుకుందాం...

జామా మస్జిద్: న్యూ ఢిల్లీ!

జామా మస్జిద్: న్యూ ఢిల్లీ!

మన దేశంలో అతిపెద్దది, అతి సుందరమైనదిగా జామా మస్జిద్‌కు పేరుంది. 1658లో ఎర్ర ఇసుకరాయి, తెల్లని మార్బుల్‌తో మొఘల్ చక్రవర్తి షాజహాన్ ఈ మస్జిద్‌ను నిర్మించాడు. ఈ మస్జిద్ నిర్మాణానికి 5 వేల మంది, 6 సంవత్సరాల పాటు పనిచేశారు. దేశరాజధాని ఢిల్లీలోని జనసందోహాల ప్రాంతమైన చాందినీ చౌక్‌లో గల ఈ మస్జిద్ ప్రాంగణంలో దాదాపు 25 వేల మంది ఒకేసారి ప్రార్ధనలు జరపవచ్చు. image courtesy:

బ్లూ మాస్క్- అజ్రత్ అలీ పవిత్రక్షేత్రం: ఆప్ఘనిస్థాన్

బ్లూ మాస్క్- అజ్రత్ అలీ పవిత్రక్షేత్రం: ఆప్ఘనిస్థాన్

ఆప్ఘనిస్తాన్‌లోని మజర్-ఇ-షరీఫ్ పట్టణంలో ఉంది ఈ మస్జిద్. నీలాకాశం రంగులో ఆప్ఘనిస్థాన్ హృదయపీఠంగా పిలువబడుతున్న ఈ కట్టడాన్ని ‘మజర్’గా పిలుస్తారు. ఇదే పేరుమీదుగా ఈ పట్టణం వృద్ధి చెందింది. హజ్రత్ అలీ జ్ఞాపకార్థం నిర్మించిన ఈ మస్జిద్ చుట్టూ అత్యంత సుందరమైన ఉద్యానవనాలు ఉన్నాయి. image courtesy:

సుల్తాన్ ఒమర్ అలీ సైఫుద్దిన్ మస్జిద్: బ్రూనై

సుల్తాన్ ఒమర్ అలీ సైఫుద్దిన్ మస్జిద్: బ్రూనై

బ్రూనై దేశ రాజధాని అయిన బండార్ సెరి బెగవాన్ ప్రాంతంలో బంగారపు బురుజు గల ఈ మస్జిద్ ఉంది. పసిఫిక్ ఆసియాలోనే అత్యంత సుందరమైన మస్జిద్‌గా పర్యాటకులను ఆకర్షిస్తోంది. 1958లో నిర్మించిన ఈ కట్టడంలో ఇటాలియన్ ఆర్కిటెక్చర్ స్టైల్ కనిపిస్తుంది. 171 అడుగుల ఎత్తులో ఉన్న ఈ మస్జిద్ నిర్మాణంలో గాజు తలుపులు, చిమ్నీలు, బురుజులు, పాలరాయి, గ్రానైట్‌ను ఉపయోగించారు. image courtesy:

మక్కా మస్జిద్ హైదరాబాద్!

మక్కా మస్జిద్ హైదరాబాద్!

హైదరాబాద్‌లోని చార్మినార్‌కు నైరుతి దిశలో, 100 గజాల దూరంలో ఉంది ఈ మస్జిద్. ఇందులోని హాలు 75 అడుగుల ఎత్తు, 220 అడుగుల వెడల్పు, 180 అడుగుల పొడవు ఉంటుంది. ఈ మస్జిద్ నిర్మాణంలో మక్కా నుండి ఇటుకలు తెప్పించారని, వీటిని మధ్య ఆర్చీలో ఉపయోగించారని, అందుకే దీనికి మక్కా మస్జిద్‌గా పేరు వచ్చిందని అంటారు. మహ్మద్ ప్రవక్త పవిత్ర కేశాన్ని ఇందులో భద్రపరచారని, చరిత్ర చెబుతోంది. image courtesy:

క్రిస్టల్ మసీద్ :

క్రిస్టల్ మసీద్ :

అద్భుతమైన కష్టడంతో నిర్మించిన క్రిస్టల్ మసీద్ మలేషియాలో ఉన్నదియ. మలేషియాలోని థెరంగాను ప్రదేశంలో నిర్మించిన ఈ క్రిస్టల్ మసీదు నిర్మానానికి ఎక్కువగా స్టీల్, గ్లాస్ మరియు క్రిస్టల్స్ ఉపయోగించారు . ఈ మసీద్ ను ఇస్లామిక్ హెరిటేజ్ పార్క్ వద్ద ఉంది. ఈ మసీద్ ను 2006 నుండి 208 మద్య నిర్మించబడినది.

image courtesy:

మస్కుర్ జోసఫ్ సెంట్రల్ మసీద్, పవల్డార్ (ఖజికిస్తాన్ ):

మస్కుర్ జోసఫ్ సెంట్రల్ మసీద్, పవల్డార్ (ఖజికిస్తాన్ ):

ఖజికిస్తాన్ లోని పావల్డార్ ఒక అద్భుతమైన సైట్ సీయింగ్ ప్రదేశం . ముఖ్యంగా ఇక్కడ నిర్మించిన మసీద్ ఆర్టికల్చర్ కాంప్లెక్స్ ఉంది. ఈ మసీద్ లో 1500సీట్స్ ఉన్నాయి .

image courtesy:

బ్లూ మసీద్:

బ్లూ మసీద్:

ఇది ఒక హిస్టారికల్ మసీద్. టర్కీలోని ఇస్తాంబుల్ ప్రదేశంలో నిర్మితమైనది . దీన్ని సుల్తాన్ అహ్మద్ మసీద్ అని కూడా పిలుస్తారు. ముఖ్యంగా బ్లూ మసీద్ అనే ఎక్కువ పాపులర్ అయినది. ఎందుకంటే ఈ మసీద్ లోపల ఇంటీరియర్ డిజైన్స్ మరియు వాల్స్ కోసం బ్లూ టైల్స్ ఎక్కువగా ఉపయోగించి నిర్మించారు ఈ మసీద్ ను అహ్మద్ ప్రవక్త కాలంలో 1609 నుండి 1616 మద్య నిర్మించారు. image courtesy:

 సులేమానియా మసీద్ టర్కీ:

సులేమానియా మసీద్ టర్కీ:

సులేమానియా మసీద్ . ఇది టర్కీలో ఒక అత్యద్భుతమైన మసీద్ . ఇస్తాంబుల్ మూడవ్ కొండ మీద దీన్ని నిర్మించడం జరిగింది . సిటీలోని ఇది అత్యంత పెద్ద మసీద్ . ఈ మసీద్ నిర్మాణం 1550లో ప్రారంభమై 1557లో పూర్తైనది.image courtesy:

 బర్సా లో ఒక గ్రాండ్ మసీద్ :

బర్సా లో ఒక గ్రాండ్ మసీద్ :

దీన్ని బర్సా గ్రాండ్ మసీద్ లేదా ఉలు కమి అని బాగా ప్రసిద్ది, ఈ మసీద్ టర్కీలోని బర్సాలో ఉన్నది. ఓటమన్ సుల్తాన్ బయజీద్ ఈ మసీద్ నిర్మానానికి ఆర్డ్ ఇచ్చారు. ఈ మసీద్ ను 1396 నుండి 1399 మద్య నిర్మించారు.

image courtesy:

నజ్రత్ జాన్ మసీద్:

నజ్రత్ జాన్ మసీద్:

నజ్రత్ జాన్ మసీద్ . ఈ మసీద్ ను అహ్మదీయ ముస్లీమ్ కమ్యూనిటీ నిర్మించింది . ఈ మసీద్ ను 1959లో ప్రారంభించిన 1967లో పూర్తి చేశారు . ఇది డెన్మార్క్ లో కోపెహ్గాన్ ప్రదేశంలో నిర్మించారు.

image courtesy:

English summary

10 Most Beautiful Mosques in the World

Mosque (Masjid) is a Holy place for Muslims. It is a place for worship for all the followers of Islam. Mosque is the place where all the Muslims of the community come together and have their prayers.
Desktop Bottom Promotion