For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దీపావళి పండుగను జరుపుకోవడానికి 10 ముఖ్య కారణాలు

|

మనం దీపావళిని ఎందుకు జరుపుకుంటాం? ఈ పండుగ మిమ్మల్ని సంతోషంగా ఉండేలా చేస్తుంది. అంతేకాక ఒక మంచి సమయం అయిన శీతాకాలంలో రావడం వలన ఎక్కువగా అస్వాదిస్తాం. ఈ సమయంలో దీపావళి జరుపుకోవటానికి 10 పౌరాణిక మరియు చారిత్రక కారణాలు ఉన్నాయి. హిందువులకు మంచి కారణాలు ఉన్నాయి. కానీ ఇతరులు కూడా దీపాలతో గొప్ప ఉత్సవంగా జరుపుకుంటారు.

10 Reasons to Celebrate Diwali

1. లక్ష్మి దేవి పుట్టినరోజు
సంపద యొక్క దేవత లక్ష్మి దేవి,సముద్ర మథనం సమయంలో కార్తీక మాసంలో అమావాస్య రోజున అవతరించారు. అందుకే లక్ష్మిదేవికి దీపావళికి సంబంధం ఉంది.

2. విష్ణువు లక్ష్మీదేవిని కాపాడిన రోజు
దీపావళి రోజున విష్ణువు తన ఐదవ అవతారం అయిన వామన అవతారంలో బలి చక్రవర్తి చేర నుండి లక్ష్మి దేవిని కాపాడెను. ఇది దీపావళి రోజున లక్ష్మి పూజలు చేయటానికి మరో కారణం.

3. కృష్ణుడు నరకాసురుడుని చంపిన రోజు
దీపావళి ముందు రోజు,కృష్ణుడు రాక్షసు రాజు నరకాసురుడుని చంపి మరియు తన నిర్బంధంలో ఉన్న 16,000 మంది మహిళలను రక్షించేను. ఈ స్వేచ్ఛ యొక్క వేడుకను దీపావళి రోజుతో సహా రెండు రోజుల పాటు జరుపుకుంటారు.

4. పాండవులు తిరిగి వచ్చిన సమయం
గొప్ప పురాణం మహాభారతం ప్రకారం,పాండవులు పాచికలు ఆట (జూదం) లో కౌరవుల చేతిలో పరాజయం పొందిన ఫలితంగా 12 సంవత్సరాల బహిష్కరణకు గురి అయ్యారు. పాండవులు 12 సంవత్సరాల తర్వాత కార్తిక అమావాస్య నాడు కనిపించారు.

5. రాముని యొక్క విజయం
గొప్ప ఇతిహాసమైన రామాయణంలో,శ్రీరాముడు,సీతా మరియు లక్ష్మణుడు రావణ సంహారం తర్వాత లంక నుండి అయోధ్యకు కార్తిక అమావాస్య రోజున తిరిగి వచ్చారు. అయోధ్య పౌరులు ఆ రోజున మట్టి దీపాలతో మొత్తం నగరంను ఎప్పుడు ప్రకాశవంతముగా ఉండేలా అలంకరించారు.

6. విక్రమాదిత్యుడు పట్టాభిషేకం
గొప్ప హిందూ మత రాజైన విక్రమాదిత్యుడికి దీపావళి రోజున పట్టాభిషేకం జరిగినది. అందుకే దీపావళి ఒక చారిత్రాత్మక సంఘటన అయింది.

7. ఆర్య సమాజం ప్రత్యేకమైన రోజు
హిందూమతం యొక్క గొప్ప సంస్కర్త మరియు ఆర్యసమాజ స్థాపకుడు మహర్షి దయానంద దీపావళి రోజున నిర్వాణం పొందారు.

8. జైనుల ప్రత్యేకమైన రోజు
ఆధునిక జైనమత స్థాపకుడు మహావీర్ తీర్థంకరుడు కూడా దీపావళి రోజున నిర్వాణం పొందారని భావిస్తారు.

9. సిక్కులకు ప్రత్యేకమైన రోజు
మూడవ గురువు అమర్ దాస్ రెడ్ లెటర్ దీపావళి రోజున సంస్థాగతమైనది. అప్పుడు సిక్కు గురువుల ఆశీర్వాదాలను సేకరించడానికి ఉంటుంది.1577 వ సంవత్సరంలో అమృత్సర్ లోని బంగారు ఆలయానికి పునాది రాయి దీపావళి రోజునే వేసారు. 1619 లో,ఆరవ గురువు హరగోబిండ్,మొఘల్ చక్రవర్తి జహంగీర్ అధీనంలో ఉన్నారు. ఆయనతో పాటు 52 మంది రాజులు గౌలియార్ కోట నుండి దీపావళి రోజున విడుదల అయ్యారు.

10. దీపావళి రోజున పోప్ ప్రసంగం
1999 లో,పోప్ జాన్ పాల్ II పూజావేదికను దీపావళి దీపములతో అలంకరిస్తారు. అలాగే భారతీయ చర్చిలో ప్రత్యేక ధన్యవాదాలను నిర్వహిస్తారు. పోప్ నుదుటిపైన ఒక తిలక్ మార్క్ మరియు అతని ప్రసంగం లైట్ పండుగకు సూచనలుగా ఇవ్వటం జరిగినది.

English summary

10 Reasons to Celebrate Diwali

Why do we celebrate Diwali? It’s not just the festive mood in the air that makes you happy, or just that it's a good time to enjoy before the advent of winter. There are 10 mythical and historical reasons why Diwali is a great time to celebrate.
Desktop Bottom Promotion