For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ : దీపావళీకి 6 ప్రత్యేకతలు..!

By Staff
|

2016 దీపావళి భారతీయుల్లో ఒక గొప్ప ఉత్సవంగా త్వరలో సమీపించబోతుంది. ఇది చెడును పారద్రోలి మంచి విజయాలను ఆశించే అతిపెద్ద భారతీయ పండుగ. అందువల్ల ఈ 2016 దీపావళి ఉత్సవ వేడుకలు అన్ని మూలాలను చుడతాయి, ఈ అతిపెద్ద భారతీయ పండుగ కోసం చేసే సన్నాహాలు ప్రతిచోట సులభంగా గమనించవచ్చు.

భారతదేశంలో, ఈ దీపావళి నిస్సందేహంగా చెడును మించి మంచి వేడుక, అనుకూలత, సంతోషం, ఎంతో ఉత్సాహంతో కూడుకున్న పండుగ. ఇది 5 రోజులు జరుపుకునే పండుగ, ఈ పండుగకు స్నేహితులు, కుటుంబం, మనం ఇష్టపడేవారితో కలిసి ఇంటిని అలంకరించుకుని, చంద్రుడు లేని 'అమావాస్య' రోజు జరుపుకునే ఈ దీపావళి ఇల్లంతా చీకటితో నిండి ఉంటుంది. భారతీయ హిందూ క్యాలెండర్ ప్రకారం ఇది కొత్త సంవత్సరానికి వేకువగా చెప్తారు.

భారతదేశంలో దీపావళి వేడుకల ప్రాముఖ్యతకు వివిధరకాల అర్ధాలు ఉన్నాయి. రాముడు రావణుడిపై విజయం సాధించడం వల్ల ఈ రోజు జరుపుకుంటారని చెప్తారు. అంతేకాకుండా లక్ష్మీ వినాయకుడి పూజకు ఈ పండుగ చాలా ప్రసిద్ది చెందినదని చెప్తారు. ఈ ఆనంద పండుగకు అనేక ప్రాముఖ్యతలు ఉన్నాయి అవి:

1. రామాయణ కధ:

1. రామాయణ కధ:

శ్రీరాముడు రావణాసురుడిని చంపి, 14 సంవత్సరాల అరణ్య వాసం తరువాత అయోధ్యకు వచ్చినందున ఈ దీవాలి పండుగను నిర్వహిస్తారని చెప్తారు. నిజానికి ఇంటిని దీపాలతో అలంకరించుకోవడం అనేది రాముడిని ఆహ్వానించడానికి గుర్తుగా చెప్తారు. రామాయణ కధ అన్ని వివరాలను వర్ణిస్తుంది.

2. లక్ష్మి వినాయకుడి పూజ:

2. లక్ష్మి వినాయకుడి పూజ:

దీపావళి వేడుకలో రామాయణానికి ఎంత ప్రాముఖ్యత ఉందొ, లక్ష్మి వినాయకుడి పూజకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. దీపావళి రోజు లక్ష్మి, వినాయకుడిని పూజిస్తే జీవితంలో ఆరోగ్యం, సంపద, సంతోషం, శ్రేయస్సు అన్నీ సమకూరతాయని భారతదేశంలోని ప్రజలు నమ్ముతారు.

3. సాంప్రదాయ దీపాలు:

3. సాంప్రదాయ దీపాలు:

దీపావళి దివ్వెల పండుగ, ఈ దీపాల పండుగ ఉత్తమ పండుగగా సూచించబడుతుంది. నిజానికి ఇంట్లో, ఇంటి చుట్టుపక్కల సాంప్రదాయ దీపాలతో దీపావళిని జరుపుకోవడం అనేది అత్యంత ముఖ్యమైనది. దీపావళి సమీపిస్తుంది అన్నపుడు, అందంగా చెక్కబడిన దీపాలకు డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఈ రోజుల్లో, రకరకాల కొత్త కొత్త దీపావళి దివ్వెలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

4. రంగురంగుల ముగ్గులు:

4. రంగురంగుల ముగ్గులు:

దీపావళి పండుగకు మరో అందమైన గుర్తు ముగ్గుల పండుగ. ఇది అందమైన, రంగురంగుల పౌడర్ లతో నేలను అలంకరించడానికి ప్రసిద్ధ పండుగ. దీపావళి ముగ్గులు నిజానికి సృజనాత్మకతను రాణిస్తూ సాంప్రదాయ చిహ్నంగా ఉంటుంది.

5. రుచికరమైన మిఠాయిలు:

5. రుచికరమైన మిఠాయిలు:

ఇతర పండుగల లాగా, దీపావళి రోజు మనకు దగ్గరి బంధువులకు, మన సన్నిహితులకు మిఠాయిలు పంచుకోవడం ఈ పండుగ సంప్రదాయాల్లో ముఖ్యమైనది. అందువల్ల చాలా రోజులు ప్రత్యేకంగా దీపావళి ఉత్సవ సమయంలో, ప్రతిచోట దీపావళి ప్రత్యెక మిఠాయిలు అద్భుతమైన రకాలలో అందుబాటులో ఉంటాయి. నిజానికి ఈ పరిధిలో దీపావళి బహుమతులు, మిఠాయిలు చాలా ఇష్టపడే ప్రత్యామ్నాయాలు. దీపావళి మెసేజెస్ లా దీపావళి మిఠాయిలు మన చుట్టుపక్కల వారికి, మన సన్నిహితులకు పంచుతాము.

6. బహుమతులు పంచుకునే సంప్రదాయం:

6. బహుమతులు పంచుకునే సంప్రదాయం:

దీపావళి రోజు, సంతోషం, ప్రేమ, ఆనందపు సమయాలను పంచుకోవడానికి భారతదేశంలోని ప్రజలు గుర్తుగా బహుమతులను పంచుకుంటారు. దాదాపు ప్రతి ముఖ్యమైన దీపావళి పండుగలో, అందరూ దీపావళి బహుమతులు పంచుకునే సంప్రదాయం కూడా ఒక గొప్ప ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనివల్ల చుట్టుపక్కల వారితో, సన్నిహితులతో ప్రేమాభిమానాలు బలపడి, ఆనందం, ప్రేమను పంచుకోవచ్చు. నిజానికి దీపావళి రోజు, కార్పోరేట్ కంపెనీలు వారి సిబ్బందికి దీపావళి బహుమతులు అందచేస్తారు.

దీపావళి భారతీయులకు అత్యంత ఆనందదాయకమైన పండుగ. అందువల్ల ఈ ఉత్సవాన్ని స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఎంతో ఉత్సాహంగా, సురక్షితంగా జరుపుకుంటారు.

English summary

6 Significances of Diwali- The Festival of Lights

Diwali 2016 is approaching soon for a grand celebration among the Indians. It is the biggest Indian festival that celebrates the triumph of good over bad. Therefore now when Diwali 2016 festival celebration is round the corner, preparations for this biggest Indian festival is easily noticeable everywhere.
Desktop Bottom Promotion