హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో నేల మీద పెట్టకూడని 5 వస్తువులు..!

Posted By:
Subscribe to Boldsky

హిందూ దర్మశాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులను ఎంతో పవిత్రంగా చూసుకుంటాం. వాటిని క్రింద కానీ, అశుభ్రమైన ప్రదేశాలలో కాని, మంచం మీద కాని పెట్టము. పూజకు ఉపయోగించే పూలు, కొబ్బరికాయ, అగర్ బత్తీలు, కర్పూరం...లాంటి వస్తువలును కింద పెట్టము, ఒక వేళ కింద పెడితే వాటిని పూజకు ఉపయోగించము. అలా ఉపయోగిస్తే అశుభం జరుగుతుందని హిందులవల నమ్మకం.

వీటితో పాటు హిందు దర్మశాస్త్రం ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో కొన్ని వస్తువులను కింద పెట్టకూడదు. అలా పెడితే అంతా అశుభమే జరుగుతుందని నమ్మకం. ఇంతకీ అస్సలు క్రింద పెట్టకూడని ఆ 5 వస్తువులు ఏమిటో తెలుసుకుందాం..

దీపం:

దీపం:

దేవుడి ముందు పెట్టే దీపాల‌ను నేల‌ మీద ఎట్టి పరిస్థితిలోనూ పెట్ట‌రాదు. వాటిని వెలిగించినా, వెలిగించకపోయినా ఎల్ల‌ప్పుడూ వాటిని శుభ్ర‌మైన వ‌స్త్రంపైనే ఉంచాలి. ఇలా నేల‌పై పెట్ట‌రాదు. అలా చేస్తే దేవుళ్లు, దేవత‌ల‌ను అవ‌మానించిన‌ట్టే అవుతుంద‌ట‌.

బంగారం:

బంగారం:

బంగారాన్ని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా చూస్తారు. అలాంటి బంగారాన్ని నేలపై పెడితే లక్ష్మీదేవి ఆగ్రహానికి లోనై అనేక కష్టాలు పడతారు. అలా చేస్తే వారి వ‌ద్ద ధ‌నం నిల‌వ‌ద‌ట‌. అన్నీ స‌మ‌స్య‌లే వ‌స్తాయ‌ట‌.

జంధ్యం:

జంధ్యం:

హిందువుల్లో చాలా మందికి జంధ్యం ధ‌రించే ఆచారం ఉంటుంది. అయితే దాన్ని నేల‌పై మాత్రం ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పెట్ట‌రాదు. త‌ల్లిదండ్రులు, గురువుల‌కు ప్ర‌తి రూపంగా దాన్ని భావిస్తార‌ట‌. ఆ క్ర‌మంలో జంధ్యంను కింద పెడితే వారిని అవ‌మానించిన‌ట్టే అవుతుంద‌ట‌. అందుక‌ని దాన్ని ఎప్పుడూ నేల‌పై పెట్ట‌కూడ‌దు.

శంఖువు:

శంఖువు:

శంఖువులో సాక్షాత్తూ ల‌క్ష్మీ దేవి కొలువై ఉంటుంద‌ట‌. కాబ‌ట్టి దాన్ని కూడా నేల‌పై పెట్ట‌రాదు. పెడితే ఆర్థిక స‌మ‌స్య‌లు ఎదురవుతాయి.

సాలిగ్రామం:

సాలిగ్రామం:

నేపాల్‌లోని గండ‌కీ న‌ది తీరంలో ఓ ర‌క‌మైన న‌ల్ల రాయి దొరుకుతుంది. దాన్ని సాలిగ్రామం అంటారు. ఈ రాయి విష్ణువుకు ప్ర‌తిరూప‌మ‌ని చెబుతారు. సాలాగ్రామం నేలపై అస్స‌లు పెట్ట‌కూడ‌ద‌ు. అలా చేస్తే అన్నీ స‌మ‌స్య‌లే ఎదుర‌వుతాయ‌ట‌. ఒక వేళ వాటిని నేల‌పై పెట్టాల్సి వ‌స్తే చెక్క‌తో చేసిన శుభ్ర‌మైన ఉప‌రిత‌లంపై ఉంచాల‌ట‌.

శివ‌లింగం.

శివ‌లింగం.

శివ‌లింగం నేల‌పై అస్స‌లు పెట్ట‌కూడ‌ద‌ట‌. అలా చేస్తే అన్నీ స‌మ‌స్య‌లే ఎదుర‌వుతాయ‌ట‌. ఒక వేళ వాటిని నేల‌పై పెట్టాల్సి వ‌స్తే చెక్క‌తో చేసిన శుభ్ర‌మైన ఉప‌రిత‌లంపై ఉంచాల‌ట‌.

English summary

6 Things Which You Should NOT KEEP on the FLOOR !

Things You Should not Keep on Floor..read on..
Story first published: Tuesday, April 4, 2017, 15:17 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter