For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ దసరా నవరాత్రుల్లో మీరు ఆరోగ్యంగా ఉండేందుకు ఈ జాగ్రత్తలు తీసుకోండి, ఏడాదంతా ఫిట్ గా ఉంటారు

|

దుర్గ పూజ దేశంలో నలుమూలలా అనేకమంది భారతీయులు చేసుకునే ముఖ్యమైన పండుగగా ఉంది. ప్రత్యేకంగా బెంగాలీ వాసులు, అత్యంత వైభవోపేతంగా చేసుకునే పండుగ ఇది. ఈ తొమ్మిది రోజుల నవరాత్రి మహోత్సవాలలో ఆనందోత్సాహాలతో మునిగి తేలుతూ కోలాహలంగా గడుపుతారు. కొన్ని ప్రాంతాలలో ప్రత్యేకించి ఆహార పదార్ధాల కోసం కొన్ని ప్రత్యేకించిన స్టాల్స్ ఏర్పాటు చేయబడుతాయి కూడా. వీటిని పాండల్స్ అని వ్యవహరిస్తారు. బెంగాలీలు ముఖ్యంగా ఇటువంటి స్టాల్స్ ఏర్పాటు చేస్తుంటారు.


అప్పుడప్పుడు ఆహారానికి స్టాల్స్ వెళ్ళడం సమస్య లేదు కానీ, కొందరు అదేపనిగా వాటికి అంకితమైపోతుంటారు. మరియు ఇళ్ళల్లో చేసే తినుబండారాల సంగతి సరేసరి. క్రమంగా కడుపు ఉబ్బరం, జీర్ణ క్రియల సమస్యలకు కారణమవుతుంది. మరియు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా పెంచుతుంది. కాబట్టి, ఈ వ్యాసంలో, ఈ దుర్గా పూజలో ఎటువంటి ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తకుండా ఎలా నివారించాలో తెలియజేయబోతున్నాము.నవరాత్రి వస్తుందంటేనే ఒకటి, రెండు వారాల ముందు నుండే బంధువులు, స్నేహితులతో ఇళ్ళల్లో కోలాహలం ప్రారంభమైపోతుంది. కొన్ని ప్రాంతాలలో స్టాల్స్ ఏర్పాటు చేయడం నుండి, దేవాలయాల్లో పూజలు నిర్వహించడం, మరియు దేవుని చిత్రపటాలను, విగ్రహాలను ఏర్పాటు చేయడం వరకూ సందడి వాతావరణం నెలకొంటుంది.

అయినప్పటికీ, శారీరిక, మానసిక ఆరోగ్యం గురించిన శ్రద్ధ అత్యంత ముఖ్యమైన అంశంగా ఉంటుంది. ఎందుకంటే ఆహార పదార్ధాలలోని అధిక కేలరీలు మీ ఆరోగ్యానికి హానికలిగించవచ్చు.

దుర్గ పూజ సందర్భంగా ఆరోగ్యంగా ఉండేందుకు సూచించదగిన చిట్కాలు :


1. అధిక కొవ్వు మరియు నూనెలు కలిగిన ఆహార పదార్ధాలను కాస్త తగ్గించండి :

నూనె పదార్ధాలను పూర్తి స్థాయిలో అడ్డుకోవడం కష్టమని అందరికీ తెలిసిన విషయమే. కానీ పండుగ సమయాలలో వీటి అదిక వాడకం, వ్యాధుల బారినపడవేసే అవకాశాలు ఉన్నాయి. కావున జాగ్రత్త తప్పనిసరి. నవరాత్రుల సమయంలో, సాయంత్రం పూట, పండల్స్ (స్టాల్స్) సందర్శించడం కొందరికి అలవాటుగా ఉంటుంది. ఏ ఆహారాన్ని ఎంతమోతాదులో తీసుకుంటున్నారో కూడా తెలుసుకోలేనంతగా. క్రమంగా తెలీకుండానే అధిక నూనెలు మరియు కొవ్వులతో కూడిన స్పైసీ పదార్ధాలను శరీరానికి అందివ్వడం జరుగుతుంది. కావున గమనించి తక్కువ స్పైసీ, మరియు నూనెలు కలిగిన గ్రిల్డ్ ఫిష్, సలాడ్స్, గ్రిల్డ్ చికెన్ లేదా పనీర్, బంగాళాదుంపలు వంటి ఆహారాలను ఎంపిక చేసుకోండి. మీకు అర్ధరాత్రి సమయాల్లో ఆహారం మీదకు కోరికలు వెళ్తున్న ఎడల, వేయించిన ఆహారాలకు బదులుగా బిస్కెట్స్ వంటివి తీసుకోవడం మంచిది.


2. వీలైనంత ఎక్కువగా నీటిని తీసుకోండి :

ఒక పాండల్ నుండి మరొక పాండల్ నడవడంతోనే శరీరం అలసిపోతుంది, క్రమంగా డీహైడ్రేషన్ సమస్యలు తలెత్తుతాయి కూడా. క్రమంగా శరీరంలో వేడి మరియు తేమతో కూడిన వాతావరణాన్ని కలిగి ఉంటుంది. ఈ సమయంలో, నీరు తీసుకోని ఎడల కొన్ని శ్వాస సంబంధించిన సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఉంటాయి. క్రమంగా కార్బోనేటేడ్ పానీయాల వైపుకు దృష్టి మరలుతుంది, కానీ అవి మీ శరీరాన్ని నిర్జలీకరణం చేస్తాయి తప్ప, ఎటువంటి ప్రయోజనాలను కలిగి ఉండవు. కావున మినరల్ వాటర్ లేదా నిమ్మరసం లేదా పండ్లరసాలు వంటివి తీసుకోవడం మీ దాహాన్ని అణచివేయడమే కాకుండా, మిమ్ములను ఆరోగ్యంగా ఉంచుతాయి కూడా.

3. ఆల్కహాల్ మానుకోండి :

శరీర అవయవాలను మరియు మూత్రపిండాలను ఎక్కువగా ప్రభావితం చేసే ఆల్కహాల్ తీసుకోవడం మానివేయండి. ఆల్కహాల్ తీసుకోవడం అంటే, శరీరానికి అవసరంలేని విష పదార్ధాన్ని అందించి, దాని పనితీరును నాశనం చేయడమే. మద్యం తగ్గించడానికి సుముఖంగా లేని పక్షంలో, రెడ్ వైన్ లేదా వైట్ వైన్ తీసుకోవచ్చు. మితంగా తీసుకుంటే, హృదయం ఆరోగ్యంగా ఉంటుంది. కానీ ఏది కూడా పరిమితిని దాటి తీసుకోవడం, అనర్దాలకే దారితీస్తుందని మరవకండి.

4. వీలైనంతగా పాల ఉత్పత్తులను నివారించండి :

పాలు మరియు ఇతర పాల ఉత్పత్తులు లాక్టోజ్ సమ్మేళనాన్ని కలిగివుంటాయి. ఇది మీ కడుపుకు మరింత చికాకును కలిగించేవిలా ఉంటాయి. గ్యాస్, కడుపు ఉబ్బరం, కడుపు తిమ్మిరి మరియు అతిసారం వంటి సమస్యలను కలిగిస్తుంది. దీనికి బదులుగా సోయా పాలు, బాదం పాలు లేదా హెంప్ మిల్క్ వంటి లాక్టోస్ లేని పాల ఉత్పత్తులను ఎంచుకోవడం మంచిది.

5. తగినంత నిద్ర పొందండి :

ఎప్పటికప్పుడు మనసు, మరియు శరీరం రీఫ్రెష్ అనుభూతికి లోనవ్వాలి అంటే సరైన ఆహారం, వ్యాయామంతో పాటు నిద్ర కూడా అవసరమని మరవకండి. మీ సర్కాడియన్ లయలు క్రమబద్దీకరించబడి ఉండాలంటే రోజులో కనీసం 7 నుండి 8 గంటల నిద్ర అవసరంగా ఉంటుంది. మీరు తగినంత నిద్ర పోని పక్షంలో, మీ శరీరానికి విశ్రాంతి కరువై, ఆ ప్రభావం రోజంతా చూపిస్తుంది.

6. తాజా పండ్లు మరియు కూరగాయలను మీ ఆహార ప్రణాళికలో చేర్చుకోండి :

ఈ నవరాత్రుల సమయంలో, ప్రజలు సాధారణంగా కూరగాయలు మరియు పండ్లను పక్కన పెట్టి, మాంసాహారం వైపుకు దృష్టిని మరల్చడం జరుగుతుంటుంది. అయితే ఈ చర్యలు, మీ శరీరానికి అవసరమైన విటమిన్లు మరియు ఖనిజాలను అందివ్వలేవు. కాబట్టి, తాజా పళ్ళు మరియు కూరగాయలను ఆహార ప్రణాళికలో జోడించుకుంటూ సమతుల్యత పాటించవలసిన అవసరం ఉంది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆద్యాత్మిక, జ్యోతిష్య, ఆరోగ్య, జీవన శైలి, ఆహార, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

దుర్గా పూజలో శారీరిక ఆరోగ్యానికి తీసుకోవలసిన జాగ్రత్తలు

6 tips to stay healthy this durga puja