For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కృష్ణుని గురించి అతి తక్కువ మందికి తెలిసిన 8 ఆసక్తికరమైన విషయాలు

|

హిందూ మతంలో ముక్కోటి దేవతలున్నారు అంటారు, వారిలో అత్యంత ముఖ్యమైన దేవుళ్లలో, అత్యంత ప్రసిద్ధి గాంచిన దేవుడైన కృష్ణుడి గురించి మనలో అనేక మందికి తెలుసు. అయినప్పటికీ, శ్రీకృష్ణుని జీవితం మర్మంతో కూడుకున్నది. ఎంత తెలుసుకున్నా, ఇంకా మిగిలే ఉంటుంది. ఆసక్తిని రేకెత్తించే కథలతో నిండిపోయి ఉన్న శ్రీకృష్ణుని గురించిన, పూర్తి వివరాలను తెలుసుకోవాలని భక్తులు ఆకాంక్షిస్తుంటారు.

కొందరైతే కృష్ణుని గురించి తెలుసుకోవడం, విశ్వం గురించి తెలుసుకోవడం ఒకటే అని భావిస్తుంటారు కూడా. క్రమంగా ఈ విశ్వాoతరాళమంతా కృష్ణమయమని చెప్పబడింది. మహాభారతంలో,శ్రీకృష్ణుడు నేనే గతము, నేనే ప్రస్తుతం, నేనే భవిష్యత్తు,నేనే దేవుని, నేనే సృష్టిస్తాను, నేనే నాశనం చేస్తాను, ఈ విశ్వంలో ప్రతి అణువులోనూ నేనుంటాను, ప్రతి విషయమూ నా కనుసన్నలలోనే ఉంటుంది అని చెప్పాడు. అంత గొప్ప శక్తి సంపన్నుడు శ్రీ కృష్ణుడు. అటువంటి శ్రీ కృష్ణ పరమాత్ముని గురించి తక్కువగా తెలిసిన విషయాలను మీముందు ఉంచబోతున్నాము.

8 Interesting & Lesser Known Facts About Lord Krishna
ఈ విశ్వమంతా శ్రీకృష్ణుని నోటనే ఉన్నది :

ఈ విశ్వమంతా శ్రీకృష్ణుని నోటనే ఉన్నది :

శిశువుగా, కృష్ణుడు ఒక అల్లరి పిల్లవాడు. అతని చిలిపి చేష్టలు, అల్లరి పనులు కథలు కథలుగా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. చిన్నతనంలో, అతను తన ఆనందం కోసం చేయదగిన అన్ని అల్లరి పనులూ చేశాడు. కానీ తన ప్రతి అల్లరి పనిలోనూ స్వలాభాపేక్ష లేని ప్రయోజనాలను చూపేవాడు. తన అమాయకత్వంతో చేసిన చిలిపి పనులుగా తోచినప్పటికీ, వాటి వెనుకగల అంతరార్ధం పరమాత్ముని లీలలను ప్రదర్శించేవిలా ఉండేవి. క్రమంగా తన తల్లికి, తన నోటిలోనే విశ్వాన్ని చూపించి అబ్భురపరచాడు శ్రీ కృష్ణుడు.

శ్రీ కృష్ణ భగవానుడు ఇంటి వెలుపల ఆడుతున్న సమయంలో, అతని అన్న బలరాముడు తల్లి యశోద కడకు వచ్చి, శ్రీ కృష్ణుడు మట్టి తింటున్నాడని ఫిర్యాదు చేశాడు. మొదట్లో యశోద నమ్మని కారణంగా, అతని నోటిని తెరిచి పరీక్షింపవలసినదిగా బలరాముడు సూచించగా, యశోదా కోపంతో కృష్ణుని ఇంటిలోనికి తీసుకుని వెళ్లి, నోటిని పరీక్షింపదలచినది.

క్రమంగా నోరు తెరిచిన శ్రీకృష్ణుని నోట మొత్తం విశ్వమే కనపడగా, ఆశ్చర్యానికి లోనైన యశోదా దేవి, దైవాంశ సంభూతునిగా మరియు దేవుని అవతారముగా గ్రహించింది. కానీ, తాను దేవుని అవతారంగా భావించిన యశోద దేవి తల్లిగా ఇకమీదట ఉండలేదని గ్రహించిన శ్రీ కృష్ణుడు, తన దైవ శక్తితో యశోదా దేవి జ్ఞాపకాల నుండి ఈ సంఘటననే తొలగించివేశాడని చెప్పబడింది.

శ్రీ కృష్ణ భగవానుడు, అతని భార్యలు మరియు నారద మునీంద్రులు :

శ్రీ కృష్ణ భగవానుడు, అతని భార్యలు మరియు నారద మునీంద్రులు :

శ్రీ కృష్ణునికి 16108 భార్యలు ఉన్నారని మనకు తెలుసు. అష్టభార్యలు అని పిలువబడే ఎనిమిది మంది రాణులు వారిలో బాగా ప్రసిద్ది చెందారు. రుక్మిణి కృష్ణునికి మొదటి రాణి. రుక్మిణి తండ్రి ఆమెకు బలవంతంగా వేరే రాజుకి ఇచ్చి వివాహం చేయాలని సంకల్పిస్తాడు. కానీ ఆమె కృష్ణుడిని ప్రేమించిన కారణాన, ఆ వివాహం నుండి ఆమెను రక్షించి తనతో తీసుకుని వెళ్ళిపోతాడు శ్రీ కృష్ణుడు. అడ్డు వచ్చిన రుక్మిణి అన్న "రుక్మి" ని ఓడించి సగం శిరోముండనం గావించి చంపకుండా వదిలిపెట్టాడని కథనం.

నారద ముని ద్వారకలో కృష్ణుని సందర్శించడానికి వచ్చినప్పుడు, శ్రీ కృష్ణుని మహిమలను తెలుసుకునే క్రమంలో భాగంగా, తన భార్యలలో ఒకరిని బహుమతిగా ఇవ్వమని కృష్ణుని అడుగుతాడు. క్రమంగా కృష్ణుడు, తన భార్యలలో ఎవరు ఒంటరిగా కనిపించినా, అతను వారిని, తన వెంట తీసుకెళ్ళవచ్చునని షరతు విధించాడు. క్రమంగా శోధించిన నారద మునీంద్రుల వారికి ఏ భార్య కూడా ఒంటరిగా కనపడలేదు, అన్నిటా శ్రీ కృష్ణుడే కొలువుతీరి ఉన్నాడు. శ్రీకృష్ణుని లీలగా గ్రహించిన నారద మునీంద్రులు, తప్పును క్షమించమని కృష్ణుని వేడుకున్నాడు.

గాంధారి శాపం :

గాంధారి శాపం :

మహా భారత యుద్ధం సమయంలో, శ్రీ కృష్ణ భగవానుడు, గాంధారిని ఓదార్చటానికి వెళ్ళినప్పుడు, తన వంశం మొత్తాన్ని నాశనం చేస్తున్నట్లుగా కృష్ణుని నిందించి, నేటి నుండి ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత, యాదవ వంశం పూర్తిగా నశిస్తుంది అని శాపమిచ్చింది. అలా అయినా శ్రీకృష్ణుడు, యుద్దాన్ని ఆపి తన బిడ్డల ప్రాణాలు కాపాడడంలో సహాయం చేస్తాడని భావించింది. కానీ అలా జరగలేదు. కౌరవ వంశమే తుడిచిపెట్టుకుని పోయింది.

అయితే కృష్ణుడు, ఆ శాపానికి సమాధానంగా తథాస్తు అని బదులిచ్చాడు. అనగా "ఈలోకం పూర్తిగా పాపాలతో నిండిపోయింది, కావున యుగాంతం జరుగక తప్పదు" అని శ్రీ కృష్ణుని ఉద్దేశం.

శ్రీ కృష్ణ భగవానుడు మరియు శిశుపాలుడు :

శ్రీ కృష్ణ భగవానుడు మరియు శిశుపాలుడు :

శిశుపాలుడు ఒక సుప్రసిద్ధమైన మరియు చెడులక్షణాలు కలిగిన రాజుగా పేరు పొందినవానిగా ఉన్నాడు. శిశుపాలుని 100 తప్పుల వరకు అతనిని చంపను అని, శిశుపాలుని తల్లికి, శ్రీ కృష్ణుడు మాట ఇచ్చిన కారణంగా, అతనిని వందల తప్పుల వరకు క్షమించడం జరిగింది. కానీ, ఒక సమావేశంలో శ్రీ కృష్ణుని పరిపరి విధాలుగా నిందించడం మొదలుపెట్టాడు శిశుపాలుడు. ప్రతి ఒక్క నిందను తప్పుగా లెక్కిస్తూ వచ్చిన శ్రీకృష్ణుడు, 100 తప్పులు పూర్తికాగానే, తన సుదర్శనంతో శిశుపాలుని తల నరికి వధించాడు.

శిశుపాలుడు, జరాసంధుడు నిజానికి పూర్వ జన్మలో జయ విజయులనే విష్ణుని ద్వారపాలకులు. శాపవశాత్తు మూడు జన్మలు విష్ణు మూర్తికి దూరంగా ఉండవలసి వస్తుంది. మంచివాళ్ళుగా మూడువందల సంవత్సరాలు విష్ణువుకి దూరంగా ఉండలేని వీరు, చెడ్డవారిగా అవతరించి త్వరగానే విష్ణుమూర్తి అవతారాల చేతులలోనే సంహరించబడి, తిరిగి విష్ణువు పంచన చేరినట్లుగా పురాణాల కథనం. క్రమంగా, కృతయుగంలో హిరణ్య కశిపుడు-హిరణ్యాక్షుడు, త్రేతాయుగంలో రావణ-కుంభకర్ణులు, మరియు ద్వాపర యుగంలో శిశుపాల-జరాసందులుగా అవతారమెత్తి చివరకు విష్ణువు వద్దకు చేరారని కథనం.

కృష్ణుడు మరియు ద్రౌపది :

కృష్ణుడు మరియు ద్రౌపది :

మహాభారతంలో అన్నాచెల్లెళ్ళ ప్రేమకు నిదర్శనంగా శ్రీ కృష్ణుడు – ద్రౌపదిలను అభివర్ణించబడినది. ద్రౌపది పార్వతీదేవి అంశగా, కృష్ణుడు విష్ణుమూర్తి అంశగా చెప్పబడింది. ఇక్కడ విష్ణువు- పార్వతీ దేవీలను అన్నా చెల్లెళ్ళుగా పురాణాలలో చెప్పబడింది.

ఏకలవ్యునికి శ్రీ కృష్ణుని దీవెనలు :

ఏకలవ్యునికి శ్రీ కృష్ణుని దీవెనలు :

ద్రోణాచార్యునికి ఏకలవ్యుడు తన బొటనవేలిని అర్పించినప్పుడు, శ్రీకృష్ణుడు ఏకలవ్యునికి ఒక వరమిచ్చినట్లుగా ప్రతీతి. క్రమంగా యజ్ఞం నుండి పుట్టిన ద్రుష్టద్యుమ్నుడి చేత ద్రోణాచార్యుడు వధించబడ్డాడు. కానీ, మహాభారత యుద్ధంలో కర్ణుడు, ఏకలవ్యుని చెల్లెలిని పరిణయమాడిన కారణాన, ఏకలవ్యుడు కౌరవసైన్యం వైపు ఉండవలసి వచ్చిందని కథనం.

జైనమతంలో శ్రీ కృష్ణ భగవానుడు :

జైనమతంలో శ్రీ కృష్ణ భగవానుడు :

కృష్ణుని ప్రస్తావన జైన సాహిత్యంలో కూడా కనుగొనబడింది. వీటిలో శ్రీకృష్ణుని వాసుదేవునిగా, కథానాయకునిగా వర్ణించారు.

బౌద్ధమతంలో శ్రీ కృష్ణ భగవానుడు :

బౌద్ధమతంలో శ్రీ కృష్ణ భగవానుడు :

బౌద్ధ సాహిత్యం ప్రకారం వైభవ జాతకంలో, కంసవధ కోసం శ్రీ కృష్ణుడు యువరాజులా వచ్చాడని చెప్పబడింది.

జగమంతా కృష్ణ మయం అన్నట్లు, ఈ విశ్వమంతా కృష్ణుని చేతనే నడుపబడుతుందని భక్తుల విశ్వాసం.

జగమంతా కృష్ణ మయం అన్నట్లు, ఈ విశ్వమంతా కృష్ణుని చేతనే నడుపబడుతుందని భక్తుల విశ్వాసం.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆహార, ఆరోగ్య, జీవన శైలి, ఆద్యాత్మిక, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

8 Interesting & Lesser Known Facts About Lord Krishna

Though he is one of the most popular Hindu deities, there are many interesting and lesser known facts about Lord Krishna. He says in the Mahabharata that all past, present and future, and the good and evil are his own forms only. He held he whole universe inside him. It is also said that Gandhari cursed him that his clan would get perished after thirty six years.
Story first published: Saturday, September 1, 2018, 17:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more