నమ్మలేని నిజం: పెద్ద రాతిబాండ తేలియాడే దర్గా గురించి మీకు తెలుసా ?

By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

మన చుట్టూ జరిగే ప్రతి ఒక్క విషయానికి ఎదో ఒక కారణం ఉంటుంది. హరివిల్లు లో ఉండే రంగుల దగ్గర నుండి చెట్ల ఆకుల పై కనపడే ఆకుపచ్చ రంగు వరకు ఇలా కనపడే, జరిగే ప్రతి ఒక్క విషయానికి ఒక కారణం ఉంటుంది.

కొన్ని సార్లు అద్భుతాలు జరుగుతుంటాయి. వాటి గురించి ఎవరైనా చెప్పినప్పుడు మొదట మనం ఆశ్చర్యపోతాము. ఆ తర్వాత నిజంగానే అవి ఉన్నాయా లేవా లేక అలా జరిగిందా లేదా అని ఆరా తీయడం మొదలుపెడతాం. ఆ విషయాన్ని మనం కళ్లారా చూస్తే కానీ అది నిజం అని నమ్మలేని పరిస్థితి ఏర్పడుతుంది.

ఈ ప్రపంచంలో చాలా విషయాల వెనుక ఉన్న మర్మాన్ని శాస్త్ర సాకేంతిక పరిజ్ఞానం కనుక్కోలేకపోయింది. అలాంటి వాటి గురించి తెలిసినప్పుడు ఇవి నిజంగా మనుగడ లో ఉన్నాయా అని ఖచ్చితంగా ఆశ్చర్యపోతాము.

See This To Believe it! A Stone Floats In Air Here!

ఒక పెద్ద రాతి బాండ గాలిలో తేలియాడుతూ ఉందంటే మీరు నమ్ముతారా ? కానీ ఇది నిజం. అజ్మీర్ దర్గాలో భూమి నుండి రెండు అంగుళాల పైన రాతి బండ తేలియాడుతూ ఉంది. ఈ విషయం వల్లనే అజ్మీర్ దర్గాకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభించింది.

ఈ తేలియాడుతున్న రాతి బండ గురించే కాకుండా అజ్మీర్ దర్గాలో ఉండే అద్భుతమైన విషయాల గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం.

గాలిలో తేలియాడే రాయి :

గాలిలో తేలియాడే రాయి :

ఇదొక అద్భుతమైన ఆశ్చర్యకరమైన సంఘటన. ఎవ్వరూ అంత సులువుగా నమ్మలేని విషయం. దీని వెనుక ఉన్న కారణాల గురించి శాస్త్రవేత్తలు కూడా కన్నుకోలేకపోయారు. భూమి నుండి 2 అంగుళాల పైన ఒక రాతి బండ ఈ ప్రదేశంలో గాలి లో తేలియాడుతూ ఉంటుంది. ఈ రాతి బండ గాలిలో ఇలా ఎందుకు తెలియాడుతుంది అనే విషయమై ఎన్నో సిద్ధాంతాలు చెప్పుకొచ్చారు. కానీ, అవేవి దాని వెనుక దాగి ఉన్న రహస్యాన్ని విపులంగా చెప్పలేకపోయాయి మరియు అసలైన కారణాన్ని ఆ సిద్ధాంతాలతో నిరూపించలేకపోయారు. అది నిజం గానే గాలిలో తేలియాడుతూ మన కళ్ళకు కనపడుతుంది.

ప్రపంచవ్యాప్తంగా ఈ దర్గా ప్రసిద్ధి చెందింది :

ప్రపంచవ్యాప్తంగా ఈ దర్గా ప్రసిద్ధి చెందింది :

అజ్మీర్ షరీఫ్ దర్గా ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రపంచ నలుమూల నుండి సూఫీ సన్యాసుల ఆశీర్వాదాలు తీసుకోవడానికి ప్రతి సంవత్సరం లక్షల మంది విభిన్న ప్రాంతాల నుండి ఇక్కడికి వస్తుంటారు.

ఈ ప్రదేశం యొక్క చరిత్ర :

ఈ ప్రదేశం యొక్క చరిత్ర :

కొడుకు జహంగీర్ పుట్టాడని కృతజ్ఞత భావంతో రాజు అజ్మీర్ షరీఫ్ దర్గా లోపల అక్బర్ మసీదుని నిర్మించడం జరిగింది. ఆ రోజు నుండి మసీదు ఒక ఖురాన్ ని నేర్పించే విద్య సంస్థగా మారిపోయింది. అక్కడ చదువుకోవడానికి వచ్చే విద్యార్థులకు మత సంబంధమైన విద్య నేర్పించడం ప్రారంభించారు.

ప్రసాదం ఇవ్వడానికి గాను దర్గా లోపల రెండు పెద్ద కుండలు ఉన్నాయి. వాటిని డెగ్స్ అని అంటారు. వాటిలోనే ప్రసాదాన్ని వండటం జరుగుతుంది. శాఖాహారాన్ని మాత్రమే వాటిల్లో వండుతారు. బియ్యం, నెయ్యి, చిరు ధాన్యాలు, గింజలు, కుంకుమ పువ్వు మరియు చక్కర ఉపయోగించి ప్రసాదాన్ని తయారు చేయడం జరుగుతుంది. ప్రతి రోజు రాత్రి తయారుచేస్తారు. దానినే మరుసటిరోజు వచ్చిన భక్తులకు ప్రసాదంగా పెడతారు.

ఈ దర్గా తలుపుని సంవత్సరంలో నాలుగు సార్లు మాత్రమే తీస్తారు.

ఈ దర్గా తలుపుని సంవత్సరంలో నాలుగు సార్లు మాత్రమే తీస్తారు.

ఈ పుణ్య క్షేత్రం యొక్క తలుపుని సంవత్సరం మొత్తంలో నాలుగు సార్లు మాత్రమే తీయడం జరుగుతుంది. ఈ తలుపు కి జన్నతి దర్వాజా అని పేరు పెట్టారు. వెండి లోహంతో చేయబడ్డ ఈ తలుపు చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. సంవత్సరానికి ఒక సారి జరిగే ఉరుసు, రంజాన్ పండగ సందర్భంగా రెండు సార్లు మరియు ఖ్వాజా సాహెబ్ పీర్ ఉరుసు సందర్బంగా ఒక సారి, ఈ సందర్భాల్లో మాత్రమే తలుపులు తీస్తారు.

 మీ అభిప్రాయాలను తెలియజేయడం మాత్రం మర్చిపోకండి.

మీ అభిప్రాయాలను తెలియజేయడం మాత్రం మర్చిపోకండి.

మీరు ఇలాంటి విషయాలను మరిన్ని తెలుసుకోవాలని భావిస్తున్నారా, అలా అయితే కామెంట్ బాక్స్ లో మీ అభిప్రాయాలను తెలియజేయడం మాత్రం మర్చిపోకండి.

English summary

See This To Believe it! A Stone Floats In Air Here!

See This To Believe it! A Stone Floats In Air Here!,Have you heard about the floating stone of Ajmer dargah?
Story first published: Tuesday, October 31, 2017, 8:00 [IST]
Subscribe Newsletter