For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వాస్తుశాస్త్రం ప్రకారం ఈ వస్తువులను ఇతరులకు ఇస్తే మీరు కోరి కోరి దురదృష్టాన్ని తెచ్చుకున్నట్టే...!

|

మన దేశంలో పూర్వకాలం నుండి నేటి ఆధునిక యుగం వరకు ఎన్నో ఆచారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు, అనేక వ్యవహారాలు ఉన్నాయి. వీటిని చాలా మంది పాటిస్తూ ఉంటారు.

అయితే ప్రస్తుత కాలం మారింది. పరిస్థితులు మారిపోయాయి. కాబట్టి చాలా మంది ఆచారాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. వారి రోజువారీ అలవాట్లలో చాలా మార్పులు చేసుకున్నారు.

ఈరోజుల్లో సాధారణంగా ఎవరైనా ఏదైనా ఫంక్షన్లకు లేదా పేరంటానికి వెళ్లేటప్పుడు మీ ఇంట్లోని విలువైన ఆభరణాలను, పట్టుచీరలు, కొత్తబట్టలు వంటి వాటిని అడుగుతూ ఉంటారు. అలాగే మగవారు ఇతరుల బైకులను అడగటం లేదా అర్జెంటుగా కొంత డబ్బు కావాలని, కొన్ని గంటల్లో లేదా కొన్ని రోజుల్లో తిరిగిచ్చేస్తామని చెబుతూ ఉంటారు.

వారి మాటలు నమ్మి మనం వాటిని ఇస్తూ ఉంటాం. అలాగే మనం కూడా తీసుకుంటూ ఉంటాం. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం మీరు ఏ వస్తువులు పడితే ఆ వస్తువులను ఇతరులకు ఇవ్వకూడదంట.. అంతేకాదు పొరపాటున వాటిని మీరిచ్చిన లేదా మీరు తీసుకున్నా మీరు ఏరి కోరి దురదృష్టాన్ని తెచ్చున్నట్టేనని పండితులు చెబుతున్నారు.

ఒకవేళ మీరు ఎవరి నుంచి అప్పు తీసుకోవాలంటే ముఖ్యంగా కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేకుంటే మీరు జీవితాంతం అప్పులు చేస్తూనే ఉంటారు. ఇంతకీ ఏయే వస్తువులను ఇతరులకు ఇవ్వకూడదు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతికూల శక్తి తొలగిపోవాలంటే ఈ చిట్కాలు పాటించండి...

ఇతరుల బట్టలను

ఇతరుల బట్టలను

మనలో చాలా మంది ఇతరుల బట్టలు మనకు నచ్చాయంటే చాలు.. మనం వారిని అడిగి వాటిని వేసుకుని తిరుగుతూ ఉంటాం. మంచి ఫొటోలు కూడా తీసుకుంటాం. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇతరుల దుస్తులను ఎప్పటికీ వేసుకోకూడదంట. అంతేకాదు మనం కూడా ఇతరులకు ఇవ్వకూడదంట. ఇలా చేయడం వల్ల వారి ప్రతికూల శక్తి మనకు వచ్చేస్తుంది. అలాగే మీరు ఏవైనా ముఖ్యమైన పనుల నిమిత్తం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు పొరపాటున కూడా ఇతరుల బట్టలను వేసుకోకూడదు. అలా చేస్తే మీరు వెళ్లిని పని ఆగిపోయే అవకాశం ఉంది. అంతేకాదు మీకు మానసిక ఒత్తిడి కూడా పోతుంది.

చాలా సందర్భాల్లో..

చాలా సందర్భాల్లో..

మనలో చాలా మంది బ్యాంకులో లేదా రైల్వే రిజర్వేషన్ సమయంలో లేదా ఇంకెక్కడైనా సమయానికి మనతో పెన్ను లేకపోతే చుట్టుపక్కల ఉండేవారిని అడిగి తీసుకుంటాం. అయితే మన పని పూర్తయ్యాక ఆ పెన్నును తిరిగి ఇవ్వకపోగా, దర్జాగా మనతోనే ఉంచుకుంటాం. అయితే ఇలా ఎప్పటికీ చేయకూడదంట. మనం ఎవరిదైనా పెన్ను తీసుకుంటే తప్పనిసరిగా వారికి తిరిగి ఇవ్వాలట. లేకపోతే ఇది మీ జీవితంలో ఎన్నో సమస్యలకు దారి తీసే అవకాశం ఉందట. అంతేకాదు మీరు ఎందులో అయినా పెట్టుబడి పెడితే ఆర్థిక నష్టం కూడా వస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా ఇతరుల పెన్ను తీసుకుంటే లేదా తీసుకోవాల్సి వచ్చినా, మీ పని పూర్తయిన వెంటనే దాన్ని తిరిగి ఇచ్చేయండి.

కన్యరాశిలోకి సూర్యుడి ఎంట్రీతో, కొన్ని రాశుల వారికి చెడు ఫలితాలే...!

ఇతరుల పడకగదిని..

ఇతరుల పడకగదిని..

మనం ఎవరైనా బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు లేదా స్నేహితులు, ఇంకెవరైనా ఇంటికి వెళ్లినప్పుడు మనం పొరపాటున కూడా వారి ఇంట్లోని పడకగదిలో పడుకోకూడదట. ఇలా చేస్తే వాస్తు దోషం పెరిగే అవకాశం ఉంది. దీని కారణంగా మీ వ్యక్తిగత జీవితంలో అనేక దుష్ప్రభావాలు కలుగుతాయి. అలాగే ఆర్థిక సమస్యలు కూడా విపరీతంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇదొక్కటే కాదు.. మీరు ఏవైనా అప్పులు తీసుకుంటే, తీసుకున్న వారి నుండి వెంటనే చెల్లించమని ఒత్తిడి కూడా పెరుగుతుంది. దీంతో మీరు ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారిపోయే అవకాశం ఉంటుంది. దీని గురించి అందరికీ తెలిసిపోతుంది. కాబట్టి మీరు ఇతరుల పడకగదిని ఎప్పటికీ వాడకండి.

శంఖం ఇతరులకు ఇస్తే..

శంఖం ఇతరులకు ఇస్తే..

మీరు ఎట్టి పరిస్థితులలో శంఖాన్ని ఇతరులకు ఇవ్వడం వంటివి లేదా ఇతరుల నుండి తీసుకోవడం వంటివి ఎట్టి పరిస్థితుల్లో చేయరాదు. ఎందుకంటే వాస్తు శాస్త్రం ప్రకారం శంఖం లక్ష్మీదేవి సంకేతంగా చెబుతారు. దీన్ని మీరు ఇతరులకు ఇచ్చినట్లయితే మీ ఆస్తి కూడా ఐస్ ముక్కలా చాలా వేగంగా కరిగిపోయే అవకాశం ఉంటుదట. అంతేకాదు లక్ష్మీదేవి ఆగ్రహానికి గురై పేదరికంలో కూరుకుపోతార. కాబట్టి పొరపాటున మర్చిపోయి కూడా శంఖాన్ని ఇతరులకు ఇవ్వకండి. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో దాన్ని ఇచ్చినట్లయితే, వారి దగ్గర నుండి దాన్ని తిరిగి తీసుకోవాలి. ఆ తర్వాత దాన్ని గంగాజలంతో శుద్ధి చేసిన తర్వాత మాత్రమే వాడాలి. లేకపోతే మీ జీవితంలో అనేక సమస్యలు పెరిగే అవకాశం ఉంది.

English summary

According to Vaastushastra Never Borrow These Things To Others

Here we talking about the according to vaastushastra never borrow these things to others. Read on