For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రాముడు పూజించిన దేవుడు ఆయనే, రావణుడితో పోరాడేటప్పుడు ఆదిత్య హృదయం పఠించాడు

నా వల్ల ఇంత మారణహోమం జరుగుతుందా అని బాధపడతాడు. అప్పుడు అగస్త్యుడు శ్రీరాముడిని అర్థం చేసుకుంటాడు. ఆయన దరికి చేరి నేను నీకు ఒక విషయం చెబుతాను దాన్ని పాటించు అంటాడు. చెప్పండి మునివర్యా అని రాముడు అంట

|

కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడు తన బంధువులతో యుద్ధం చెయ్యాలా అని సతమతం అవుతూ ఉంటాడు. ఏవేవో ఆలోచిస్తాడు. అయితే ఆ సందర్భంలో

కృష్ణుడు భగవద్గీతలోని సందేశాలను అర్జునుడికి వివరిస్తాడు. దీంతో అర్జునుడు సమరానికి సై అంటాడు. అయితే రామాయణంలో రావణుడితో యుద్ధం జరిగే సమయంలో అలిసిన రాముడిని ఇలాగే ఉత్తేజరపరిచే సంఘటన ఉంది.

ఆదిత్య హృదయంసోత్రం ద్వారా రాముడు కోల్పొయిన శక్తిని మళ్లీ పొందుతాడు.

రాముడు లంకలోకి అడుగుపెడతాడు. శ్రీరాముడిని ఎదుర్కోవడానికి చాలా మందిని పంపుతాడు రావణుడు. భయంకరమైన రావణుడి సేన యుద్ధంలో పాల్గొంటుంది. వారందరినీ సంహరిస్తుంటాడు శ్రీరాముడు. యుద్ధం చేసి చేసి శ్రీరాముడు బాగా అలసిపోతాడు. ఇక ఎంతో మంది తన బాణాల దెబ్బకు విలవిలలాడిపోతుంటే రాముడు చూసి తట్టుకోలేకపోతాడు.

ఇంత మారణహోమం

ఇంత మారణహోమం

నా వల్ల ఇంత మారణహోమం జరుగుతుందా అని బాధపడతాడు. అప్పుడు

అగస్త్యుడు శ్రీరాముడిని అర్థం చేసుకుంటాడు. ఆయన దరికి చేరి నేను నీకు ఒక విషయం చెబుతాను దాన్ని పాటించు అంటాడు. చెప్పండి మునివర్యా అని రాముడు అంటారు.

రామా మీరు ఇప్పుడు ఆదిత్యుడిని ప్రార్థించడం మంచిది అంటారు. నీ అనుమానాలన్నీ పటాపంచలై, నీకు కొత్త శక్తి వస్తుందని చెబుతాడు. వెంటనే శ్రీరాముడికి అగస్త్యుడు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని అందిస్తాడు.

ముప్పై శ్లోకాలుంటాయి

ముప్పై శ్లోకాలుంటాయి

ఆదిత్య హృదయంలో దాదాపు ముప్పై శ్లోకాలుంటాయి. ఇందులో ఇరవై రెండో శ్లోకం నుంచి ఇరవై ఏడో శ్లోకం వరకు ఆదిత్యహృదయం గురించి ఉంటుంది. దీన్ని పఠిస్తే ఏయే లాభాలు కలుగుతాయో అందులో ఉంటుంది. ఇక చివరను ఉండే ఇరవై తొమ్మిది, ముప్పై శ్లోకాలను పఠిస్తే కొత్త శక్తి వస్తుంది. రాములవారు అన్ని శ్లోకాలు పఠిస్తాడు.

Most Read :సేమ్ టు సేమ్ కృష్ణుడి మాదిరిగా ఉన్న ప్రద్యుమ్నుడి గురించి తెలుసా? కృష్ణుడికి ఎలా పుట్టాడో తెలుసాMost Read :సేమ్ టు సేమ్ కృష్ణుడి మాదిరిగా ఉన్న ప్రద్యుమ్నుడి గురించి తెలుసా? కృష్ణుడికి ఎలా పుట్టాడో తెలుసా

కొత్త శక్తి వస్తుంది

కొత్త శక్తి వస్తుంది

ఆదిత్య హృదయం మొత్తం చదివాక శ్రీరాముడికి కొత్త శక్తి వస్తుంది. అర్జునుడు ఏవిధంగా అయితే కురుక్షేత్రంలో తలపడ్డాడో అలా రాములవారు కూడా తలపడతారు. దేవుడికే అంత ధైర్యాన్ని ఇచ్చి యుద్ధంలో విజేతగా నిలిపేలా చేసినా ఆదిత్య హృదయం సామాన్యులకు ఎంతటి శక్తిని ఇస్తుందో అర్థం చేసుకోవొచ్చు.

ఆదివారం రోజు ఉదయాన్నే

ఆదివారం రోజు ఉదయాన్నే

కష్టసమయాల్లో ఉన్నప్పుడు మీరు కూడా ఆపదలు ఎదురైనప్పుడు, అనారోగ్యాల బారినపడ్డప్పుడు మీరు కూడా ఆదిత్య హృదయం చదవండి. మంచి శక్తి వస్తుంది. రోజూ మూడుసార్లు ఆదిత్య హృదయం పఠిస్తే చాలు.

ఆదిత్యుడు అంటే సూర్యుడు. ఆయనకు ఇష్టమైన ఆదివారం రోజు ఉదయాన్నే తలస్నానం చేసి శ్లోకాలు పఠిస్తే చాలా మంచిది. ఆదిత్యుడి స్తోత్రాలు రోజూ పఠిస్తే కచ్చితంగా మీ జీవితంలో చాలా మార్పులు వస్తాయి. అంతా మంచే జరుగుతుంది.

Most Read :ఈ రాశుల వారి దశ తిరగనుంది, ప్రేమలో విజయం సాధిస్తారు, ఇష్టపడ్డ వ్యక్తులే వచ్చి మనస్సులో మాట చెబుతారుMost Read :ఈ రాశుల వారి దశ తిరగనుంది, ప్రేమలో విజయం సాధిస్తారు, ఇష్టపడ్డ వ్యక్తులే వచ్చి మనస్సులో మాట చెబుతారు

English summary

Aditya Hridayam: Why Does Rama Worshipped Aditya

Sage Agasthya Muni gave this powerful Mantra to Sri Rama when Rama was perplexed, while fighting with Ravana. After chanting this Hymn three times Sri Rama defeated Ravana.
Desktop Bottom Promotion