For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Akshaya Trititya 2022: అక్షయ తృతీయ రోజున ఈ మంత్రాలు పఠిస్తే.. లక్ష్మీదేవి అనుగ్రహం గ్యారంటీ...!

|

హిందూ పంచాంగం ప్రకారం, వైశాఖ మాసంలో శుద్ధ తదియ నాడే అక్షయ తృతీయ జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో 2022 సంవత్సరంలో మే 03వ తేదీన అంటే మంగళవారం నాడు ఈ పండుగ వచ్చింది.

అక్షయం అంటే ఎప్పటికీ తరగనిది. ఈరోజు బంగారం కొనుగోలు చేయడం ఒక్కటే కాదు.. దానధర్మాలు చేయడం కూడా చాలా ముఖ్యమైన రోజుగా భావిస్తారు. వేదాల్లో మాత్రం బంగారం, ఆభరణాలు కొనుగోలు చేయాలని ఎక్కడ చెప్పలేదట.

అయితే అక్షయ తృతీయ రోజున శివుని అనుగ్రహంత సంపదలకు రక్షకుడిగా కుభేరుడు నియమితుడైన రోజుగా, శ్రీవిష్ణువు మహాలక్ష్మీని వివాహం చేసుకున్న శుభ దినం కూడా ఇదే. అందుకే ఈరోజు బంగారం కొని లక్ష్మీదేవికి అలంకరించి పూజలు చేస్తారు.

ఇలా చేయడం వల్ల తమ ఇంట్లో సిరి సంపదలు విశేషంగా పెరుగుతాయని చాలా మంది నమ్మకం. ఇంతటి పవిత్రమైన రోజున లక్ష్మీదేవి, కుభేరుడిని పూజిస్తే సానుకూల ఫలితాల వస్తాయని పండితులు చెబుతుంటారు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించే సమయంతో ఈ మంత్రాలను కచ్చితంగా పఠించాలి. ఈ మంత్రాలను పఠించడం వల్ల మీకు లక్ష్మీదేవి కటాక్షం కచ్చితంగా లభిస్తుందట... ఈ సందర్భంగా ఆ మంత్రాలేవో మీరూ చూడండి... మీరు పూజా సమయంలో వీటిని పఠించండి. మీ ఇంట సిరిసంపదలు నింపుకోండి...

Akshaya Tritiya 2021: అక్షయ తృతీయ రోజున ఏ రాశి వారు ఏమి దానం చేయాలంటే...!

కుభేర లక్ష్మీ మంత్రం..

కుభేర లక్ష్మీ మంత్రం..

‘ఓం శ్రీం హ్రీం ఐం కుభేర లక్ష్మీ కమలధారిణ్యై,

ధనాకర్షిణ్యై స్వాహా' మంత్రాన్ని 108 సార్లు ఉచ్చరించడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కచ్చితంగా లభిస్తుందట. దీంతో పాటు

‘ఓం హ్రీం శ్రీం క్రీం కుబేరాయ అష్టలక్ష్మీ

మమ గ్రిహి ధనం పూరయ పూరయ నమః' మంత్రాన్ని కూడా జపించాలి.

శ్రీ మహాలక్ష్మీ స్తోత్రం..

శ్రీ మహాలక్ష్మీ స్తోత్రం..

నమస్తేస్తు మహా మాయే!

శ్రీపఠే సురపూజితే,

శంఖ చక్రగదాహస్తే!

మహాలక్ష్మీ ! నమోస్తుతే !!

అమ్మా శ్రీపీఠనివాసిని! మహామాయారూపిణి ! దేవతలచే పూజించబడుతల్లీ ! గదాశంఖచక్రాలను ధరించినదేవీ! మహాలక్ష్మీ ! నీకు మనస్ఫూర్తిగా నమస్కారాలు

మంత్ర వివరణ..

మంత్ర వివరణ..

ఈ లోకంలో విలయాలకు మూలకారణమైన శక్తికి మహామాయ అనిపేరు. ఆమెయే శ్రీచక్రారూడ. సకలదేవతలు ఆమెనే పూజిస్తారు. ఆమె శంఖచక్రగదాహస్త అయి, వైష్ణవీ రూపంతో మహాలక్ష్మీగా, విష్ణుపత్నిగా జగద్రక్షణ చేస్తూంది. లక్ష్మీ అంటే స్వరాన్నీ చూచేది అని ఒక వ్యుత్పత్తి. కనుకనే సర్వాన్నీ రక్షించే మాత అయ్యింది. విష్ణుపత్ని గనుక విష్ణువు ధరించే ఆయుధాలు లక్ష్మీకి వర్తించాయి. ఇది వైష్ణవీరూపం ఇందలి ఆయుదిసంబో ధనలూ అమ్మవారిపంచ ప్రక్రుత్యాక శక్తికి సంకేతాలు.

Akshaya Tritiya 2021:అక్షయ తృతీయ రోజు పొరపాటున కూడా ఆ పనులు చేయకండి...!

మరికొన్ని మంత్రాలు..

మరికొన్ని మంత్రాలు..

‘ఓం కమల్ వాసిన్యాయ్ శ్రీశ్రీనామ్:..'

‘ఓం శ్రీ శ్రియ నమ..'

‘భాస్కరై విగ్రహ మహాతేజయ ధీమహి, తన్నో సూర్య:ప్రచోదయత్.

అక్షయ తృతీయ ముగిసిన తర్వాత ఈ మంత్రాన్ని పఠించండి. మీరు మీ జీవితంలో ఒక ఆహ్లాదకరమైన మార్పును అనుభవిస్తారు.

లక్ష్మీ కటాక్షం కోసం..

లక్ష్మీ కటాక్షం కోసం..

అక్షయ తృతీయ రోజున లక్ష్మీమాత అనుగ్రహం పొందడానికి మరికొన్ని పనులు చేయొచ్చు.

మీ పూజా మందిరంలో బియ్యం మీద లక్ష్మీ యంత్రం లేదా శ్రీయంత్రం ఉంచండి. వాటి ఎదురుగా తామర పువ్వుల దండ, గులాబీ పువ్వుల పరిమళం వెదజల్లేలా చూడండి. ఆ సమయంలో ఈ మంత్రాలను జపించండి. దీని తర్వాత నైవద్యాలను సమర్పించండి. బ్రహ్మ ముహుర్తాల్లో ఈ మంత్రాలను జపించాలి.

బలరామ మంత్రం..

బలరామ మంత్రం..

అక్షయ తృతీయ రోజున బలరామ నమస్తుభ్యం సర్వ వ్యసన నాశక అనే మంత్రాన్ని జపించడం వల్ల అన్ని కష్టాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. అంతేకాదు కష్టాలకు కారణాలైనా వ్యసనాలు కూడా తొలగిపోతాయి.

2022లో అక్షయ తృతీయ పండుగ ఎప్పుడొచ్చింది?

హిందూ పంచాంగం ప్రకారం, వైశాఖ మాసంలో శుద్ధ తదియ నాడే అక్షయ తృతీయ జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో 2022 సంవత్సరంలో మే 03వ తేదీన అంటే మంగళవారం నాడు ఈ పండుగ వచ్చింది.

English summary

Akshaya Trititya 2022: Powerful Mantras for Good Luck and Wealth

On the auspicious occasion of Akshaya Tritiya, do chant these powerful and special mantra for prosperity.
Desktop Bottom Promotion