For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Akshaya Tritiya 2020: బంగారానికి అక్షయ తృతీయకు ఏ సంబంధం లేదా?

|

స్వర్ణ వర్ణ శోభతో.. ధగ ధగ మెరిసె బంగారంతో లక్ష్మీదేవిని ఎంతో శోభయామానంగా పూజించే పర్వదినమే అక్షయ తృతీయ. ఈ పర్వదినాన ఏ పని చేసినా అక్షయం అవుతుందని చాలా మంది నమ్మకం.

ఆరోజు ఏమి చేసినా అంటే దానాలు, పూజలు అలాగే తీర్థయాత్రలు చేస్తే వాటి ఫలితం అనంతం అని ఉంటూ ఉంటారు. అక్షయం అంటేనే క్షయం కానిది. మరి అలాంటి పర్వదినాన ఎలాంటి విధులు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం...

అక్షయ తృతీయ విశిష్టత.

అక్షయ తృతీయ విశిష్టత.

మన భారతీయ సంప్రదాయం ప్రకారం ఎన్ని కాలాలు ఉన్నాయో... శరీరంలో ఎన్ని భాగాలు ఉన్నాయో అవి మొత్తం చాలా విశిష్టత కలిగినవి. సాధారణంగా మనం కాలాన్ని సంవత్సరాలతో పోలుస్తాం.. సంవత్సరాలను నెలలతో పోలుస్తాం. నెలలను పక్షాలతో పోలుస్తాం. పక్షాలను తిథులతో పోలుస్తాం. కాబట్టి మనకు ప్రధానమైనది తిథి.`అంటే ప్రతి నెలలో రెండు పక్షాలు ఉంటాయి. పూర్వ పక్షం మరియు ఉత్తర పక్షం అదేవిధంగా శుక్ల పక్షం మరియు క్రిష్ణ పక్షం. దీని ప్రకారం వెలుగు రోజులు, చీకటి రోజులు అనేవి సర్వసాధారణంగా ఉంటాయి. రెండు పక్షాలలోనూ 15 తిథులు ఉంటాయి. వీటన్నింటి సంగతి పక్కనబెడితే అక్షయ తృతీయ విశిష్టత గురించి తెలుసుకుందాం.

నాశనం కానిది..

నాశనం కానిది..

అక్షయ అంటే క్షయం కానిది. క్షయం అంటే నాశనం. నశించేపోయే దానిని క్షయం అంటారు. తరిగిపోనిది.. నశించనిది..ఈ పవిత్రమైన రోజున కన్నె పిల్లలు, ముత్తైదువులు, బ్రహ్మచారులు ఎవరైనా లక్ష్మీనారాయణుడిని పూజను చేసుకోవచ్చు. అలాగే ఈ పర్వదినాన ఎవరైతే పేదవారికి లేదా ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తే వారికి వారి ఆస్తులు ఎప్పటికీ తరగిపోవు అని పండితులు చెబుతున్నారు. అయితే చాలా మంది అక్షయ తృతీయ నాడు బంగారాన్ని కొనాలని భావిస్తుంటారు. కానీ దాని కన్నా మీరు ఈరోజు ఎలాంటి వాటిని దానంగా ఇస్తే అది మీ ఇంట్లో తరగనిదిగా ఉండిపోతుంది అని చెబుతున్నారు.

ఒక యుగం ఆరంభానికి సూచిక..

ఒక యుగం ఆరంభానికి సూచిక..

అక్షయ తృతీయ అనేది నాలుగు యుగాలలో ఒక యుగం ఆరంభం అయ్యింది అనే దానికి సూచన అని పండితులు చెబుతున్నారు. క్రుత, త్రేత, ద్వాపర, కలి యుగం అనే నాలుగు యుగాల్లో క్రుత యుగ ఆరంభం కార్తీక శుద్ధ నవమి. త్రేతా యుగం అనేది ఈరోజు వైశాఖ శుద్ధ తదియ. ద్వాపర యుగం అనేది మాఘ శుద్ధ బహుళ త్రయోదశి. చివరిది కలియుగం అనేది భాద్రపద బహుళశుద్ధ త్రయోదశి..

ఈరోజు ప్రత్యేకత..

ఈరోజు ప్రత్యేకత..

వైశాఖ శుద్ధ తదియ అంటే అక్షయ తృతీయ. ఇది త్రేతా యుగానికి ఆరంభ సూచిక. శ్రీరామ చంద్రమూర్తి కూడా ఆ యుగానికి చెందినవాడు. ఈరోజున ప్రత్యేకంగా పరశురాముని జయంతి. బలరాముని జయంతి. లక్ష్మీనారాయణ పూజ. త్రిలోచనగౌరీ వ్రతం వంటివి అనేకం ఉన్నాయి.

బంగారానికి సంబంధం లేదు..

బంగారానికి సంబంధం లేదు..

అక్షయ తృతీయ నాడు ఎంత మందికి వీలైతే అంత మందికి దానం చేయాలట. ముఖ్యంగా ఒక కుండలో నీళ్లు వేసి దానం చేయాలట. దీని వల్ల మీకు చాలా మంచి ఫలితం ఉంటుదట. ఇంట్లో ఉండే బంగారంతో లక్ష్మీనారాయణుడిని పూజించాలని పండితులు చెబుతున్నారు.

లక్ష్మీ నారాయణ పూజ నిర్వహించడానికి అవసరమైనవి:

లక్ష్మీ నారాయణ పూజ నిర్వహించడానికి అవసరమైనవి:

లక్ష్మీ మరియు నారాయణ యొక్క విగ్రహాలు..

రాగి పాట్

కాపర్ ప్లేట్

నీటి కుండ చమురు మరియు విక్ తో దీపం

కర్పూరం ధూపం కర్రలు విగ్రహాలకు బట్టలు ఇవ్వాలి

ఏ రకమైన ఆభరణాలు విగ్రహాలకు ఇవ్వబడతాయి

ఏ రకమైన ఆభరణాలు విగ్రహాలకు ఇవ్వబడతాయి

పాలు వెర్మిలియన్రైస్

అష్టగంధ పువ్వులు

తులసి ఆకులు

నువ్వు గింజలు

జేనే (ధరించే పవిత్రమైన థ్రెడ్) స్వీట్లు,

పొడి పండ్లు,

పాలు, కొబ్బరి, పంచామ్రిట్, పువ్వులు మొదలైనవి సంకల్పం తీసుకోవాలి.

లక్ష్మి నారాయణ మంత్రం

లక్ష్మి నారాయణ మంత్రం

'ఓమ్ లక్ష్మీనారాయణ్యాంగం నమః' ఈ పూజ పూర్తయిన తరువాత, మీ ఆరాధనను అంగీకరించినందుకు లార్డ్ నారాయణ మరియు దేవత లక్ష్మికి ధన్యవాదాలు తెలుపండి. మీరు మనస్సు లేదా శరీరం యొక్క, తెలిసి లేదా తెలియక చేసిన తప్పులకు క్షమాపణలు చెప్పండి.

English summary

Akshaya Tritiya 2020: Date, Tithi Timing, History, Important Rituals

One of the most important poojas performed on the Akshaya Tritiya day is the Lakshmi Narayana pooja. Lakshmi Narayana pooja is done to attract good luck, prosperity and happiness.This pooja helps to invite love into the family. It offers protection to the family members and creates a peaceful atmosphere.