For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Angarki sankashti chaturthi 2021 : సంకష్ట చతుర్థి పూజా విధి, వ్రతం గురించి ఈ ఆసక్తికరమైన విషయాలు తెలుసా...

అంగార్కి సంకష్ట చతుర్థి 2021 తేదీ, శుభముహుర్తరం, పూజా విధి, మంత్రాల యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.

|

హిందూ పురాణాల ప్రకారం, వినాయకుడికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి అని మనందరికీ తెలిసిందే. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకాలుగా చేస్తారు.

Angarki sankashti chaturthi 2021 Date, Shubh muhurat, Puja vidhi, Vrat Vidhi, Mantra and Significance in Telugu

అందులో తొలి చతుర్థి వరద చతుర్థి, రెండోది సంకష్టహర చతుర్థి అమావాస్య వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను వరద చతుర్థి అని, పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థిని సంకష్టహర చతుర్థి లేదా సంకట హార చతుర్థి వ్రతం అంటారు.

Angarki sankashti chaturthi 2021 Date, Shubh muhurat, Puja vidhi, Vrat Vidhi, Mantra and Significance in Telugu

ఈ పవిత్రమైన రోజున వినాయకుని ఎంతో భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. సంకష్ట వ్రతాన్నే అంగారక చతుర్థి అని కూడా పిలుస్తారు. ఈ సందర్భంగా సంకట హర చతుర్థి మాఘ మాసంలో ఎప్పుడొచ్చింది.. శుభముహుర్తం ఎప్పుడు.. ఈ వ్రతం మరియు పూజలు చేయడం వల్ల కలిగే ఫలితాలేంటి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం....

పవిత్ర సమయం..

పవిత్ర సమయం..

చతుర్థి తేదీ ప్రారంభం : మార్చి 2వ తేదీ (మంగళవారం) ఉదయం 5:46 నిమిషాలకు ప్రారంభమై మార్చి 3వ తేదీ (బుధవారం) తెల్లవారుజామున 2:59 గంటలకు ముగుస్తుంది.

చంద్రోదయం రాత్రి 9:41

పూజా విధానం..

పూజా విధానం..

సంకష్ట హర చవితి వ్రతాన్ని మూడు, ఐదు, పదకొండు లేదా 21 నెలల పాటు చేయాల్సి ఉంటుంది.

ఈ వ్రతాన్ని బహుళ చవితి రోజు ప్రారంభించాలి. వ్రతాచరణ రోజున ప్రాతఃకాలమే తలస్నానం చేసి, అనంతరం వినాయకుడిని పూజించాలి. అరమీటరు పొడవు ఉండే వైట్ లేదా రెడ్ రవికల బట్టలను తీసుకుని గణేశుడి ముందు ఉంచి, దానిని పసుపు, కుంకుమలతో అలంకరించాలి. అదే సమయంలో మీ మనసులోని కోరికలను తలచుకుని మూడు గుప్పిళ్ల బియ్యాన్ని గుడ్డలో వేసిన తర్వాత తమలపాకులో ఎండిపోయిన ఖర్జూరాలు, రెండు వక్కలు, దక్షిణ పెట్టి మీ మనసులోని కోరికలను మరోసారి తలచుకుని మూట కట్టాలి.

సంకట హర చతుర్థి కథ..

సంకట హర చతుర్థి కథ..

ఆ తర్వాత సంకట హర చతుర్థి వ్రతం కథను చదవాలి. ఈ మూటను స్వామి ముందు పెట్టి దీపం వెలిగించి, కొబ్బరికాయ లేదా పళ్లు స్వామికి నివేదించాలి. అనంతరం వినాయకుడి ఆలయానికి వెళ్లి మూడు, పదకొండు లేదా 21 ప్రదక్షిణలు చేయాలి. సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడిని ఆరాధించాలి. ఇది పూర్తయిన తర్వాత వినాయకుడికి ముడుపు కట్టిన బియ్యంతో పొంగలి చేసి స్వామి వారికి నివేదించి సాయంత్రం తినాలి.

చతుర్థి వ్రతం కథ..

చతుర్థి వ్రతం కథ..

పురాణాల ప్రకారం, ఒకప్పుడు ఇంద్రుడు తన విమానంలో బ్రుఘండి(వినాయకుడి భక్తుడు) అనే రుషి దగ్గర్నించి ఇంద్రలోకానికి వెళ్తుండగా ఘర్ సేన్ అనే రాజు రాజ్యం దాటే సమయంలో, అనేక పాపాలు చేసిన ఒక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానాన్ని చూశాడు. అతని ఫోకస్ దానిపై పడగానే ఆ విమానం అర్ధాంతరంగా ఆగిపోయి, భూమిపై పడిపోతుంది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగును చూసి ఆశ్చర్యపోయిన ఆ దేశపు రాజు సురసేనుడు వెంటనే బయటికి వచ్చి దాన్ని అలా చూస్తూ ఉండిపోయాడు.

ఆగిపోయిన విమానం..

ఆగిపోయిన విమానం..

అక్కడ ఇంద్రుడిని చూసి ఎంతో ఆనందించిన రాజు ఇంద్రుడికి నమస్కరించారు. ఇంద్రునితో ఈ విమానం ఎందుకు ఆపారని అడగగా.. అతను మీ రాజ్యంలో ఎక్కువ పాపాలు చేసిన వ్యక్తి యొక్క ఫోకస్ మా విమానం మీద పడి అర్ధాంతరం ఆగిపోయింది. అయితే తిరిగి ఎప్పుడు బయలుదేరతారు అని ఆ రాజు అడగగా.. ఈరోజు పంచమి, నిన్న చతుర్థి, నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం ఉన్నారో.. వారి పుణ్యఫలాన్ని నాకు ఇస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు.

తెలియకుండానే వ్రతం..

తెలియకుండానే వ్రతం..

అప్పుడు సైనికులంతా రాజ్యం మొత్తం తిరిగారు. నిన్న ఉపవాసం ఉన్న వ్యక్తి కోసం గాలించారు. అయితే ఎవ్వరూ దొరకలేదు. అదే సమయంలో కొందరు సైనికులకు ఒక గణేష్ దూత వచ్చి మరణించిన స్త్రీ పార్థివదేహం కనబడింది. సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు వినాయక లోకానికి తీసుకెళ్తునా్నరని ప్రశ్నించారు. దానికి గణేష్ దూత తను నిన్నంతా ఉపవాసం ఉంది. తనకు తెలియకుండా ఏమీ తినలేదు. అలా తనకు తెలియకుండానే ఆమె సంకష్ట చతుర్థి చేసింది. ఈరోజు మరణించింది అని చెప్పారు.

గణేష లోకానికి..

గణేష లోకానికి..

అలా జీవితకాలంలో ఎవ్వరైనా ఒక్కసారి ఈ వ్రతం చేస్తే వారు మరణం అనంతరం వినాయక లోకానికి గానీ, స్వనంద లోకానికి చేరుకోవడం తథ్యం అని చెప్పారు. అప్పుడు గణేష్ దూతను సైనికులు బతిమాలారు. ఈ స్త్రీ శరీరాన్ని తమకివ్వాలని, అలా చేస్తే ఇంద్రుని విమానం బయలుదేరుతుందని చెప్పగా.. తను అంగీకరించలేదు. అయితే ఆమె శరీరం నుండి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది. దీంతో ఇంద్రుని విమానం బయలుదేరింది.

సంకష్ట చవితి ప్రాముఖ్యత..

సంకష్ట చవితి ప్రాముఖ్యత..

ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండి గణేష్ భక్తులందరూ ఈ వ్రతం చేయడం వల్ల ఎంతోపుణ్యం దక్కుతుందని చాలా మంది నమ్మకం. ఈ వత్రం చేసిన వారు ఎవరైనా సరే వినాయక లోకానికి లేదా స్వనంద లోకానికి వెళ్తారని, అక్కడ భగవంతుని ఆశీస్సులు లభించి ఎంతో ఆనందం పొందుతారని చెబుతుంటారు.

English summary

Angarki sankashti chaturthi 2021 Date, Shubh muhurat, Puja vidhi, Vrat Vidhi, Mantra and Significance in Telugu

Here we are taking about the Angarki sankashti chaturthi 2021 Date, Shubh muhurat, Puja vidhi, Vrat Vidhi, Mantra and Significance in Telugu. Read on
Desktop Bottom Promotion