For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అన్నిదానాల కంటే అన్నదానం ఎందుకు ముఖ్యమో తెలుసా...

|

ప్రస్తుత సమాజంలో మనం ఎన్నో రకాల దానాల గురించి వింటూ ఉంటాం. అందులో ముఖ్యంగా రక్తదానం, అవయవదానం, నేత్ర దానం, అన్నదానం వంటి వాటి గురించి ఎక్కువగా వింటూ ఉంటాం.

హిందూ సాంప్రదాయం ప్రకారం, అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదని చెబుతుంటారు. ఎందుకంటే ఒకపూట భోజనం పెట్టి ఇతరుల కడుపు వెంటనే నింపొచ్చు. అంతేకాదు దీని వెనుక అనేక కారణాలున్నాయంట. అందుకే అన్నదానం అన్నిదానాల కన్నా ప్రధానమైందని పండితులు చెబుతుంటారు.

ఈ సందర్భంగా అన్నదానం యొక్క విశిష్టత మరియు ప్రాధాన్యత గురించి తెలుసుకోవడంతో పాటు.. అన్నదానం చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయనే విషయాలతో పాటు మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Ratha Saptami 2021:సూర్య దేవుని రథానికి ఏడు గుర్రాలు ఎందుకుంటాయో తెలుసా...

అన్నదానంలో మాత్రమే..

అన్నదానంలో మాత్రమే..

మనం ఎన్ని దాన ధర్మాలు చేసినా.. ఎవ్వరికీ ఎన్ని ఇచ్చినా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. కావాలని ఒక్క అన్నదానంలో మాత్రమే దానం తీసుకున్నవారు ఇంక చాలు అని చెప్పి సంతృప్తి చెందుతారు. మిగిలిన ఏ దానం ఇచ్చినా దానం తీసుకున్న వారిని మనం సంతృపరచలేకపోవచ్చు. కానీ ఒక్క అన్నదానంలో మాత్రం దానం తీసుకున్న వారిని పూర్తిగా సంతృప్తపరచొచ్చు.

అన్నం లేనిదే..

అన్నం లేనిదే..

అన్నం లేనిదే ఈ భూమిపై ఏ ప్రాణి జీవించలేదు. మనకు మూడు పూటలా ఏ లోటు లేకుండా అన్నం దొరకడం అంటే సాక్షాత్తు ఆ కాశీ అన్నపూర్ణ అమ్మవారి అనుగ్రహం తప్పనిసరి కావాలి. ఆ అమ్మను నిత్యం కొలిచేవారికి అన్నపానాదులకు ఎలాంటి లోటు ఉండదు.

భోజనం సమయంలో..

భోజనం సమయంలో..

మనం భోజనం చేసే ప్రతిసారీ ఆ అమ్మను తలచుకుని, మనస్ఫూర్తిగా ద్యానం చేసుకుని ఈ లోకంలో మనతో కలిసి జీవించే ప్రతి జీవికి ఏదో ఒక ఆహారాన్ని సమర్పించి, భోజనం చేసే వారికి, అతిథి అభ్యాగతి సేవ, ఆపన్నులకు, ఆకలితో బాధపడేవారికి అన్నప్రసాదాన్ని అందించే వారికి ఆ తల్లి అనుగ్రహం తప్పక లభిస్తుందని పండితులు చెబుతుంటారు.

ఎలాంటి ఫలితమంటే..

ఎలాంటి ఫలితమంటే..

అన్నదానం కోటి గోవుల దాన ఫలితంతో సమానమైనదని పండితులు చెబుతారు. ఎందుకంటే ‘దానాలన్నింటిలో అన్నదానం గొప్పది'. ఇదే విషయాన్ని మన పెద్దలు కూడా చెబుతుంటారు. అందుకే అన్నదానాన్ని ఒక యజ్ణంలా భావించి చేసేవారు కూడా ఉన్నారు. మన తెలుగురాష్ట్రంలోని కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో ఓ శైవక్షేత్రంలో నిత్యాన్నదానం జరుగుతుంది.

మోక్షం పొందేందుకు..

మోక్షం పొందేందుకు..

చరిత్రను పరిశీలిస్తే.. త్రేతా యుగం, ద్వాపర యుగాల్లో యజ్ణయాగాదులు తపస్సుల ద్వారా మనసుషులు మోక్షం పొందారు. అదే విధంగా కలియుగంలో దాన ధర్మాలు, దైవారాధన, నామ పారాయణ, నామస్మరణ మొదలైన వాటి ద్వారా సులభతరమైన మోక్షమార్గాన్ని దైవం ప్రసాదించారని పండితులు చెబుతారు.

స్వార్థం లేకుండా..

స్వార్థం లేకుండా..

అయితే దానధర్మాల విషయంలో ఎవరికి వారు వారి సామర్థ్యం మేరకు చేసుకోవచ్చు. ఈ దానం చేసేది కూడా మనస్ఫూర్తిగా, ఎలాంటి స్వార్థం లేకుండా చేయాలి. జలదానం, గోదానం, వస్త్రదానం, కన్యాదానం, భూదానం వంటివన్నీ విశిష్టమైనవి. కానీ అన్నదానం మాత్రమే మనిషికి పూర్తి సంత్రుప్తిని ఇస్తుంది.

పురాణాలను పరిశీలిస్తే..

పురాణాలను పరిశీలిస్తే..

పురాణాల ప్రకారం.. కర్ణుడు, బలిచక్రవర్తి వంటి వారి దగ్గరికి వచ్చి భగవంతుడే యాచకుడిగా వచ్చి దానం స్వీకరించి వారికి మోక్షాన్ని ప్రసాదించినట్లు పురాణ, ఇతిహాసాల ద్వారా మనకు తెలుస్తుంది. ఒక మనిషి చనిపోయినా కూడా అతను చేసిన దానధర్మాల వల్ల ఆజన్మాంతరం తన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది.

దానగుణం లేకపోతే..

దానగుణం లేకపోతే..

అయితే ఎవరికైతే దాన గుణం ఉండదో.. అలాంటి వారికి మోక్షం అనేది లభించదు. ఎలాంటి స్వార్థం లేకుండా సహాయం చేసే దానం చాలా అత్యున్నతమైనది. ఆకలితో ఉన్న వారికి, పేదలకు, అనాదలకు, రోగులకు, వికలాంగులకు అన్నదానం మొదలైన దానం చేస్తే కచ్చితంగా మంచి ఫలితం వస్తుంది. అలాగే అన్నదానం చేయడంలో ఏ మాత్రం పక్షపాతం వహించకూడదు. ముఖ్యంగా ‘పరమత' భేదం అస్సలు చూపకూడదు.

కాబట్టి మనకు వీలైనంత మేరకు ఆకలి బాధ ఉన్న వారికి ఎంతో కొంత సహాయం చేద్దాం. సాటి వారి ఆకలి తీర్చే ప్రయత్నం చేద్దాం. అన్నం పరంబ్రహ్మ స్వరూపంగా గౌరవిద్దాం.. నలుగురికి చేయూతనిద్దాం...

English summary

Annadanam Importance and Significance in Telugu

Here we are talking about the annadhanam importance and significance in Telugu. Read on