Latest Updates
-
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది
April 2021: ఏప్రిల్ లో ఉగాదితో పాటు ఏయే పండుగలు వచ్చాయో తెలుసా...
ఏప్రిల్ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు, వ్రతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
హిందూ పంచాంగం ప్రకారం, ఏప్రిల్ నెల అంటేనే ఫాల్గుణ మాసం, ఛైత్ర మాసం కలిసి ఉంటాయి. ఈ పవిత్రమైన పర్వదినాల్లో ఉగాది పండుగతో పాటు అనేక పండుగలు మరియు వ్రతాలు వచ్చాయి.

శ్రీరామ నవమి, హనుమాన్ జయంతితో పాటు ఇతర ముఖ్యమైన పండుగలు మరియు వ్రతాలన్నీ ఇదే మాసంలో జరుపుకోనున్నారు. దీంతో ఈ నెలకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది.

ఈ ఏడాదిలో తెలుగు రాష్ట్రాల ప్రజలు తెలుగు నూతన సంవత్సరంగా జరుపుకోనుండగా.. ఇతర రాష్ట్రాల వారు గుడి పడవ, ఇతర పేర్లతో ఈ పండుగను జరుపుకుంటారు. మరోవైపు క్రైస్తవులు పవిత్రమైన రోజుగా భావించే గుడ్ ఫ్రైడే, ఈస్టర్ కూడా ఇదే మాసంలో వచ్చింది. ఈ సందర్భంగా ఏప్రిల్ మాసంలో ఏయే తేదీల్లో ఏయే పండుగలు వచ్చాయి.. ఏయే రోజుల్లో వచ్చాయనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఏప్రిల్ 2న..
హిందూ పంచాంగం ప్రకారం, ఈ పండుగ ఫాల్గుణం లేదా చైత్ర మాసంలో క్రిష్ణ పక్షం పంచమి తిథి రోజున రంగ పంచమిని జరుపుకుంటారు. మన దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో రంగ పంచమి రోజున హోలీ ముగింపు వేడుకలు జరుపుకుంటారు. ఈ పండుగ ఈ సారి ఏప్రిల్ రెండోతేదీన వచ్చింది.

గుడ్ ఫ్రైడే..
క్రైస్తవులు ఎంతో పవిత్రంగా భావించే గుడ్ ఫ్రైడే కూడా ఈ ఏప్రిల్ మాసంలో రెండో తేదీనే వచ్చింది. ఏసు శిలువ చేయబడిన రోజుగా ఈరోజు స్మరించుకుంటారు. దీని తర్వాత మూడు రోజులకు అంటే ఆదివారం నాడు ఏప్రిల్ 4వ తేదీన ‘ఈస్టర్' పండుగను జరుపుకుంటారు.

ఏప్రిల్ 3, 4 తేదీల్లో
మన దేశంలోని చాలా రాష్ట్రాల్లో శీతలా సప్తమి, శీతల అష్టమి రోజున చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ మాసంలోని క్రిష్ణ పక్ష సప్తమి, అష్టమి తిథుల్లో నిల్వ ఉంచిన ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు. ఈరోజున ఇళ్లలో పొయ్యి, గ్యాస్ వంటి వాటిని వెలగించరు. ఇవి ఈ మాసంలోని మూడు, నాలుగు తేదీల్లో వచ్చాయి.

ఏప్రిల్ 7, 23వ తేదీల్లో..
ఈ ఏప్రిల్ మాసంలో రెండు విశిష్ట ఏకాదశులు వచ్చాయి. అవి ఒకటి పాపవిమోచని ఏకాదశి, రెండోది కామడ ఏకాదశి. ఈ పవిత్రమైన రోజుల్లో శ్రీ మహా విష్ణువును ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. ఇవి ఈ నెల ఏడో తేదీ, 23వ తేదీన వచ్చాయి. ఈ రెండు రోజుల్లో చాలా మంది హిందువులు ఉపవాసం ఉంటారు.

ఏప్రిల్ 13న
హిందువులు ముఖ్యమైన పండుగల్లో ఉగాది ఒకటి. ఈ పవిత్రమైన రోజు దేశవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటారు. తెలుగు నూతన ఏడాది కూడా ఈరోజు నుండే ప్రారంభమవుతుంది. ఈరోజున తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటకలో ఉగాది పండుగగా జరుపుకుంటారు. మహారాష్ట్ర, గోవాలో అయితే గుడిపడవ అని.. ఇతర ప్రాంతాల్లో మరికొన్ని పేర్లతో ఈ పండుగను జరుపుకుంటారు. ఇంతటి ప్రాధాన్యత ఈ పండుగ ఈ నెల 13వ తేదీన వచ్చింది.

ఏప్రిల్ 15, 21న..
మన తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉగాది రోజున నూతన సంవత్సర వేడుకలను జరుపుకుంటే.. పశ్చిమ బెంగాల్ ప్రజలు మాత్రం ఏప్రిల్ 15వ తేదీన గౌరీపూజ పేరిట వేడుకలను జరుపుకుంటారు. ఈ సమయంలో వారు శివపార్వతులను ఆరాధిస్తారు. అనంతరం శ్రీరాముడు జన్మించిన రోజు అంటే.. శ్రీరామ నవిమి కూడా ఇదే మాసంలో వచ్చింది. ఈ నెల 21వ తేదీన ఈ పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు.

ఏప్రిల్ 27న..
తెలుగు వారి నూతన సంవత్సరంలో తొలి పౌర్ణమి అంటే ఛైత్ర పౌర్ణమి తిథి రోజున హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున చాలా మంది హిందువులు ఉపవాసం ఉంటారు. తాము ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభించనప్పుడు, ఆ పని విజయవంతంగా పూర్తవడంతో హనుమంతుడి ఆశీర్వాదం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు.

ఏప్రిల్ 30న..
తెలుగు వారి నూతన సంవత్సరంలో హిందువులలో చాలా మంది వికట సంకష్ట చతుర్థి రోజు ఉపవాసం ఉండి.. వినాయకుడిని ఆరాధిస్తారు. ఈరోజు సూర్యోదయం నుండి సూర్యస్తమయం వరకు ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉంటారు. చంద్రుడి దర్శనం తర్వాత భోజనం చేస్తారు.



Click it and Unblock the Notifications