For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శ్రీకృష్ణుడికి తనే గొప్ప భక్తుడిని అని అనుకున్న అర్జునుడికి ఒక సన్యాసి చెప్పిన కథ ఏమిటో తెలుసా

కృష్ణ భగవానుడు లాంటి మహానుభావుడు అర్జునుడికి దొరకడం నిజంగా అదృష్టమే. యుద్ధంలో అర్జునుడు విజయం సాధించడానికి కృష్ణుడి సహకారం ఎంతో ఉంది. అర్జునుడి పాండవుల విజయం కోసమే శ్రీకృష్ణుడు రథసారథి గా మారాడు. ఇక ఒ

|

శ్రీకృష్ణుడు లేకుంటే మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు విజయం సాధించే వాడు కాదేమో. కృష్ణ భగవానుడు లాంటి మహానుభావుడు అర్జునుడికి దొరకడం నిజంగా అదృష్టమే. యుద్ధంలో అర్జునుడు విజయం సాధించడానికి కృష్ణుడి సహకారం ఎంతో ఉంది. అర్జునుడి పాండవుల విజయం కోసమే శ్రీకృష్ణుడు రథసారథి గా మారాడు. ఇక ఒక రోజు అర్జునుడు కృష్ణుడితో ఇలా అంటాడు. నాకంటే గొప్ప భక్తుడు ఈ ప్రపంచంలో నీకు ఎవరూ ఉండరేమో అనుకుంటున్నాను అని అంటాడు.

కృష్ణుడు ఈ ప్రశ్నకు నేరుగా సమాధానం ఇవ్వకుండా అర్జునుడిని అర్జునుడిని నిర్మానుషంగా ఉండే అటవీ ప్రాంతానికి తీసుకెళ్తాడు. శ్రీకృష్ణుడు అర్జునుడిని ఒక చెట్టు దగ్గర తీసుకెళ్తాడు. ఆ చెట్టు కింద ఒక ముని తపస్సు చేసుకుంటూ కూర్చొని ఉంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునా ఈయన అహింస వాది కేవలం పళ్లు కూరగాయలు తింటూ బతికే మనిషి అని అంటాడు.

అయితే అర్జునుడు దగ్గర ఉన్నటువంటి ఒక కత్తిని చూస్తాడు. అహింసావాది సన్యాసి అయితే కత్తి ఎందుకు పెట్టుకున్నాడని అర్జునుడు తన సందేహం వ్యక్తపరుస్తాడు. సరే నువ్వే నేరుగా వెళ్లి అడుగు. నువ్వు అర్జునుడివి అని అతనికి తెలియదు అని చెబుతాడు కృష్ణుడు.

అర్జునుడు వెళ్లి అడగ్గా.. అప్పుడు ఆ ముని ఈ విధంగా సమాధానం ఇస్తాడు. నేను ఈ సృష్టిలో నలుగురు వ్యక్తులను చంపాలనుకున్నాను. అందుకే ఈ కత్తిని నా దగ్గర ఉంచుకున్నాను అని ఆ మునివర్యులు అర్జునుడితో ఉంటాడు.

నారద ముని

నారద ముని

నారద మునిని. నారదున్ని ఎందుకు చంపాలనుకుంటున్నాను అంటే ఆయన ఎప్పుడూ శ్రీకృష్ణభగవానుని ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. నిత్యం నారాయణ నారాయణ అంటూ కృష్ణ పరమాత్మను తలుచుకుంటూ ఆ భగవంతున్ని నిద్రపోకుండా చేస్తూ ఉంటాడు. నారద ముని ప్రతిక్షణం కృష్ణ భగవాన్ ని తలచుకోవడం వల్ల ఆయన కొన్ని సార్లు నిద్ర నుంచి మేల్కొంటాడు. ఆయన కృష్ణ భగవాన్ ని ఆ విధంగా ఇబ్బంది పెడుతున్నందుకు చంపాలని నేను అనుకుంటున్నాను అని ఆ సన్యాసి అర్జునుడితో వివరిస్తాడు.

ద్రౌపది

ద్రౌపది

ఆ మునివర్యులు చంపాలనుకున్న టువంటి రెండో వ్యక్తి ద్రౌపది. పాండవులు వనవాసం చేసే సమయంలో ఒకరోజు వారు ఉండే ప్రాంతానికి దుర్వాస ముని వస్తాడు సాధారణంగా ఎవరైనా మునివర్యులు ఇంటికి గాని ఆశ్రమానికి గాని వస్తే వారికి కాస్త తాగడానికి నీళ్లు ఇచ్చి తినడానికి అన్నం పెట్టి మర్యాద చేయడం సంప్రదాయం. అయితే దుర్వాస ముని వచ్చే సమయానికి పాండవులు ఇంట్లో ఉన్న ఆహారం మొత్తం తిని బయటకు వెళ్తారు కాస్త ఉన్న అన్ని కూడా ద్రౌపది తింటూ ఉంటారు.

కృష్ణభగవానున్ని ప్రార్థిస్తుంది

కృష్ణభగవానున్ని ప్రార్థిస్తుంది

ఇక ఆ సమయంలో దుర్వాసముని రావడంతో ద్రౌపది కి ఏం చేయాలో అర్థం కాదు ఇంట్లో వండుదాం అంటే ఏమీ ఉండవు దీంతో ఆమె కృష్ణభగవానున్నిప్రార్థిస్తుంది. దుర్వాస ముని ఎలా మర్యాద చేయాలని భగవంతుని కోరుతుంది.అప్పుడు శ్రీకృష్ణపరమాత్ముడు ఇలా అంటాడు. నేను అన్నం తింటే కూడా ఆ దుర్వాసముని ఆకలి తీరినట్లు అవుతుంది అంటాడు.

Most Read :చాణక్య నీతి ప్రకారం ఈ ప్రాంతాల్లో మీరు అస్సలు ఉండకూడదు, అక్కడ ఉంటే జీవితం సర్వనాశనంMost Read :చాణక్య నీతి ప్రకారం ఈ ప్రాంతాల్లో మీరు అస్సలు ఉండకూడదు, అక్కడ ఉంటే జీవితం సర్వనాశనం

ఎంగిలి మెతుకులు

ఎంగిలి మెతుకులు

శ్రీకృష్ణుడికి తెలుసు పాండవుల ఉండే ఆశ్రమంలో తినడానికి ఏమీ లేవని కానీ కొద్దిగా ఉన్న తనకు వడ్డించమని ద్రౌపదిని కోరుతాడు. అప్పుడు ద్రౌపదితాను తినగా మిగిలిన ఎంగిలి మెతుకుల తో ఉన్నటువంటి ప్లేట్ ను శ్రీకృష్ణుడికి ఇస్తుంది. అందులో ఉన్న కొన్ని ఎంగిలి మెతుకులు శ్రీకృష్ణభగవానుడు తినడం వల్ల దుర్వాస ముని ఆకలి తీరుతుంది. అయితే ద్రౌపది అలా చేయడం ఈ సన్యాసికి నచ్చలేదు. తాను ఎంతో ఆరాధించే శ్రీకృష్ణపరమాత్ముడు చేతనే ఎంగిలి మెతుకులు తినిపించడానికి కోపం అందుకే ద్రౌపదిని చంపాలనుకుంటాడు.

ప్రహ్లాదుడు

ప్రహ్లాదుడు

ఇక నేను చంపాలనుకుంటున్న ఆ మూడో వ్యక్తి ప్రహ్లాదుడు అని చెబుతాడు ఆ సన్యాసి. ప్రహ్లాదుడు శ్రీకృష్ణుడికి గొప్ప భక్తుడు. ప్రహ్లాదుడి తండ్రికి కృష్ణుడు అంటే అస్సలు నచ్చదు. కానీ కృష్ణుడిపై ప్రహ్లాదుడు ఎంతో భక్తి పెంచుకుంటాడు. ఇది నచ్చక ప్రహ్లాదుడిని అతని తండ్రి హిరణ్యకశ్యపుడు చాలా రకాలుగా హింసిస్తాడు. కానీ శ్రీకృష్ణుడు ప్రహ్లాదుడుని కాపాడుతూ ఉంటాడు. ఈ క్రమంలో కృష్ణుడు నానా రకాలుగా బాధలు అనుభవించాడు. అవమానాలు భరించాడు. అందువల్ల ప్రహ్లాదుడిని చంపాలనుకుంటున్నాను అంటాడు ఆ సన్యాసి.

అర్జునుడు

అర్జునుడు

ఇక ఆ సన్యాసి చెప్పే నాలుగో పేరు అర్జునుడు. అర్జునుడి పేరు చెప్పడానికి ఒక్కటే కారణం. కురుక్షేత్రయుద్ధ సమయంలో అర్జునుడు కృష్ణుడిని తన రథ సారథిగా పెట్టుకుంటాడు. ఈ స్రుష్టి మొత్తానికి భగవంతుడు ఉన్న ఆయన్ని అలా రథసారథిగా మార్చడం నాకు నచ్చలేదు. అందుకే అర్జునుడిని చంపాలనుకుంటున్నాను అంటాడు ఆ సన్యాసి.

Most Read :శివ తాండవ స్త్రోత్రం చదివి పరమేశ్వరుడ్ని పూజిస్తే అన్ని శుభాలు, వందలాది ప్రయోజనాలు, అవేమిటో చూడండిMost Read :శివ తాండవ స్త్రోత్రం చదివి పరమేశ్వరుడ్ని పూజిస్తే అన్ని శుభాలు, వందలాది ప్రయోజనాలు, అవేమిటో చూడండి

అలా కృష్ణుడిపై ఉన్న తన ప్రేమనంతా వ్యక్తపరుస్తాడు ఆ సన్యాసి. అప్పుడు అర్జునుడు ఇలా అనుకుంటాడు. తనకంటే ఎంతో గొప్ప భక్తులు కృష్ణుడికి ఉన్నారు.. ఇతరుల భక్తితో పోలిస్తే తనది అంత పెద్ద భక్తికాదని అనుకుంటాడు.

English summary

Arjuna and the Ascetic story in telugu

The Story Of Arjuna's Pride And An Ascetic
Desktop Bottom Promotion