For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మంగళవారం రోజున పొరపాటున కూడా ఈ పనులు చేయకండి...!

మంగళవారం రోజున ఈ ఆరు పనులు చేయకండి.

|

హిందూ మతం ప్రకారం, మంగళవారం రోజున హనుమంతుడికి, దుర్గాదేవికి అంకితం చేయబడింది. వారాలలో మంగళవారాన్ని మూడో రోజుగా పరిగణిస్తారు. ఈరోజున ఆంజనేయుడిని ఆరాధించడం వల్ల ఎన్నో సమస్యలను మనల్ని కాపాడతాడని చాలా మంది నమ్ముతారు.

Astrology Tips: Do Not Do These Six Things on Tuesday

అయితే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మంగళవారం రోజున కొన్ని పనులు అస్సలు చేయకూడదట. పొరపాటున ఇలాంటి పనులు చేస్తే మీరు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుందట.

Astrology Tips: Do Not Do These Six Things on Tuesday

అంతేకాదు మీ జీవితంలోనూ చెడు ఫలితం వచ్చే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలోనూ ప్రశాంతత తగ్గిపోవచ్చు. ఈ సందర్భంగా మంగళవారం రోజున చేయకూడని ముఖ్యమైన పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

మీ ఇంటి నిర్మాణంలో ఈ తప్పులు ఎప్పటికీ చేయకండి...!మీ ఇంటి నిర్మాణంలో ఈ తప్పులు ఎప్పటికీ చేయకండి...!

లావాదేవీలు చేయకూడదు..

లావాదేవీలు చేయకూడదు..

మంగళవారం రోజున ఎలాంటి లావాదేవీలు చేయకూడదు. ఈరోజున ఆర్థిక పరమైన లావాదేవీల వల్ల కొన్ని ప్రతికూల సమస్యలు ఏర్పడతాయట. ముఖ్యంగా ఈరోజు రుణం ఇవ్వడం వంటివి చేయకూడదట. అలా తీసుకుంటే అవి తిరిగి చెల్లించడం చాలా కష్టమవుతుందట. కాబట్టి ఈరోజు పొరపాటున కూడా ఇలాంటి తప్పులు చేయకండి.

మద్యం, మాంసతం తీసుకోవద్దు..

మద్యం, మాంసతం తీసుకోవద్దు..

మంగళవారం రోజున మరిచిపోయి కూడా మద్యం, మాంసాన్ని తీసుకోరాదు. ఈరోజున వీటిని తీసుకోవడం వల్ల మీలో కోపం వంటివి పెరగొచ్చు. దీని వల్ల మీ కుటుంబం మరియు సామాజిక జీవితంపై ప్రతికూల ప్రభావం పడటం వంటివి ప్రారంభమవుతాయి.

పదునైన వస్తువులు..

పదునైన వస్తువులు..

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, మంగళవారం రోజున ఇలాంటి వస్తువులను ఎట్టి పరిస్థితిల్లోనూ కొనకూడదు. ఈరోజున ముళ్లు, కత్తి, కత్తెర వంటి పదునైన వస్తువులను అస్సలు కొనుగోలు చేయొద్దు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, అంగారకుడిని యుద్ధం మరియు కోపం ఉండే గ్రహాంగా భావిస్తారు. అందువల్ల ఈరోజున ఇలాంటి వస్తువులను ఇంట్లోకి తీసుకురావడం వల్ల కుటుంబ సభ్యులలో పరస్పర విభేదాలు పెరుగుతాయని నమ్ముతారు.

Yogini Ekadashi 2021: యోగిని ఏకాదశి రోజున ఉపవాసముంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా...!Yogini Ekadashi 2021: యోగిని ఏకాదశి రోజున ఉపవాసముంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా...!

నల్లబట్టలు ధరించొద్దు..

నల్లబట్టలు ధరించొద్దు..

ఈ రోజున కొత్త బట్టలు కూడా కొనకూడదు. ఈరోజున కొత్త బట్టలు వేసుకుంటే.. అవి ఇతర కారణాల వల్ల చినిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందట. అంతేకాదు ఈరోజున ధరించిన బట్టలు ఎక్కువ రోజులు మన్నిక కావు. అయితే హిందూ సంప్రదాయం ప్రకారం శుక్రవారం రోజున నూతన వస్త్రాలను కొనుగోలు చేయడం లేదా ధరించడం చాలా పవిత్రంగా భావిస్తారు. అలాగే ఎరుపు రంగు దుస్తులను వేసుకోవాలి. అలాగే నలుపు రంగు దుస్తులను తప్ప మిగిలిన రంగులో ఉండే బట్టలను వేసుకోవచ్చు. ఎందుకంటే నల్లని రంగు శని గ్రహానికి సంకేతం. శనితో అంగారక సంయోగం వల్ల చెడు ఫలితాలు రావొచ్చు. దీని వల్ల మీకు మానసిక మరియు శారీరక బాధలు పెరగొచ్చు. అలాగే శనితో సంబంధం ఉన్న నల్లని రంగులో ఉన్న కొత్త బూట్లను కూడా కొనకూడదు. ఈరోజున నల్లని బూట్లు వేసుకోవడం వల్ల గాయాలు కావొచ్చు.

కటింగ్ చేసుకోకూడదు..

కటింగ్ చేసుకోకూడదు..

మంగళవారం రోజున పొరపాటున కూడా గోళ్లు కత్తిరించుకోవడం.. షేవింగ్ చేసుకోవడం.. కటింగ్ వంటివి చేసుకోకూడదు. ఈరోజున ఇలాంటి పనులు చేయడం వల్ల ఆయష్షు తగ్గిపోతుందని పెద్దలు చెబుతారు. అంతేకాదు సమాజంలో కూడా మీకు గౌరవ మర్యాదలు తగ్గుతాయి. అందుకే మంగళవారం రోజున ఈ పనులు చేయడాన్ని నిషేధించారు. అలాగే మంగళవారం రోజున మసాజ్, మాలిష్ వంటివి అస్సలు చేయకూడదట. ఎందుకంటే ఇది మీ ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతుందట. ఈరోజున మరిచిపోయి మసాజ్ చేసుకున్నా కూడా అది మీ ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

పెట్టుబడులు పెట్టొద్దు..

పెట్టుబడులు పెట్టొద్దు..

మంగళవారం రోజున పెట్టుబడులు పెట్టడం శుభప్రదంగా ఉండదు. అయితే కొత్త పనులు ప్రారంభించుకోవచ్చు. అయితే పెట్టుబడులు మాత్రం మంగళవారానికి బదులు బుధవారం కొత్త పెట్టుబడి పెట్టాలి. ఒకవేళ మీరు మంగళవారం రోజున పెద్ద పెట్టుబడి పెడితే.. మీరు విజయవంతం కాలేరు. ఆర్థిక పరంగా కూడా నష్టం జరగొచ్చు.

English summary

Astrology Tips: Do Not Do These Six Things on Tuesday

Here we are talking about the astrology tips do not do these six things on tuesday. Have a look
Desktop Bottom Promotion