For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కార్తీక మాసం 2020 : ఈ మాసంలో పవిత్రమైన పర్వదినాలేవో చూడండి...

|

హిందూ సంప్రదాయం ప్రకారం ఈ మాసానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ మాసంలో నదీ స్నానాలు, దానాలు, జపాలు, పూజలు, దీక్షలు, ఉపవాస వ్రతాలు, దీపాలు వెలిగించడం.. లక్ష్మీదేవి, పరమేశ్వరుడిని పూజించడం చేస్తారు. ఇలా చేయడం వల్ల సకల జన్మల పాపాలు తొలగిపోతాయని చాలా మంది భక్తులు నమ్ముతారు.

'న కార్తీక నమో మాసః నదేవం కేశవాత్పరం! నచవేద సమం శాస్త్రం న తీర్థం గంగాయాస్థమమ్' అని స్కంద పురాణంలో చెప్పబడింది. అంటే 'కార్తీక మాసానికి సమానమైన మాసం ఏదీ లేదు. శ్రీ మహావిష్ణువుకు సమాన దేవుడు లేడు. వేదంతో సమానమైన శాస్త్రం ఏదీ లేదు. గంగతో సమానమైన తీర్థం ఏదీ లేదు' అని అర్థం.

కార్తీక మాసం అంటే పరమేశ్వరునికి అత్యంత ప్రీతి. ఈ కార్తీక మాసం నవంబర్ 16వ తేదీ సోమవారం ప్రారంభమవుతుంది. చాలా మంది హిందువులు ఈరోజును అత్యంత ముఖ్యమైన రోజుగా పరిగణిస్తారు. ఈ సందర్భంగా ఈ నెలలో వచ్చే కొన్ని ముఖ్యమైన పర్వదినాలేంటి.. ఈ మాసం యొక్క ప్రాముఖ్యతతో పాటు మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...

నియమ నిష్టలతో..

నియమ నిష్టలతో..

హిందువులు అత్యంత పవిత్రంగా భావించే కార్తీక మాసంలో చాలా మంది భక్తులు అత్యంత నియమ, నిష్టలతో పూజలను చేస్తారు. ఈ మాసమంతా మాంసాహారం జోలికే వెళ్లరు. కేవలం శాకాహారమే తీసుకుంటారు. అలాగే నదీ స్నానాలు చేస్తారు.

కార్తీక మాసంలో..

కార్తీక మాసంలో..

ఈ మాసంలో పగలంతా ఉపవాసం ఉండి రాత్రిపూట భోజనం చేయాలనేది ఒక నియమం ఉంది. దీనినే ‘నక్తమ్' అంటారు. పగలంతా ఆహారం తీసుకోలేనివారు పాలవంటి వాటిని లేదా ఏదైనా పండ్లను స్వీకరించేవారు. ఇక చీకటి పడే సమయంలో చంద్రుని దర్శనం తర్వాత దీపారాధన అనంతరం భోజనం చేసేవారు.

దీపారాధన..

దీపారాధన..

ఈ కార్తీక మాసంలో దీపారాధన చేయడం వల్ల జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు. ఈ నెలలో పరమేశ్వరుని ఆలయంలో గానీ లేదా ఇంట్లో అయినా ప్రాతఃకాలం, సాయంకాలం వేళ దీపారాధన చేయడం వల్ల దైవానుగ్రహం లభిస్తుంది. ఈ కార్తీక మాసంలో ఎవరైనా సరే, తెలిసిగాని.. తెలియకగాని, ఎక్కడైనా సరే దీపం పెడితే చాలు వారి పాపాలన్నీ పోతాయని పెద్దలు చెబుతారు. ఈ మాసంలో దీపారాధన చేయడం వల్ల స్త్రీలకు విశేష ఫలితాలుంటాయట.

ఇవి వాడకూడదు..

ఇవి వాడకూడదు..

ఈ మాసంలో కొన్ని వస్తువులను అస్సలు వాడకూడదట. ముఖ్యంగా మీరు తీసుకునే ఆహారంలో ఇంగువ, ఉల్లి, వెల్లుల్లి, ముల్లంగి దుంప, గుమ్మడికాయ, తీయగుమ్మడి, నువ్వులు నిషేధించబడినట్లు శాస్త్రాలు చెబుతున్నాయి.

దానధర్మాలు..

దానధర్మాలు..

ఈ మాసంలో చాలా మంది విరివిగా దానధర్మాలు చేసి మానవత్వం చాటుకుంటారు. ఈ సమయంలో ఎక్కువగా చల్లగాలులు వీస్తాయి కాబట్టి నిరుపేదలకు, అనాధలకు వెచ్చని స్వెటర్లు, దుప్పట్లు, కంబళ్లు దానం చేస్తే శివ కేశవుల యొక్క అనుగ్రహం లభిస్తుంది. దానధర్మాలు గోప్యంగా చేసిన వారికి ఎక్కువగా ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతుంటారు. వీటితో పాటు దీపాన్ని దానం ఇవ్వడం, నవధాన్యాలను లేదా అన్నదానం వంటివి చేస్తే స్త్రీలకు శుభఫలితాలు వస్తాయి. అలాగే తులసిపూజ, గౌరీపూజ చేయటం వల్ల ఆర్థిక బాధలన్నీ తొలగిపోతాయి.

ముఖ్యమైన తేదీలేవే..

ముఖ్యమైన తేదీలేవే..

నవంబర్ 18 - నాగుల చవితి, నవంబర్ 20 - తుంగభద్ర పుష్కరాలు.. నవంబర్ 21 - శ్రవణా నక్షత్ర పూజ.. నవంబర్ 25 - కార్తీక శుద్ధ ఏకాదశి..

నవంబర్ 28 - శని త్రయోదశి.. నవంబర్ 29 - కార్తీక పౌర్ణమి డిసెంబర్ 15 - పోలిస్వర్గం రోజున కార్తీక మాసం పూర్తవుతుంది.. ఈ పవిత్రమైన రోజుల్లో మాత్రం దీపారాధన చేయడం మరచిపోకండి. ఈ పర్వదినాలలో ఇంటి ముందు ఆవు పేడతో అలికి, ముగ్గులు వేసి, కార్తీక దీపం పెట్టి.. కార్తీక పురాణం చదివిన వారికి ఏడు జన్మలవరకూ వైధవ్యం కలగదని కార్తీక పురాణం చెబుతోంది.

English summary

Auspicious dates in Kartika masam 2020

Here we talking about the auspicious dates in kartika masam. Read on