Latest Updates
-
అమెరికాలో బ్యాన్, భారత్ లో బెస్ట్.. ఆవ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిదేనా? -
నోరూరించే కార్న్ చిల్లీ చీజ్ టోస్ట్.. పెనం మీదే నిమిషాల్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
అత్యంత తీవ్రంగా, సైకోల్లా ప్రవర్తించే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఉన్నారా? -
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే! -
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.! -
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.? -
వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా! -
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
మార్చి మాసంలో మంచి ముహుర్తాలు, పవిత్రమైన తేదీలివే...
మార్చి మాసంలో పవిత్రమైన తేదీలు.. శుభముహుర్తాలెప్పుడు వచ్చాయో తెలుసుకుందాం.
హిందూ పంచాంగం ప్రకారం, శీతాకాలం పూర్తిగా ముగిసింది. అదే సమయంలో వేసవి కాలం కూడా వచ్చేసింది. ఈ మార్చి మాసంలో చలి అంతగా ఉండదు కాబట్టి.. ఉదయాన్నే లేచి అన్ని పనులు త్వరగా చేసుకోవచ్చు.

ముఖ్యంగా ఇంట్లో పూజలు, హోమంతో పాటు శుభకార్యాలను ఉదయం నుండే ప్రారంభించవచ్చు. అయితే ఈ నెలలో ఏయే తేదీలలో మంచిగా ఉంటుంది.. ఈ నెలలో శుభ కార్యాలకు శుభ ముహుర్తాలు ఎన్ని ఉన్నాయి..

ఏ రోజున వివాహ పనులు మొదలెట్టొచ్చు.. ఏ సమయంలో వాహన కొనుగోలు చేయాలి.. కొత్త ఇంట్లోకి ఎప్పుడు అడుగుపెట్టాలనే వివరాలన్నింటినీ ఇప్పుడు తెలుసుకుందాం...

మార్చి 3వ తేదీ..
మార్చి 3వ తేదీ బుధవారం రోజున అన్నప్రసాసన, శ్రీమంతానికి, పిల్లలను ఊయలలో వేయుటకు అనువైనది. అలాగే ఏదైనా ఒప్పందాలకు, రిజిస్ట్రేషన్లకు, పెళ్లి చూపులతో పాటు సాధారణ కార్యక్రమాలకు అనుకూలంగా ఉంటుంది.

మార్చి 5, 7వ తేదీల్లో
2021 ఏడాదిలో మార్చి 5, 7 తేదీ అంటే శుక్రవారం నాడు మరియు ఆదివారం నాడు అన్నప్రసానకు, బారసాలకు, పెళ్లి చూపులకు, చిన్నారులకు ఊయలలో వేసేందుకు అనువైన రోజు.

మార్చి 8, ఆదివారం..
మార్చి ఎనిమిదో తేదీ అయిన సోమవారం నాడు పెళ్లిచూపులకు, అన్నప్రాసనకు, చిన్నారులను ఊయలలో వేసేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది.

మార్చి 14, 15వ తేదీల్లో..
మార్చి 14వ తేదీ అంటే ఆదివారం మరియు 15వ తేదీ సోమవారం హిందూ క్యాలెండర్ ప్రకారం, ఈ సమయం ఫాల్గుణ మాసం. ఈ పవిత్రమైన రోజు చిన్నారులకు ఊయలలో వేసేందుకు, పెళ్లి చూపులకు అనుకూలమైన రోజు. అదేవిధంగా వాణిజ్య పరంగా కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది.

మార్చి 19, 20, 21 తేదీల్లో..
ఫాల్గుణ మాసంలో అంటే మార్చి 19, 20, 21వ తేదీల్లో అంటే శుక్ర, శని, ఆదివారాల్లో వరుసగా పెళ్లిచూపులకు, అన్నప్రాసనకు, చిన్నారులను ఊయలలో వేసేందుకు అనుకూలమైన రోజు. అయితే ఆదివారం రోజున వాణిజ్యం, ఒప్పందాలకు వంటివి మరింత అనుకూలం.

మార్చి 22, 24, 26వ తేదీల్లో..
మార్చి 22, 24, 26వ తేదీల్లోనూ అంటే సోమవారం, బుధవారం, శుక్రవారం నాడు అన్నప్రసానకు, అగ్రిమెంట్లకు, చిన్నారులను ఊయలలో వేసేందుకు అనుకూలమైన రోజు. అయితే 24వ తేదీన ప్రత్యేకించి బుధవారం నాడు ఏదైనా ఒప్పందం చేసుకుంటారు.

మార్చి 27, 28, 29, 31వ తేదీల్లో..
మార్చి మాసంలోని చివరి రోజుల్లోని ఈ సమయంలో చిన్నారులను ఊయలలో వేసేందుకు, అన్నప్రాసనకు, బారసాలకు, సీమంతం వంటి శుభకార్యాలతో పాటు వాణిజ్యానికి చాలా అనుకూలమైనది. ఈ నాలుగురోజుల్లో 29, 31వ తేదీల్లో ప్రత్యేకించి వాణిజ్యం, పెళ్లి చూపులకు చాలా ప్రత్యేకంగా ఉంటుంది.
గమనిక : ఈ మార్చి మాసంలోని శుభకార్యాలు, శుభ ముహుర్తాల పండితులను సంప్రదించి అన్ని ప్రాంతాల వారి నుండి సమాచారం తీసుకుని ముహుర్తాలు తెలియజేయడం జరిగింది. కాబట్టి మీకు కావాల్సిన ముహుర్త సమయం, తేదీ గురించి మీరు వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని, మీ పుట్టిన తేదీ లేదా పేరు ఆధారంగా ముహుర్తాల గురంచి అందుబాటులో ఉన్న, అనుభవం ఉన్న పండితులను సంప్రదించడం మంచిది.



Click it and Unblock the Notifications
