For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2021 జూన్ మాసంలో వివాహ మరియు శుభ ముహుర్తాలివే...!

2021 జూన్ మాసంలో పెళ్లి ముహుర్తాలతో పాటు శుభ ముహుర్తాలెప్పుడొచ్చాయో తెలుసుకుందాం.

|

హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి నెలకూ ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాగే వైశాఖ మరియు జ్యేష్ట మాసానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ మాసంలో కూడా వివాహాది కార్యక్రమాలు విరివిగా జరుగుతూ ఉంటాయి.

Auspicious Wedding Dates with Muhurat Timings in June 2021

అయితే ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా అందరి జీవితాలు చిన్నభిన్నమయ్యాయి. కరోనా రెండో దశలోనూ అందరినీ అతలాకుతలం చేసింది.

Auspicious Wedding Dates with Muhurat Timings in June 2021

అయితే ఇప్పుడు రికవరీ రేటు మెరుగుపడటంతో పరిస్థితులు మెల్లగా సాధారణ స్థితికి వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ సడలింపులు ఇస్తున్నారు.

Auspicious Wedding Dates with Muhurat Timings in June 2021

కరోనా కారణంగా చాలా మంది కళ్యాణ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. అయితే జూన్ నెలలో మీరు వివాహం చేసుకోవాలని ప్లాన్ చేస్తుంటే, ఈ శుభ ముహుర్తాలలో ఆ ఘట్టాన్నిజరపొచ్చు. ఈ సందర్భంగా జూన్ మాసంలో ముఖ్యమైన తేదీలేవో ఇప్పుడు తెలుసుకుందాం...

శని జయంతి: శనీశ్వరుడిని ప్రసన్నం చేసుకునే జప మంత్రాలు...శని జయంతి: శనీశ్వరుడిని ప్రసన్నం చేసుకునే జప మంత్రాలు...

కరోనా కాలంలో కళ్యాణం..

కరోనా కాలంలో కళ్యాణం..

కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించనప్పటికీ.. చాలా రాష్ట్రాలు పాక్షిక లాక్ డౌన్ విధించాయి. పరిస్థితులను అదుపులో ఉంచడానికి రాష్ట్రాలు తమ పరిధిలో కర్ఫ్యూ మరియు ఇతర పరిమితులను విధించాయి. ఈ నేపథ్యంలో కళ్యాణం వంటి కార్యక్రమాలకు కొన్ని షరతులతో అంగీకారం తెలిపారు. కేవలం 50 మంది అతిథులతో వివాహాన్ని జరుపుకోవచ్చని ప్రభుత్వాలు అనుమతులిచ్చాయి. ఈలోపే చాలా మంది కళ్యాణ కార్యక్రమాలు కూడా నిర్వహించారు.

జూన్ మాసంలో శుభ ముహుర్తాలు..

జూన్ మాసంలో శుభ ముహుర్తాలు..

జూన్ 3, 2021, గుురువారం

ముహుర్తం : 6:35PM నుండి జూన్ 4వ తేదీ 5:23 గంటల వరకు

జూన్ 4, 2021, శుక్రవారం

ముహుర్తం : ఉదయం 5:23 నుండి మధ్యాహ్నం 3:10 గంటల వరకు

జూన్ 5, 2021, శనివారం

ముహుర్తం : ఉదయం 5:23 నుండి సాయంత్రం 4:48 గంటల వరకు

జూన్ 16, 2021, బుధవారం

ముహుర్తం : ఉదయం 5:23 నుండి రాత్రి 10:15 గంటల వరకు

జూన్ 19, 2021, గురువారం

ముహుర్తం ఉదయం 5:23 నుండి రాత్రి 8:29 గంటల వరకు

జూన్ 20, 2021, ఆదివారం

ముహుర్తం : రాత్రి 9 నుండి జూన్ 21వ తేదీ ఉదయం 5:24 గంటల వరకు

జూన్ 22, 2021, మంగళవారం

ముహుర్తం : మధ్యాహ్నం 2:23 నుండి జూన్ 23వ తేదీ ఉదయం 5:24 గంటల వరకు

జూన్ 23, 2021, బుధవారం

ముహుర్తం ఉదయం 5:24 నుండి ఉదయం 11:48 గంటల వరకు

జూన్ 24, 2021, గురువారం

ముహుర్తం : మధ్యాహ్నం 2:33 నుండి జూన్ 25వ తేదీ ఉదయం 5:25 గంటల వరకు

Solar Eclipse 2021: సూర్యగ్రహణం వల్ల ఈ 5 రాశుల వారికి ఇబ్బందులు...!Solar Eclipse 2021: సూర్యగ్రహణం వల్ల ఈ 5 రాశుల వారికి ఇబ్బందులు...!

మరిన్ని కార్యక్రమాలు..

మరిన్ని కార్యక్రమాలు..

ఈ నెలలో వివాహ కార్యక్రమాలు, అక్షరాభ్యాసం, అన్నప్రాసన, పెళ్లి చూపులు, వ్యాపారం, ఒప్పందాలు, డోలహరణ, సాధారణ కార్యాలు, గర్భదానం, శాంతి హోమాలకు, కొత్త ఇంట్లో ప్రవేశాలకు కూడా సమయం అనుకూలంగా ఉంది.

జులై 20 తర్వాత నిషేధం..

జులై 20 తర్వాత నిషేధం..

హిందూ క్యాలెండర్ ప్రకారం, 2021 జులై 20వ తేదీ శుక్ల పక్షానికి చెందిన దేవశయని ఏకాదశి తర్వాత వివాహాది కార్యక్రమాలతో పాటు అనేక శుభకార్యాలపై నిషేధం ఉంది. దీని తర్వాత నవంబర్ 15వ తేదీ దేవూతాని ఏకాదశి తర్వాత మాత్రమే వివాహాది కార్యక్రమాలు ప్రారంభమవుతాయి.

గమనిక : ఈ నెలలో వివాహ కార్యక్రమాలు, శుభముహుర్తాలన్నింటినీ అన్ని వర్గాల వారిని మరియు అన్ని ప్రాంతాల వారినీ దృష్టిలో ఉంచుకుని తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మీకు కావాల్సిన ‘ముహుర్త సమయం' కోసం మీ వ్యక్తిగత జాతక నిపుణుడిని సంప్రదించి, మీ జన్మ నక్షత్రం లేదా మీ పేరు, పుట్టిన సమయాన్ని బట్టి, అనుభవం ఉన్న జ్యోతిష్యపండితులతో పరిశోధన చేయించుకుని సరైన సమయం మరియు శుభముహుర్తం గురించి తెలుసుకోగలరు.

English summary

Auspicious Wedding Dates with Muhurat Timings in June 2021

Read on to know the Vivah shubh muhurat/dates in June 2021.
Desktop Bottom Promotion