For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ ఏడూ సాధారణ తప్పిదాలను శ్రావణ మాసంలో చేయకుండా జాగ్రత్త వహించండి.

ఈ ఏడూ సాధారణ తప్పిదాలను శ్రావణ మాసంలో చేయకుండా జాగ్రత్త వహించండి.

|

శ్రావణ మాసం ప్రారంభమవ్వబోతుంది. ఈ మాసంలో చేయబోయే పూజలకు ఇప్పటినుండే సన్నాహాలు మొదలయ్యాయి. ఈ మాసంలో ఉత్తర భారత దేశంలో శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతుంటాయి. ఎందుకంటే, ఆయన ఈ మాసానికి అధిదేవత. వాస్తవానికి, శ్రావణ మాసంలో జరిగిన సముద్రమధనంలో శివుడు ప్రధాన పాత్ర పోషించిన కారణంగా, ఈ నెల శివుడికి అంకితమివ్వబడింది. అతను గరళాన్ని దిగమింగి ఈ విశ్వాన్ని రక్షించాడు.

ఈ పవిత్ర మాసం పరమేశ్వరుని కృపాకటాక్షాలు పొందడానికి చాలా అనుకూలమైన సమయం. భక్తులు, ఉపవాసాలు, పూజలు, వ్రతాలు మరియు దానాల ద్వారా ఆయనను మెప్పించడానికి ప్రయత్నిస్తారు. ఇంతటి అంకితభావంతో ఆయనను పూజించేటప్పుడు, శ్రావణ మాసంలో ఏ తప్పిదాలను చేయకూడదో తెలుసుకోవడం అవసరం. మనమందరం, శ్రావణ మాసంలో ఆచరించకూడని ఆ విషయాలను గురించి తెలుసుకోవడం అతి ముఖ్యం. ఒకసారి అవేంటో చూద్దాం రండి!

పసుపు శివునికి నిశిద్దం

పసుపు శివునికి నిశిద్దం

పూజ సామగ్రిలో పసుపు ఉండేలా మనం ఎప్పుడు చూసుకుంటాం. స్త్రీ దేవతలకు పసుపును సమర్పిస్తారు. పసుపుతో మహిళలకు విడదీయరాని సంబంధం అందుకే ఉంటుంది. శివుడు తన యదార్ధ రూపంలో యోగి మరియు ఋషి (అతను పార్వతి దేవిని వివాహం చేసుకున్నప్పటికీ) గా చూడవచ్చు. అందువలన, పసుపు అతనికి సమర్పించరాదు. చాలామంది కుంకుమను కూడా సమర్పించరు.

శ్రావణ మాసంలో శివునికి పచ్చిపాల సమర్పించరాదు

శ్రావణ మాసంలో శివునికి పచ్చిపాల సమర్పించరాదు

సాధారణంగా పచ్చి పాలను శివుని అభిషేకానికి ఉపయోగిస్తారు, కానీ శ్రావణ సమయంలో అతనికి పచ్చి పాలు సమర్పించరాదు. కనుక, మీరు మరిగించిన తర్వాత మాత్రమే పాలను పూజకు ఉపయోగించాలి.

భక్తులందరు శ్రావణ మాసంలో

భక్తులందరు శ్రావణ మాసంలో

భక్తులందరు శ్రావణ మాసంలో, పొద్దుట ఆలస్యంగా మేల్కొనకూడదు. వారు త్వరగా మేల్కొని, బ్రహ్మ ముహూర్త సమయంలో స్నానం చేయాలి. బ్రహ్మ ముహూర్త సమయం సూర్యోదయానికి ముందు ఉదయం 4:00 నుండి 6:00 గంటల మధ్య వస్తుంది. ఈ సమయంలో శరీరంలోని సానుకూల శక్తి క్రియాశీలకంగా మారుతుంది కనుక భక్తులు తమ ఏకాగ్రతను భగవంతునిపై కేంద్రీకరిస్తారు.

శ్రావణ మాసంలో ఆకు కూరలు మరియు వంకాయలు అస్సలు తినరాదు

శ్రావణ మాసంలో ఆకు కూరలు మరియు వంకాయలు అస్సలు తినరాదు

పురాతన హిందూ మత గ్రంథాలు, శ్రావణ మాసంలో ఆకు కూరలు మరియు వంకాయలు అస్సలు తినరాదని చెప్తున్నాయి. ఈ నెలలో వీటిని తినడం అశుభంగా నమ్ముతారు. గ్రంథాలలో వంకాయలను అశుద్ధమైన కూరగాయలుగా వర్ణించారు.

ఈ నెలలో చెడు ఆలోచనలు మరియు ప్రతికూలతల నుండి

ఈ నెలలో చెడు ఆలోచనలు మరియు ప్రతికూలతల నుండి

ఈ నెలలో చెడు ఆలోచనలు మరియు ప్రతికూలతల నుండి దూరంగా ఉండండి. ఇవి మీ ఉపవాస దీక్షను విచ్ఛిన్నం చేసి శివుని అసంతృప్తికి గురిచేస్తుంది. ఈ నెలలో అమాయక ప్రాణులను హింసించడం వలన మీ జాతకంలో అశుభాలకు దారి తీస్తుంది. అందువల్ల, మీరు చేసే ప్రతి పని ఆలోచించి చేయండి.

మత్తుపదార్ధాలు మరియు మాంసాహారం ఈ నెలలో తీసుకోరాదు.

మత్తుపదార్ధాలు మరియు మాంసాహారం ఈ నెలలో తీసుకోరాదు.

మత్తుపదార్ధాలు మరియు మాంసాహారం ఈ నెలలో తీసుకోరాదు. అశుభకారకాలుగా భావించే ఈ ఆహారాలు శరీరంలో ప్రతికూల శక్తిని సక్రియం చేస్తాయి. ఇది దీర్ఘకాలంలో మన వ్యక్తిత్వంలో ప్రతిబింబిస్తుందని, లేఖనాల్లో చెప్పబడింది. తామసిక ఆహారాలుగా పిలువబడే ఈ ఆహారాలు, ధర్మానుసారం, ఒక వ్యక్తిలో అసుర ప్రవృత్తికి (రాక్షస లక్షణాలు) దారితీస్తాయి. ఈ నెలలో అమాయక జీవులను తిన్నా లేదా చంపినా జీవహత్యగా పరిగణించి హిందూమతం ప్రకారం పాపమని నమ్ముతారు.

ఈ మాసంలో, కుటుంబ సభ్యుల మధ్య శాంతి

ఈ మాసంలో, కుటుంబ సభ్యుల మధ్య శాంతి

ఈ మాసంలో, కుటుంబ సభ్యుల మధ్య శాంతి మరియు సామరస్యం వెలసిల్లేలా మసలుకోవాలి. కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణలు, ఇంట్లో ప్రతికూల శక్తికి స్థానం ఇస్తాయి. మీ పూజ ఫలవంతం కావడానికి, ఇంట్లో శాంతియుత వాతావరణం నెలకొని ఉండాలి.

English summary

Avoid Doing These 7 Common Mistakes During Shravana Month

Devotees offer prayers to Lord Shiva but they do not know that some common mistakes can create problems in their puja. All their fasts and penances might go futile if they are unaware of a few basic things. Not just the observer of the fast, but all members of the family must avoid doing certain things. A few of them include non-vegetarian food,
Desktop Bottom Promotion