రాత్రి సమయంలో హనుమాన్ చాలీసాను చదవటం వల్ల లాభాలు

By: Deepti
Subscribe to Boldsky

గోస్వామి తులసీదాసు అందించిన మేటి రచనల్లో హనుమాన్ చాలీసా ఒకటి. హిందూ మతంలో హనుమాన్ చాలీసాకి ప్రత్యేక స్థానం ఉంది. హనుమాన్ చాలీసా పఠనం వల్ల, హనుమంతుడ్ని మెప్పించి ఆయన దీవెనలు పొందవచ్చని అంటారు. హనుమాన్ చాలీసా చదవటం వల్ల శనిప్రభావం కూడా పోతుంది.

హనుమాన్ చాలీసా చదవటానికి ఒక సమయం, పద్ధతి ఉన్నాయి. అందులోని ప్రతి శ్లోకానికి ప్రత్యేక అర్థం ఉన్నది. హనుమాన్ చాలీసా పఠనం వల్ల ఒక వ్యక్తిపై అద్భుత ప్రభావం ఉందని అంటారు. పొద్దున లేదా రాత్రి ఈ హనుమాన్ చాలీసా చదవటానికి మంచి సమయాలు. శనిప్రభావం ఉన్నవారు ప్రతిరాత్రి హనుమాన్ చాలీసాను 8సార్లు చదవటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

రాత్రి సమయంలో హనుమాన్ చాలీసాను చదవటం వల్ల లాభాలు

హనుమాన్ చాలీసా రాత్రిపూట చదవటం వల్ల ఉపయోగాలు చూద్దాం;

హనుమంతుడిని పవనపుత్రుడని ఎందుకు పిలుస్తారు? వాయు పుత్రుడుగా ఎలా పుట్టాడు

హనుమాన్ చాలీసా ముందు పంక్తులు 8 సార్లు చదవటం వల్ల ఎవర్ని అయినా నిందించటం వల్ల చేసిన పాపాలు తొలగిపోతాయి.

రాత్రి హనుమాన్ చాలీసా పఠనం వల్ల దుష్టశక్తుల నీడ మీ జీవితంపై నుంచి తొలగిపోతుంది. పిల్లలకి దెయ్యాలంటే భయం ఉన్నప్పుడు భయం పోగొట్టుకోడానికి రాత్రిపూట వారు ఇది చదవడం మంచిది.

హనుమాన్ చాలీసా చదవటం వల్ల హనుమంతుడి కృపకి పాత్రులయి మీ కష్టాలను తొలగించుకోగలుగుతారు.

సింధూర ప్రియుడు హనుమంతుని తోకకు వెన్న రాసే ఆచారం వెనుక దాగున్న రహస్యం..

ఏదైనా పెద్దపనిలో విజయం సాధించాలనుకుంటే, మంగళ, గురు, శని లేదా మూలా నక్షత్రం ఉన్నరోజు రాత్రులు 108 సార్లు ఇది చదివితే మంచిది.

సరియైన శ్రద్ధ, విశ్వాసంతో హనుమంతుడి అనుగ్రహం కలిగి మీరు కోరుకున్నవన్నీ సాధించగలుగుతారు.

English summary

Benefits Of Reciting Hanuman Chalisa At Night

The best time to recite Hanuman Chalisa is in the morning and at night. Those under the evil influences of the Saturn should chant the Hanuman Chalisa at night 8 times on Saturdays for better results.
Story first published: Sunday, June 25, 2017, 13:00 [IST]
Subscribe Newsletter