హిందూ పురాణాల ప్రకారం ఉత్తమ తండ్రి

By: Gandiva Prasad Naraparaju
Subscribe to Boldsky

తల్లిలాగే, తండ్రికూడా పిల్లల పెంపకంలో గొప్ప పాత్రను పోషిస్తాడు. తల్లి చాలా మృదువైన స్వభావం కలది, ప్రేమగా బిడ్డను పెంచుతుంది. మరోవైపు, తండ్రి చాలా బలవంతుడు, పిల్లలతో చాలా చనువుగా ఉంటాడు. చాలామంది పిల్లలకు వారి తండ్రే ఒక నాయకుడు, పిల్లలు వారి అడుగుజాడలను అనుసరించే ఒక రోల్ మోడల్.

హిందూ పురాణాలలో బలమైన, ఆకర్షణీయమైన కుమారులు, కుమార్తెలను పెంచిని గొప్ప తండ్రులు అనేకమంది ఉన్నారు. వారి పాత్రల ధర్మాలను, ఉదాత్తతను తెలియచేసే అనేక కధలు ఉన్నాయి. ఈ కధలు ఆకాలం కొడుకులు, కుమార్తెలు వారి తండ్రులను ఎలా గౌరవి౦చే వారో ప్రతి ఒక్కరూ ప్రతిఒక్కటీ తెలుసుకోవాలని చెప్పారు.

శివ పురాణ రహస్యాలు: శివుని దృష్టిలో ఈ పాపాలు చేసేవారికి పాపవిముక్తి దక్కనట్లే..!

ఈరోజుల్లో, ఫాదర్స్ డే సందర్భంగా, తల్లిదండ్రులు, ముఖ్యంగా తండ్రులు గొప్ప గౌరవాన్ని పొందిన కొన్ని కధలు మేము తీసుకోచ్చము. తండ్రి మాట కోసం కొంతమంది చనిపోయారు, మరికొందరు తమ తండ్రిమాటను అనుసరించారు. మరిన్ని విషయాలు చదివి తెలుసుకోండి.

best father according to hindu mythology

హిందూ పురాణాల ప్రకారం ఉత్తమ తండ్రి

దశరధుడు, రాముడు

అయోధ్యకు రాజు దశరధుడు, ఆయన మొదటి కుమారుడు రాముడు. దశరధుడి తరువాత రాముడు సింహాసనాన్ని అధిరోహించాలి. కానీ దశరధుడి రెండో భార్య కైకేయి రాముడిని రాజ్య బహిష్కరణ చేసి; ఆమె కుమారుడైన భరతుడికి పట్టాభిషేకం చేయమని కోరింది. పూర్వం దశరధుడు ఆమెకు ఇచ్చిన వరాలను ఆమె ఉపయోగించుకుంది. దశరధుడు ఏమీ చేయలేకపోయాడు. రాముడు వెంటనే ఎటువంటి బాధ లేకుండా తల్లి కోరికను అంగీకరించి, అడవులకు వెళ్ళిపోయాడు. రాముడు తన తండ్రి దశరధుడు సవతి తల్లి కైకకు ఇచ్చిన వరం కారణంగా తండ్రి మాటని గౌరవించడం కోసం ఇలా చేసాడు.

best father according to hindu mythology

హిందూ పురాణాల ప్రకారం ఉత్తమ తండ్రి

శంతనుడు, భీష్ముడు

హస్తినాపురానికి రాజు శంతనుడు. ఇతనికి గంగ వల్ల దేవవ్రతుడు అనే కుమారుడు జన్మించాడు. తరువాత, శంతనుడు చేపలుపట్టే వాని కుమార్తె అయిన సత్యవతిని ప్రేమించాడు. శంతనునికి ఇప్పటికే ఒక కుమారుడు ఉన్నాడు, ఇతని తరువాత అతనే రాజు అని తెలుసుకుని సత్యవతి శాంతనుడిని వివాహం చేసుకోడానికి నిరాకరించింది. ఆమె శాంతనుడిని పెళ్ళిచేసుకుంటే, తన కుమారులు రాజ్యాన్ని స్వీకరించలేరు, దేవవ్రతుని కిందే ఉంటారు అని అనుకుంది. దేవవ్రతుడు ఈ విషయం తెలుసుకుని, తన సింహాసనాన్ని పరిత్యజించాడు. ఈ భయంకరమైన ప్రతిజ్ఞ కారణంగా, దేవవ్రతుడు భీష్ముడిగా పిలవబడ్డాడు. భీష్ముడు ఇదంతా తన తండ్రి సంతోషం కోసం చేసాడు.

best father according to hindu mythology

హిందూ పురాణాల ప్రకారం ఉత్తమ తండ్రి

నిద్రించే సమయంలో రుద్రాక్షమాలను ధరించవచ్చా..?

జమదగ్ని, పరశురాముడు

పరశురాముడు విష్ణుమూర్తి ఆరో రూపం. ఈయన జమదగ్ని, అనసూయలకు జన్మించాడు. ఒకసారి, రేణుక నీటికోసం నదికి వెళ్ళింది. అక్కడ, ఆమె ఒక రాజు తన ఉంపుడుగత్తేలతో ఉండడం చూసింది. ఆ వెంటనే, రేణుక మనసు చలించి, తీవ్రమైన లైంగిక వాంఛలకు దారితీసింది. ఆమె భర్త జమదగ్ని, తన శక్తి వల్ల అక్కడ ఏమి జరిగిందో తెలుసుకున్నాడు. కోపంతో, తన కుమారులను పిలిచి భార్యను చంపమన్నాడు. పెద్ద పిల్లలు అతని మాట వినలేదు, పరశురాముడిని ఈపని చేయమన్నాడు. పరశురాముడు వెంటనే తన తల్లి తలను నరికాడు. పరశురాముడి విధేయతకు సంతోషించి, జమదగ్ని ఒక వరం కోరుకోమన్నాడు. అప్పుడు పరశురాముడు తన తల్లిచేసిన తప్పును క్షమించి ఆమెకు తిరిగి ప్రాణదానం చేయమని అడిగాడు.

English summary

Best Father According To Hindu Mythology

These are the best fathers according to the Hindu mythology. Read to know more.
Story first published: Sunday, July 2, 2017, 10:00 [IST]
Subscribe Newsletter