Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పూజలలో పోక చెక్కను వాడే విధానం
పూజలలో పోక చెక్కను వాడే విధానం.చందనం విష్ణు మూర్తికి ప్రీతిపాత్రమైనది. శివునికి శ్వేత పుష్పాలు ప్రీతికరమైనవి. అతనికి చందనం సమర్పించరు. హనుమంతుడు శివుని అవతారమైనప్పటికిని, అతనికి చందన సమర్పణ చేస్తారు.
హిందూమతం లో చాలా సంప్రదాయాలను అనుసరిస్తారు. ఆచారాలు, పవిత్ర అర్పణలు మరియు మంత్రాలు, వేద పురాణాల్లో పేర్కొనబడిన పురాతన సంప్రదాయాలకు వన్నె తీస్తాయి. మనం ఈ ఆచారాలు పాటించే సమయంలో, అనేక పవిత్రమైన వస్తువులను సమర్పిస్తాము. దీనిమూలంగా దైవం ప్రసన్నమై మన మనోవాంఛలు సిద్ధిస్తాయి. శుభాకాంక్షలు త్వరగా నెరవేరతాయి. ఉదాహరణకు, కుంకుమను స్త్రీ దేవతలు మరియు హనుమంతుని పూజకు వినియోగిస్తాము.
చందనం విష్ణు మూర్తికి ప్రీతిపాత్రమైనది. శివునికి శ్వేత పుష్పాలు ప్రీతికరమైనవి. అతనికి చందనం సమర్పించరు. హనుమంతుడు శివుని అవతారమైనప్పటికిని, అతనికి చందన సమర్పణ చేస్తారు. వినాయకునికి ఎప్పుడూ తులసి దళాలు సమర్పించరాదు. ఈ వస్తువుల వినియోగం వెనుక ఒక నమ్మకం లేదా కథ దాగి ఉంటాయి.
పోక చెక్క ఒక పవిత్రమైన పూజ వస్తువు. ఇది వాతావరణ శుద్ధికి మరియు భక్తుని ఏకాగ్రత సిద్ధికి వినియోగిస్తారు. పోకచెక్కను ఉపయోగించి చేసే కొన్ని పరిహారాల ద్వారా జీవితంలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలను పరిష్కరించుకోవచ్చు.

1. పసుపు పచ్చని గుడ్డలో పోక చెక్క పెట్టి గణేశుని ఆర్ధించాలి. పసుపు, కుంకుమ మరియు అక్షతలు ఉపయోగిస్తూ, మంత్రాలను ఉపయోగిస్తూ లక్ష్మీ పూజ చేయండి. ఇలా మంచి ముహూర్తంలో చేయాలి.
2. శ్రీయంత్రంను ఎర్రగుడ్డపై పెట్టి, మధ్యలో పోక చెక్కను ఉంచాలి. ఇలా చేస్తే వినాయకుని దీవెనలు పొందుతారు. వినాయకుడు మన లక్ష్య సాధన దిశలో ఎదురయ్యే విఘ్నాలను తొలగించి, సంపదను పొందేట్టు చేస్తారు.
3. పోక చెక్కను వెండి గిన్నెలో పెట్టు తూర్పు మరియు ఉత్తర దిక్కుగా పెట్టాలంటారు. దీనికి రోజు పూజలు సమర్పిస్తే, ఇంట్లో శాంతి, సహృద్భావం నెలకొంటాయి.
4. మనం చదివిన మంత్రాలను గ్రహించుకున్న ఆ పోక చెక్క ఆర్ధిక సమస్యలను తొలగించడంతో సహాయ పడుతుంది.
5. రాగి గిన్నెలో నీటిని నింపి, కొంత ధనం మరియు పోక చెక్కను ఉంచి , గుడిలో సమర్పిస్తే, మనోవాంఛలు సిద్ధిస్తాయి.
6. ధనం ఉంచిన అరలో, శ్రీయంత్రం మరియు పోక చెక్క పెడితే, ఖర్చులు తగ్గి, సంపద పెరిగేట్టు చేస్తుంది.
7. గణేశుని విగ్రహాలలో కొన్నింటికి తొండం కుడివైపుకు, మరి కొన్నింటిలో, ఎడమవైపుకు తిరిగి ఉంటాయి. కుడివైపుకు తొండం తిరిగి ఉన్న విగ్రహం ముందు పోక చెక్క మరియు లవంగం పెట్టి పూజ చేస్తే, జీవితంలో ఎదురయ్యే పలు సమస్యలు పరిష్కారమవుతాయి.
అయినప్పటికీ, కొంతమంది ఈ పరిహారాలను వీటిని పాటించక, ప్రతిరోజు పూజలో అమలుచేయాల్సిన క్రియలను విస్మరిస్తారు. ఆ సమాచారం మీ కొరకు మేము ఒక చోట పొందుపరిచాము.

1. తిలకాన్ని ఉంగరం వేలితో మాత్రమే ధరించాలి. మరే వేలిని ఉపయోగించరాదు.
2. శివునికి ఎప్పుడూ పసుపు సమర్పించరాదు.
3. హారతి ఇచ్చాక దీపాన్ని దేవుని ముందే ఉంచాలి. మరేచోట పెట్టరాదు.
4. వాడిన పూవులను భగవంతునికి సమర్పించరాదు.
5. వినాయకునికి ఎప్పుడూ తులసి దళాలు సమర్పించరాదు.
6. సూర్యునికి ఎప్పుడూ బిల్వ పత్రాలు సమర్పించరాదు.
7. సూర్యాస్తమయ అనంతరం పూవులను, ఆకులను కోయరాదు.
8. ప్రతిదినం పూజచేసాక సూర్యునికి నీటిని సమర్పించడం విస్మరించరాదు.
9. సాయంత్ర పూజ అనంతరం దేవుని గాడి లేదా దేవుని పూజించే స్థలాన్ని పరదాతో మూసి ఉంచండి.
10. పూజలో తమలపాకులను వాడటం మరువకండి.



Click it and Unblock the Notifications