For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Bhadrapada Masam 2020 : భాద్రపద మాసంలో వినాయక చవితితో పాటు మరికొన్ని ముఖ్య పండుగలివే...

భాద్రపద మాసంలో వచ్చే పండుగలేంటో.. వాటి విశిష్టత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

|

హిందూ పంచాంగం ప్రకారం పూర్వభాద్ర లేదా ఉత్తరభాద్ర పూర్ణిమ నాడు ఉండే మాసానికి భాద్రపద మాసం అనే పేరు ఉంది. ఈ సంవత్సరం మనకు ఆగస్టు 20వ తేదీ నుండి భాద్రపద మాసం ప్రారంభం కాబోతుంది.

Bhadrapada Masam : Festivals in the Month of Bhadrapada

పూర్ణిమ నాటి ముందు మరియు తర్వాత ఉండే మాసం భాద్రపద మాసం. భద్రమైన దాన్ని ఇవ్వగలిగే మాసాన్ని భాద్రపద మాసం అంటారు. మనుషులు సుఖం, ఆనందం, రక్షణ వంటి వాటిని ఇచ్చేదే ఈ మాసం.

Bhadrapada Masam : Festivals in the Month of Bhadrapada

ఈ భాద్రపద మాసంలో ముందుగా వచ్చే పండుగ వినాయకచవితి.. అటు పిమ్మట బలరామ జయంతి, వామన జయంతి, వరాహా జయంతి, రుషి పంచమి, రాధాష్టమి కూడా వస్తుంది.

Bhadrapada Masam : Festivals in the Month of Bhadrapada

ఈ పండుగలతో పాటు అనంత పద్మనాభ వ్రతం, గౌరీ వ్రతం, మహాలయ పక్షాలు కూడా మొదలవుతాయి. ఇలా నాలుగు జయంతులు.. నలుగురు అవతార పురుషులైన దేవతామూర్తులు జన్మించినటువంటి మాసం ఈ భాద్రపద మాసం ఇదంతా ఒక్క శుక్ల పక్షంలోనే.

Bhadrapada Masam : Festivals in the Month of Bhadrapada

ఆ తర్వాత వచ్చే క్రిష్ణ పక్షంలో పితృదేవతలకు నైవేద్యం సమర్పించడం.. ఆ వెంటనే మనకు ఉండ్రాళ్ల తది వస్తుంది. ఇలా అనేక పండుగలు.. జయంతులు, వ్రతాలు, పూజలు చేసే శుభప్రదమైన మాసం ఈ భాద్రపద మాసం. ఈ కాలంలో పితృదేవతలకు రెండో పక్షం కేటాయించిబడినందున ఈ కాలంలో ఎక్కువగా శుభకార్యాలు చేయడం అనే జరగదు.

Bhadrapada Masam 2020 : దోషాలు తొలగిపోవడానికి భాద్రపద మాసంలో ఏమి చేయాలంటే...!Bhadrapada Masam 2020 : దోషాలు తొలగిపోవడానికి భాద్రపద మాసంలో ఏమి చేయాలంటే...!

కల్కి జయంతి..

కల్కి జయంతి..

శ్రీ శార్వరి నామ సంవత్సరంలోని భాద్రపద మాసంలో మొట్టమొదట వచ్చే పండుగ కల్కి జయంతి. ఆగస్టు 20వ తేదీన ఈ పండుగతో భాద్రపద మాసం ప్రారంభమవుతుంది. 21వ తేదీన సువర్ణగౌరీ వ్రతం వస్తుంది.

వినాయక చవితి..

వినాయక చవితి..

హిందువులందరూ ఏ పూజ చేయాలన్నా.. ఏ పని చేయాలన్నా తొలుత గుర్తొచ్చేది గణపతి దేవుడే. వినాయకుడు పుట్టిన రోజునే వినాయక చవిత పండుగగా జరుపుకుంటారు. దీనికి రకరకాల ప్రాంతాల్లో అనేక పేర్లు ఉన్నాయి. కొన్నిచోట్ల గణపతి చవితి అని, గణేష్ చతుర్థి అని, మరికొన్ని చోట్ల వినాయక చవితి అని పిలుస్తుంటారు. ఈరోజు హిందువులలో చాలా మంది నియమ నిష్టలతో పూజలు చేస్తారు. వినాయకుడికి 21 రకాల పత్రాలతో పూజించి ఉండ్రాళ్లు నైవేద్యం పెడతారు. విద్యార్థులు గణపతి విగ్రహం దగ్గర పుస్తకాలను పెట్టి పూజిస్తారు. ఇక చాలా మంది గుంజిల్లు కూడా తీస్తారు.

పరివర్తన ఏకాదశి..

పరివర్తన ఏకాదశి..

ఈ నెలలో వచ్చే తొలి ఏకాదశి రోజున శేషతల్పంపై శయనించిన మహావిష్ణువు ఈరోజున వేరేవైపునకు తిరుగుతాడని, అనగా పరివర్తనం చెందుతాడని పండితులు చెబుతారు. అందుకే ఈ ఏకాదశిని పరివర్తన ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి వ్రతం ఆచరించడం వలన కరువు కాటకాలు రావని, ఒకవేళ వచ్చినా వాటి నుండి ఎలా బయటపడాలో తెలుస్తుందని చాలా మంది నమ్ముతారు.

ధోనీ రిటైర్మెంటుకు ముందు వెళ్లిన ఈ ఆలయం ప్రత్యేకతలేంటో తెలుసా...ధోనీ రిటైర్మెంటుకు ముందు వెళ్లిన ఈ ఆలయం ప్రత్యేకతలేంటో తెలుసా...

వామన జయంతి..

వామన జయంతి..

శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఒకటైన వామన జయంతి కూడా ఈ నెలలోనే వస్తుంది. శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తిని తన మూడు అడుగులతో పాతాళానికి పంపిన అవతారం. ఈరోజున వామన దేవునికి పూజ చేసి, నైవేద్యం పెట్టి పెరుగును దానం చేయాలని చెబుతారు.

అనంత పద్మనాభ చతుర్దశి..

అనంత పద్మనాభ చతుర్దశి..

శ్రీ మహావిష్ణువుకు ఉండే పేర్లలో అనంత పద్మనాభ చతుర్దశి ఒకటి. శ్రీమహావిష్ణువు అనంతుడని నమ్ముతూ హిందువులు అనంత పద్మనాభ చతుర్దశి లేదా అనంతవ్రతం అనే పేర్లతో పిలుస్తారు.

ధర్మప్రభ ఏకాదశి..

ధర్మప్రభ ఏకాదశి..

ఈ మాసంలో వచ్చే అజ ఏకాదశిని ధర్మప్రభ ఏకాదశి అని కూడా అంటారు. పురాణాల ప్రకారం హరిశ్చంద్రుడు అన్నీ పొగొట్టుకున్న సమయంలో కాటికాపరిగా ఉంటూ ఈ ఏకాదశి రోజున వ్రతం చేయడం వల్ల తిరిగి సుఖ సంపదలు, ఆయురారోగ్యాలు, రాజభోగాలు పొందాడని పండితులు చెబుతుంటారు.

అలాగే ఈ నెలలో వచ్చే పండుగల సమయంలో పేదలకు దానధర్మాలు చేస్తే కచ్చితంగా మంచి ఫలితం వస్తుంది.

English summary

Bhadrapada Masam : Festivals in the Month of Bhadrapada

Here we talking about Bhadrapada masam : festivals in the month of bhadrapada. Read on
Desktop Bottom Promotion