Latest Updates
-
అత్యంత తీవ్రంగా, సైకోల్లా ప్రవర్తించే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఉన్నారా? -
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే! -
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.! -
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.? -
వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా! -
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో డయాబెటిస్ బాధితులకు ఇన్ఫెక్షన్ ముప్పు మరింత తీవ్రం.. కారణాలివే.! -
పచ్చి కొబ్బరి మసాలాతో అదిరిపోయే కర్ణాటక స్పెషల్ చిత్రాన్నం.. ఒక్కసారైనా రుచి చూడాల్సిందే.!
చాణక్య నీతి ప్రకారం ఈ ప్రాంతాల్లో మీరు అస్సలు ఉండకూడదు, అక్కడ ఉంటే జీవితం సర్వనాశనం
మీకు ఆదాయం లేని చోట మీరు ఎక్కువ కాలం ఉండడం మంచిది కాదు. ఎందుకంటే మీరు అక్కడ ఎన్ని రోజులు ఉన్న కూడా మనుగడ సాధించలేరు. ఎదగలేరు. అందువల్ల ఆ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయత్నించండి. వృత్తి
చాణక్య నీతి గురించి మనకు తెలుసు. చాణుక్యుడు చెప్పిన ప్రకారం వెళ్తే చాలా విషయాల్లో విజయాలు సాధించొచ్చు. ఒక్కోసారి ఎంత తెలివైన వ్యక్తి అయినా సరే నిర్ణయాలు తీసుకోవడంలో ముందడుగు వేయడంతో చాలా ఇబ్బందులుపడాల్సి వస్తుంది.

చాణక్య నీతి ప్రకారం మీరు కొన్ని ప్రాంతాల్లో అస్సలు ఉండకూడదు. అలా ఉంటే మీ జీవితం సర్వనాశనం అవుతుంది.

1. గౌరవం లేనిచోట
మీకు గౌరవం లేని చోట ఒక్క క్షణం కూడా ఉండకండి. మీరు అక్కడే ఉండడం వల్ల మీ ఆత్మవిశ్వాసం దెబ్బతినే అవకాశం ఉంది. మీరు వృత్తి పరంగా అక్కడ ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఒక్కసారి మీకు గౌరవం పోతే తర్వాత అక్కడ మీ పరిస్థితి మరింత
ఘోరంగా మారుతుంది.
విశ్వసించని వ్యక్తులతో..
మీపై నమ్మకం లేని వ్యక్తులతో మిమ్మల్ని విశ్వసించని వ్యక్తులతో పాటు ఉండడం మంచిది కాదు. మీరు అక్కడే ఉండే పక్కనున్న వ్యక్తులు కూడా మిమ్మల్ని గౌరవించడం మానేస్తారు. అందుకే గౌరవపూర్వకంగా మీరు ఆ ప్రాంతాన్ని విడిచి రావడం ఉత్తమం.

2. ఆదాయం లేని చోట
మీకు ఆదాయం లేని చోట మీరు ఎక్కువ కాలం ఉండడం మంచిది కాదు. ఎందుకంటే మీరు అక్కడ ఎన్ని రోజులు ఉన్న కూడా మనుగడ సాధించలేరు. ఎదగలేరు. అందువల్ల ఆ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయత్నించండి. వృత్తి పరంగా కూడా మీకు ఎదుగుదల ఉండదు.

3. స్నేహితులు లేదా బంధువులు లేని చోట
మీకు స్నేహితులు లేదా బంధువులు ఎవరూ లేని చోట మీరు ఎక్కువగా ఉండకండి. ఎందుకంటే అలాంటి ప్రాంతంలో మీకు ఏదైనా కష్టం వస్తే మీకు అండంగా నిలబడే వారు ఎవరూ ఉండరు. అందువల్ల మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి ప్రాంతాల్లో ఉండకండి. మీకు ఇబ్బందులు వచ్చినప్పుడు మీ పరిస్థితి మరింత దిగజారిపోతుంది.

4. సమాచారం లభించని చోటులో
మీకు సరైన సమాచారం లభించని చోటులో కూడా మీరు ఉండడం మంచిది కాదు. ఎందుకంటే ఆ ప్రాంతంలో మీరు ఉండడం వల్ల మీరు కొత్త విషయాలు నేర్చుకోలేరు. అందువల్ల ఎలాంటి పరిస్థితుల్లోనూ అలాంటి ప్రాంతంలో ఉండకండి.
ప్రతి వ్యక్తి ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ ఉండాలి. అలా కాకుంటే మీరు జీవితంలో ఎదగలేరు. అందువల్ల మీరు ఎదగడానికి అనుకూలంగా ఉండే ప్రాంతాలను ఎంచుకోండి.



Click it and Unblock the Notifications
