For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రామాయణం, మహాభారతం- రెండింటిలోనూ కనిపించే ఒకే పాత్రలు

By Super
|

రామాయణ మహాభారతాలు హిందూ పురాణాలలో మహా కావ్యాలుగా పూజింపబడుతూ యుగయుగాలుగా గౌరవించబడుతున్నాయి. హిందువులు వీటిని కేవలం కధలుగా కాకుండా ఇతిహాసం లేదా చరిత్ర గా భావిస్తారు.ఈ కావ్యాలలో వర్ణించబడిన సంఘ్తటనలు నిజం గా జరిగాయని, మరియూ వాటిలోని పాత్రధారులు ఒకప్పుడు రక్త మాంసాలతో కూడిన శరీరం తో భూమి మీద తిరిగారనీ హిందువుల విశ్వాసం.

రామాయణం త్రేతా యుగం(యుగాలలో రెండవది)లో జరిగితే, మహాభారతం ద్వాపర యుగం(మూడవ యుగం) లో జరిగింది. ఈ రెంటి నడుమ చాలా సంవత్సరాల వ్యత్యాసం(బహూశా కొన్ని మిలియన్ల సంవత్సరాలు) ఉంది.కానీ ఈ రెండింటిలోనూ కనిపించిన పాత్రలు కొన్ని ఉన్నాయి.

READ MORE: అర్జునుడి గురించి మీకు తెలియని 10 రహస్య విషయాలు

వీరిలో కొంత మంది మహా యుగాంతం వరకూ నివశించే దేవుళ్ళయితే మరి కొంత మంది సాధారణ మానవులు.ఈ క్రింద ఇచ్చిన 6 పాత్రలూ రెండు కావ్యాలలోనూ కనపడి కధకి తగినంత ప్రాముఖ్యత కల్పించారు.

READ MORE: ద్రౌపది ప్రతిజ్ఞ: ఆమె ఎపుడూ జుట్టు ముడి వేసుకోదు ఎందుకు?

ఇక ఆ ఆరు పాత్రల గురించీ చదివి వారి గురించి మరింత తెలుసుకోండి. ఒకవేళ కనుక మేము ఏ పాత్రనైనా మర్చిపోతే కామెంట్ల రూపం లో తెలియచెయ్యండి.

హనుమాన్:

హనుమాన్:

హనుమంతుడు సుగ్రీవుని సచివుడు(మంత్రి) మరియు శ్రీరాముడి భక్తాగ్రేసరుడు.రామయణం లో హనుమంతుని పాత్ర ముఖ్య పాత్రలలో ఒకటి.ఈయన మహాభారతం లో కూడా కనిపిస్తారు.హనుమంతుని సోదరుడైన భీముడు(వాయుదేవుడు వీరి పితామహుడు)సౌగంధికా పుష్పాన్ని తీసుకురావడానికి వెళ్తుండగా ఒక పెద్ద ముసలి వానరం భీముడి దారికి అడ్డంగా తన తోకని అడ్డం పెట్టి పడుకుంది.ఆగ్రహించిన భీముడు తోకని అడ్డం తీయమని అడిగాడు.అప్పుడు ఆ వానరం తాను ముసలిదాన్నయిపోవడం వల్ల అలసిపోయాననీ భీముడే తనని పక్కకి తప్పించాలనీ సమాధానమిచ్చింది.తన శక్తి సామర్ధ్యాల కి గర్వించే భీముడు ముసలి వానరం తోకని కాస్తయినా కదల్చలేకపోయాడు. గర్వ భంగమైన భీముడు తానెవరో తెలుపవలసిందిగా ముసలి వానరాన్ని కోరాడు.అప్పుడు ఆ ముసలి వానరం తాను హనుమంతుడినని చెప్పి భీముడిని ఆశీర్వాదిస్తుంది.

జాంబవంతుడు

జాంబవంతుడు

భల్లూకం లా ఉండే జాంబవన్/జాంబవంతుడు రామాయణం మరియూ మహాభారతం రెండింటిలో కనిపిస్తాడు.సుగ్రీవుడి సారధ్యం లోని శ్రీరాముని సైన్యం లో జాంబవంతుడు పని చేసాడు.శాపవశాత్తూ తన శక్తి సామర్ధ్యాలని మర్చిపోయిన హనుమంతునికి సీతాన్వేషణ లో భాగం గా సముద్ర లంఘన సమయం లో జాంబవంతుడు గుర్తు చేసాడు.అందువల్ల హనుమంతుడు తన శక్తి ని గుర్తు తెచ్చుకుని సులభంగా లంఘించి లంక చేరుకోగలిగి సీత జాడ కనుగొనగలుగుతాడు.మహాభారతం లో జాంబవంతుడు శ్రీకృష్ణుని నిజస్వరూపం తెలీక కృష్ణునితో పోరాడాడు.శ్రీకృష్ణుడు తానూ రాముడూ ఒకటే అని చెప్పగానే జాంబవంతుడు క్షమాపణ కోరి తన కూతురైన జాంబవతిని శ్రీకృష్ణునికిచ్చి వివాహం చేసాడు.

విభీషణుడు

విభీషణుడు

రాముడి పక్షాన ఉండి పోరాడిన విభీషణుడు రావణుడి సోదరుడు.రామ రావణ యుద్ధం ముగిసాకా విభీషణుడు లంకకి మహారాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు.మహాభారతంలో పాండవులు రాజసూయ యాగం చేసినప్పుడు విభీషణుడు వారి ఆహ్వానాన్ని మన్నించి విలువైన కానుకలని పంపిచాడు.

పరశురాముడు

పరశురాముడు

రామాయణంలో పరశురాముడు శ్రీ రాముడిని ద్వంద్వ యుద్ధం కోసం సవాలు విసిరినట్టుగా చెప్తారు.సీతా స్వయం వరం లో శివ ధనస్సుని శ్రీరాముడు విరిచినప్పుడు పరశురాముడు కలత చెందాడు.రాముడు శ్రీ మహా విష్ణువు అవతారమని తెలియగానే పరశురాముడు క్షమాపణ కోరి శ్రీరాముడిని ఆశీర్వదించాడు.భీష్మ, కర్ణుల గురువుగా పరశురాముడు మహాభారతం లో పేర్కొనబడ్డాడు.

మయాసురుడు

మయాసురుడు

మయాసురుడు రామాయణం లో మండోదరి పితామహునిగా, రావణుని మామగారిగా పేర్కొనబడ్దాడు.మహాభారతంలో పాండవులు దండకారణ్యాన్ని కాల్చినప్పుడు మయాసురుడొక్కడే బతికి బట్ట కట్టాడు. కృష్ణుడు మయాసురుణ్ణి సంహరిద్దామనుకుంటే,మయాసురుడు అర్జునిని శరణు వేడాడు.

తనకి ప్రాణభిక్ష పెట్టినందుకు బదులుగా ఇంద్రప్రస్థం లో మయ సభ ని నిర్మించాడు.

దూర్వాస మహర్షి

దూర్వాస మహర్షి

రామాయణంలో సీత రాముల వియోగాన్ని ముందే ఊహించిన వ్యక్తిగా దూర్వాస మహర్షి ని చెప్తారు.మహాభారంలో కుంతీ దేవికి పాండవుల జనానికి కారణమైన మంత్రాన్ని ఉపదేశించినట్లుగా పేర్కొన్నారు.


English summary

Characters That Appear Both In Mahabharata And Ramayana

Characters That Appear Both In Mahabharata And Ramayana
Desktop Bottom Promotion