For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రాశి చక్రాల ప్రకారం మీ తోబుట్టువులకు ఎంచుకోదగిన రాఖీ గురించిన వివరాలు

రాశి చక్రాల ప్రకారం మీ తోబుట్టువులకు ఎంచుకోదగిన రాఖీ గురించిన వివరాలు

|

ప్రేమ‌ మరియు సంరక్షణ ప్రధాన అంశాలుగా జరుపుకునే రక్షాబంధన్ హిందువుల ప్రధాన పండుగల్లో ఒకటిగా ఉంది. హిందూ కాలెండర్ ప్రకారం ఈ నెల 26వ తేదీన వస్తున్న శ్రావణ పౌర్ణమి, రాఖీ పండుగగా దేశవ్యాప్తంగా జరుపబడుతుంది. ఈ బంధం దీర్ఘకాలిక అనుబంధానికి మరొక రూపంగా ఉంటుంది. అందుచేతనే దేశంలో అనేక మంది ఈ రక్షాబంధనం కొరకు ఎదురుచూస్తూ ఉంటారు.

క్రమముగా దేశంలోని మార్కెట్ల నుండి చిన్నచిన్న షాపుల వరకు రక్షాబంధనానికి వారం రోజుల ముందునుండే భిన్నరకాలతో కూడిన రాఖీలతో సన్నద్ధమై కొలువుతీరి ఉంటాయి. ఇటువంటి అనేకములైన డిజైన్లతో కూడిన రాఖీలలో ఉత్తమమైన దానిని ఎంచుకోవడం కాస్త అయోమయానికి గురి చేస్తుందనే చెప్పాలి.

Choose A Rakhi For Your Brother Based On His Zodiac Sign

కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనం ధరించే రంగుని బట్టి మన వ్యక్తిత్వం మరియు మన ఆలోచనా తీరు ప్రభావాన్ని కలిగి ఉంటుందని చెప్పబడినది. క్రమంగా రాశిచక్రాల ఆధారముగా రంగును ధరించడం ద్వారా అపారమైన కాస్మిక్ ఎనర్జీని పొందగలరని, క్రమముగా సానుకూల ప్రభావాలను పొందగలరని సూచించబడినది. అటువంటి ప్రత్యేకమైన రంగులను ప్రత్యేకమైన వ్యక్తుల ద్వారా ఆశీర్వాదములుగా లేదా బహుమతులుగా పొందినప్పుడు ఎక్కువ ప్రయోజనాలను పొందగలరని చెప్పబడినది.

ఇక్కడ రాశిచక్రాల గుర్తుల మీద ఆధారపడి సోదరుల మణికట్టు మీద కట్టవలసిన రాఖీ యొక్క రకము మరియు రంగును గురించిన వివరములను పొందుపరచబడినది.

రాశి చక్రాల ప్రకారం మీ తోబుట్టువులకు ఎంచుకోదగిన రాఖీ గురించిన వివరాలు

మేషరాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేషరాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేషరాశి కుజగ్రహ ప్రభావితమై ఉంటుంది. మరియు మంగళ దేవుడు కుజ గ్రహానికి అధిపతిగా ఉంటాడు. కావున కుజునికి ఇష్టమైన ఎరుపు రంగు రాఖీ మీ సోదరునికి ఎంపికచేయడం మంచిదిగా సూచించబడినది. క్రమంగా ఈ రక్షాబంధనం ప్రభావితం చేత అతని జీవితం మరింత సానుకూలంగా చురుకుగా ముందుకు సాగుతుంది. ఎరుపు రంగును మాత్రమే కాకుండా కాషాయము లేదా పసుపు రంగు రాఖీని కూడా కొనుగోలు చేయవచ్చు ‌

వృషభ రాశి : ఏప్రిల్ 20 - మే20

వృషభ రాశి : ఏప్రిల్ 20 - మే20

వృషభరాశి శుక్రగ్రహ ఆధిపత్యాన ఉంటుంది. ఈ గ్రహానికి అధిపతి శుక్రుడు. కావున మీ సోదరునికి నీలిరంగు రాఖీని కొనుగోలు చేయడం ఉత్తమం. మరియు వృషభ రాశికి చెందిన వారు కాబట్టి వెండి రంగు రాఖీని కొనుగోలు చేయవచ్చు కూడా.

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి బుధగ్రహం ఆధిపత్యాన ఉంటుంది, బుధగ్రహానికి బుథుడు అధిపతి. బుదునికి ఇష్టమైన రంగు ఆకుపచ్చ. కావున మిధునరాశి వ్యక్తులకు ఆకుపచ్చరంగు రాఖీ ఎంచుకోవడం ఉత్తమంగా ఉంటుంది. అంతేకాకుండా తెలుపురంగు రాఖీ కూడా ఎంచుకోవచ్చు. క్రమంగా జీవితంలో ఆనందోత్సాహాలకు కొదవలేకుండా చూడగలదు.

సింహ రాశి: జూలై 23 – ఆగస్ట్ 22

సింహ రాశి: జూలై 23 – ఆగస్ట్ 22

సింహ రాశి, సూర్య గ్రహం ఆధిపత్యాన ఉంటుంది. ఈ సూర్యగ్రహానికి అధిపతి సూర్యుడు. కావున ఎరుపు రంగు పసుపు రంగు, చందనం లేదా గులాబి రంగుతో కూడిన రాఖీ సూచించడమైనది. ఎందుచేత ననగా, ఈ రంగులన్నీ సూర్య భగవానునికి ప్రీతిపాత్రమైనవి. ఈ రంగులలో ఉత్తమమైన దానిని ఎంచుకుని వీరికి కట్టడం ద్వారా ఆ సూర్యదేవుని ఆశీస్సులు లభించగలవు.

కన్యారాశి : ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22

కన్యారాశి : ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22

కన్యా రాశి బుధగ్రహం ఆధిపత్యాన ఉంటుంది, బుధగ్రహానికి బుథుడు అధిపతి. బుదునికి ఇష్టమైన రంగు ఆకుపచ్చ. కావున కన్యా రాశి వ్యక్తులకు ఆకుపచ్చ రంగు రాఖీ ఎంచుకోవడం ఉత్తమంగా ఉంటుంది. అంతేకాకుండా తెలుపు రంగు రాఖీ కూడా ఎంచుకోవచ్చు.

తులా రాశి: సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22

తులా రాశి: సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22

తులా రాశి శుక్రగ్రహ ఆధిపత్యాన ఉంటుంది. ఈ గ్రహానికి అధిపతి శుక్రుడు. కావున మీ సోదరునికి నీలిరంగు రాఖీని కొనుగోలు చేయడం ఉత్తమం. మరియు తులా రాశికి చెందిన వారు కాబట్టి ఒక ఊదా రంగు రాఖీని కొనుగోలు చేయవచ్చు కూడా. క్రమంగా జీవితంలో అనేక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందని చెప్పబడినది. అంతేకాకుండా ఒక చందనం రంగు కర్చీఫ్, మరియు నుదుటిపై చందన తిలకాన్ని దిద్దడం మంచిదిగా సూచించబడినది.

వృశ్చిక రాశి: అక్టోబర్ 23 – నవంబర్ 21

వృశ్చిక రాశి: అక్టోబర్ 23 – నవంబర్ 21

వృశ్చిక రాశి కుజగ్రహ ప్రభావితమై ఉంటుంది. మరియు మంగళ దేవుడు కుజ గ్రహానికి అధిపతిగా ఉంటాడు. కావున కుజునికి ఇష్టమైన ఎరుపు రంగు రాఖీ మీ సోదరునికి ఎంపికచేయడం మంచిదిగా సూచించబడినది. క్రమంగా ఈ రక్షాబంధనం ప్రభావితం చేత అతని జీవితం మరింత సానుకూలంగా చురుకుగా ముందుకు సాగుతుంది. ఈ రాఖీ ముత్యాలతో ఉండడం మరింత శ్రేయస్కరం.

ధనుస్సు రాశి : నవంబర్ 22 – డిసెంబర్ 21

ధనుస్సు రాశి : నవంబర్ 22 – డిసెంబర్ 21

ధనుస్సు రాశి, గురుగ్రహ ఆధిపత్యాన ఉంటుంది, ఈ గురు గ్రహానికి అధిపతి దేవ గురువు బృహస్పతి. కావున, బృహస్పతికి ప్రీతి పాత్రమైన పసుపు రంగు రాఖీని సూచించడమైనది. ముఖ్యంగా పట్టుదారముతో చేసిన రాఖీ ఉత్తమంగా సూచించబడినది. పసుపుకు బదులుగా చందనం కూడా తీసుకోవచ్చు.

మకర రాశి : డిసెంబర్ 22 – జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 – జనవరి 19

మకర రాశి శనిగ్రహ ఆధిపత్యాన ఉంటుంది, శనిదేవుడు శనిగ్రహానికి అధిపతి. కావున ఈ రాశి చక్రాల వారికి ముదురు రంగు రాఖీ ఎంపిక చేసుకోవడం ఉత్తమంగా ఉంటుంది. రాఖీ కట్టు సమయంలో నుదుటి మీద చందన తిలకం దిద్దడం ఉత్తమంగా సూచించబడినది.

కుంభ రాశి : జనవరి 20 – ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 – ఫిబ్రవరి 18

మకర రాశి వలె కుంభ రాశి కూడా శని గ్రహ ఆధిపత్యాన ఉంటుంది, శని దేవుడు శనిగ్రహానికి అధిపతి. కావున ఈ రాశి చక్రాల వారికి లేత రంగులను ఎంపిక చేసుకోరాదు, బదులుగా ముదురు రంగు రాఖీ ఎంపిక చేసుకోవడం ఉత్తమంగా ఉంటుంది. రాఖీ రుద్రాక్షతో జోడించి ఉండడం మంచిది. క్రమంగా కట్టించుకున్న వ్యక్తి జీవితంలో మంచి విజయావకాశాలను, మానసిక ప్రశాంతతను పొందగలడు.

మీన రాశి: ఫిబ్రవరి 19 – మార్చి 20

మీన రాశి: ఫిబ్రవరి 19 – మార్చి 20

మీన రాశి, గురు గ్రహ ఆధిపత్యాన ఉంటుంది, ఈ గురు గ్రహానికి అధిపతి దేవ గురువు బృహస్పతి. కావున, బృహస్పతికి ప్రీతి పాత్రమైన మరియు పసుపు, లేదా మీనరాశి వారు కాబట్టి తెలుపు రంగు రాఖీని సూచించడమైనది. ముఖ్యంగా పట్టుదారముతో చేసిన రాఖీ ఉత్తమంగా సూచించబడినది. పసుపుకు బదులుగా చందనం కూడా తీసుకోవచ్చు.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆహార, ఆరోగ్య, జీవన శైలి, ఆద్యాత్మిక, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

 కర్కాటక రాశి : జూన్ 21 – జూలై 22

కర్కాటక రాశి : జూన్ 21 – జూలై 22

కర్కాటకరాశి చంద్ర గ్రహం ఆధిపత్యాన ఉంటుంది, ఈ గ్రహానికి అధిపతి చంద్రుడు. చంద్రునికి ఇష్టమైన రంగు తెలుపు, అందులోనూ పట్టుదారంతో చేసిన రాఖీ కర్కాటక రాశి వారికి ఉత్తమంగా చెప్పబడుతుంది. మరియు ముత్యం ఉండేలా రాఖీ ఎంచుకోవడం ద్వారా, బంధం మరింత పదిలపడుతుందని చెప్పబడినది.

English summary

Choose A Rakhi For Your Brother Based On His Zodiac Sign

We shall be celebrating Raksha Bandhan on this Sunday and choosing a rakhi is becoming difficult because of the numerous designs available in the market. Astrology says that the rakhi to be tied around the wrist has an impact on the health as well as work life of the brother. Therefore, the selection of the rakhi should be made as per his zodiac sign.
Story first published:Saturday, August 25, 2018, 17:09 [IST]
Desktop Bottom Promotion