For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మూడు జన్మల్లో విష్ణుమూర్తికి బద్ద శత్రువులుగా పుట్టిన వారు ఆయన కాపలావారే, వారి కథేంటో తెలుసా...

ఒక రోజు బ్రహ్మ మానసపుత్రులు వైకుంఠం వస్తారు. వారి పేర్లు సనక, సనత్క్ మార, సునంద, సనత్సు జాతులు. వారు ఎంతో గొప్ప మహిమలు కలవారు. ఎంతో గొప్ప వ్యక్తులైన వారంతా కూడా ఐదేళ్ల వయస్సు ఉన్నవారిలా కనిపిస్తుంటా

|

జయ విజయలు అనే పేర్లు చాలా మంది వినే ఉంటారు. వారిద్దరూ విష్ణుమూర్తి వైకుఠంలో కావలివారుగా ఉండేవారు. ఇప్పటికీ విష్ణుమూర్తికి సంబంధించిన ప్రతి ఆలయంలో కూడా వీరి విగ్రహాలు ఎంట్రెన్స్ దగ్గర ఉంటాయి. వీరిది ఒక ఆసక్తికరమైన కథ.

ఒక రోజు బ్రహ్మ మానసపుత్రులు వైకుంఠం వస్తారు. వారి పేర్లు సనక, సనత్క్ మార, సునంద, సనత్సు జాతులు. వారు ఎంతో గొప్ప మహిమలు కలవారు. ఎంతో గొప్ప వ్యక్తులైన వారంతా కూడా ఐదేళ్ల వయస్సు ఉన్నవారిలా కనిపిస్తుంటారు. వారంతా విష్ణువు దర్శనం కోసమని వైకుంఠానికి వచ్చి మొదటి ఆరు ద్వారాలు తమ మహిళల ద్వారా దాటుకుని వెళ్తారు.

ఏడో ద్వారానికి రాగానే

ఏడో ద్వారానికి రాగానే

ఇక ఏడో ద్వారానికి రాగానే జయవిజయలు వారిని కనిపెడతారు. తాము వైకుంఠానికి వచ్చి విష్ణుమూర్తిని దర్శించడానికొచ్చామని ద్వారపాలకులకు జయవిజయలు చెబుతారు. అయితే జయ, విజయలు ఆ మానసపుత్రులను లోపలికి పంపరు. నిరాకరిస్తారు.

లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటారు

లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటారు

వాళ్లంతా తమ గురించి ద్వార పాలకులకు వివరిస్తారు. అయినా వారు అస్సలు వినరు. వారిని ఎంతకూ లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటారు. దీంతో వారికి కోపం వస్తుంది. వారు జయవిజయలను శపిస్తారు. మీరు భూలోకంలో రాక్షసులుగా జన్మిస్తారని శపిస్తారు.

విష్ణుమూర్తికి తెలిసి

విష్ణుమూర్తికి తెలిసి

అయితే లోపల ఉండే విష్ణుమూర్తికి ఈ విషయం తెలుస్తుంది. వెంటనే ఆయన స్వయంగా ద్వారం దగ్గరకు వచ్చి మానసపుత్రులను లోపలికి తీసుకెళ్తాడు.

రెండు రకాల వరాలు

రెండు రకాల వరాలు

విష్ణు మూర్తి రాగాగే జయవిజయులిద్దరూ ఆయనకు నమస్కరిస్తారు. అయితే వారు ఇచ్చిన శాపాన్ని పోయేలా చేయమని జయవిజయలు విష్ణువునుకోరుతారు. దీంతో విష్ణు మూర్తి మీకు రెండు రకాల వరాలిస్తాను అంటాడు. అందులో ఏదో ఒకదాన్ని ఎన్నుకోమంటారు.

Most Read :మోచేతులు దగ్గర ఉండే నలుపును పోగొట్టుకునేందుకు చిట్కాలు, ఇలా చేస్తే తెల్లగా మారుతాయిMost Read :మోచేతులు దగ్గర ఉండే నలుపును పోగొట్టుకునేందుకు చిట్కాలు, ఇలా చేస్తే తెల్లగా మారుతాయి

విష్ణు మూర్తికి శత్రువులుగా

విష్ణు మూర్తికి శత్రువులుగా

భూమిపై మీరు విష్ణు మూర్తి భక్తులుగా పుట్టి వైకుంఠానికి వచ్చే అవకాశం ఒకటోవది. లేదంటే విష్ణువు అంత శక్తితో విష్ణు మూర్తికి శత్రువులుగా జన్మించడం రెండోది. అయితే అలా శత్రువులుగా పుడితే విష్ణు చేతిలోనే చివరకు చనిపోతారని కూడా చెబుతారు. మరణించాక వైకుంఠానికి వచ్చే అవకాశం ఉంటుందని విష్ణు వివరిస్తారు.

రెండో వరమే ఇవ్వండి

రెండో వరమే ఇవ్వండి

అయితే వారిద్దరూ బాగా ఆలోచించి తమకు రెండో వరమే ఇవ్వమని కోరుకుంటారు. అలా ఆ ద్వారపాలకులు అయిన జయవిజయలు మొదటి జన్మలో హిరణ్యాక్షడిగా, హిరణ్యకశిపులుగా జన్మిస్తారు.

విష్ణువు చేతిలోనే అంతం

విష్ణువు చేతిలోనే అంతం

ఇక మరో జన్మలో ఇద్దరూ రావణుడు, కుంభకర్ణులిగా జన్మిస్తారు. మూడోసారి శిశుపాలుడు, దంతవక్త్రలుగా వారిద్దరూ జన్మనిస్తారు. ప్రతి జన్మలో కూడా వారిద్దరూ విష్ణువు చేతిలోనే అంతమవుతారు.

ద్వారపాలకులుగా

ద్వారపాలకులుగా

చివరకు వారిద్దరికీ కలి యుగంలో శాపం నుంచి విముక్తి లభిస్తుంది. ఇక అప్పటి నుంచి వారిద్దరి విగ్రహాలు విష్ణుమూర్తి, వెంకటేశ్వరుడు, తదితర ఆలయాల్లో ద్వారపాలకులుగా ఉంటాయి.

Most Read :పాపాలు చేసేవారికి గరుడ పురాణం ప్రకారం 30 రకాల శిక్షలు ఇవే, అలాంటి పాపాలు అస్సలు చేయకండిMost Read :పాపాలు చేసేవారికి గరుడ పురాణం ప్రకారం 30 రకాల శిక్షలు ఇవే, అలాంటి పాపాలు అస్సలు చేయకండి

English summary

Curse of the Manasaputras Jaya and Vijaya

Curse of the Manasaputras Jaya and Vijaya
Desktop Bottom Promotion