క్రిస్మస్ సమయంలో అనుసరించవలసిన సంప్రదాయములు..నియమాలు..!

Posted By: Lekhaka
Subscribe to Boldsky

ప్రపంచ వ్యాప్తంగా శాంతా క్లాజ్ స్లిఘ్ రైడ్ ద్వారా వెళ్లి పిల్లలకు క్రిస్మస్ బహుమతులు అందించటం ప్రసిద్ధి చెందింది. అతని గంట మరియు అతని పెద్ద నవ్వు, హో! హో! హో! అంటూ శీతాకాలం గాలి, మంచు, ప్రేమ మరియు స్నేహితుల ప్రేమ మరియు అనేక విషయాలు ఉంటాయి. ప్రభువైన యేసు యొక్క పుట్టినరోజును ప్రపంచ వ్యాప్తంగా ఉత్సాహముతో మరియు ఓజస్సుతో జరుపుకుంటారు. కానీ వివిధ దేశాలను బట్టి సంప్రదాయములు మారతాయి.

ప్రతి సంవత్సరం డిసెంబరు 25 న క్రిస్మస్ జరుపుకుంటారని మీకు తెలుసు. కానీ, జూలియన్ క్యాలెండర్ ప్రకారం, గ్రీకు కాథలిక్ చర్చిల విషయంలో క్రిస్మస్ ని జనవరి 7 న జరుపుకుంటారని మీకు తెలుసా? అవును, అదే విధంగా, అక్కడ క్రిస్మస్ సంబరాలలో కూడా తేడాలు ఉంటాయి.

Customs Followed During Christmas

కిస్మస్ రోజు ఉదయం చర్చికి వెళ్లి దేవునికి ప్రార్ధన చేస్తారు. శాంతా క్లాజ్ ద్వారా ఉంచబడిన బహుమతులను తెరిచి ప్రియమైన వారితో రోజంతా ఆనందాన్ని పంచుకుంటారు. బహుమతులు పొందడానికి శాంతా క్లాజ్ యొక్క ప్రదర్శన ప్రతి సందర్భంలోనూ దాని స్వంత ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. క్రిస్మస్ సమయంలో అనుసరించే సంప్రదాయముల గురించి తెలుసుకుందాం.

వెబ్ క్రిస్మస్ చెట్టు

వెబ్ క్రిస్మస్ చెట్టు

ఈ ఆచారం ఉక్రెయిన్ లో కొనసాగుతుంది. ఒక కథ ప్రకారం ఒక పేద మహిళ క్రిస్మస్ అలంకరణ చేయలేకపోయానని బాధపడెను. ఆమె పిల్లలు ఉదయం చెట్టును చూడగానే ఆ చెట్టుకు వెబ్ కప్పబడి వెండి మరియు బంగారు రంగులో మెరుస్తూ ఉండెను.

రుచికరమైన క్రిస్మస్ వంటకాలు

రుచికరమైన క్రిస్మస్ వంటకాలు

అవును, మీరు స్మోక్ చేసి తయారు చేసిన టర్కీ, ఫ్రూట్ కేక్, జెల్లీ అంబలి వంటి రుచికరమైన వంటకాలు ఉంటాయి. కిస్మస్ రోజున మీరు టుర్న్ రుచి చూస్తున్నారా? ఇది గుడ్లు, బాదం, చక్కెర మరియు తేనెతో తయారు చేసిన ఒక స్పానిష్ వంటకం. ఈ రెసిపీ 16 శతాబ్దాల క్రితంది. ఈ వంటకాన్ని క్రిస్మస్ సమయంలో మాత్రమే వడ్డిస్తారు.

 బహుమతులు ఇవ్వడం

బహుమతులు ఇవ్వడం

క్రిస్మస్ ఉదయం మేల్కొనగానే శాంతా క్లాజ్ నుండి బహుమతులు అందుకోవటం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఈ బహుమతి ప్రపంచానికి క్రీస్తు నుండి మోక్షం అని సూచిస్తుంది. ఇది తన ప్రియమైన వారి నుండి మరియుప్రేమించే వ్యక్తి నుండి బహుమతులు పొందటం యొక్క ఆనందాన్ని చూపిస్తుంది.

క్రిస్మస్ ట్రీ అలంకరణ

క్రిస్మస్ ట్రీ అలంకరణ

క్రిస్మస్ చెట్టు కస్టమ్ పాగాన్ ఆచారాల నుండి ఉద్భవించింది. అయితే, ఇప్పుడు ఇది క్రిస్మస్ కోసం ఎంతో అవసరం. క్రైస్తవ విశ్వాసాల ప్రకారం ట్రీ జీవితాన్ని సూచిస్తుంది. అందువలన ప్రజలు కొవ్వొత్తులను మరియు అనేక ఇతర అలంకరణ వస్తువులతో అలంకరణ చేస్తారు.

రింగింగ్ బెల్స్

రింగింగ్ బెల్స్

ఇది క్రిస్మస్ ఆచారాలలో ఇమిడి ఉండే మరో పాగాన్ సాంప్రదాయం.గతంలో, శీతాకాలంలో రోజులలో చల్లని మరియు సూర్యకాంతి లేకపోవడం, చెడు ఆత్మలను గంటల యొక్క చిహ్నాలు దూరంగా ఉంచుతాయని నమ్మేవారు. ఆ తర్వాత, గంటలు ఆశ,గుడ్విల్ మరియు ఆనందానికి చిహ్నంగా క్రిస్మస్ లోకి విలీనం చేయబడ్డాయి.

 బాబొస్చ్కా కథ

బాబొస్చ్కా కథ

రష్యాలో బాబొస్చ్కా క్రిస్మస్ ఈవ్ మొత్తం పిల్లలకు బహుమతులను అందిస్తుంది. అక్కడ బాబొస్చ్కా అంటే అమ్మమ్మ లేదా పాత లేడీ అర్థం. ఆమె బిడ్డ యేసుకు ఎటువంటి బహుమతులను ఇవ్వలేదని నమ్ముతారు. అందువల్ల ఆమె పిల్లలకు బహుమతులు ఇచ్చి పశ్చాత్తాపం పొందుతుంది.

క్రిస్మస్ సాంప్రదాయ భోజనం

క్రిస్మస్ సాంప్రదాయ భోజనం

అనేక దేశాలలో, ప్రజలు ఆ రోజున చాలా ప్రత్యేకమైన సాంప్రదాయ భోజనమును తయారు.చేస్తారు. పోలాండ్ లో దీనిని విజిల్లా అని పిలుస్తారు. అలాగే రాబోయే సంవత్సరంనకు ఆనందాన్ని సూచిస్తుంది. ఇటలీలో, ప్రజలు ఈ సారి రాబోయే సంవత్సరం అంతా సంపద మరియు అదృష్టం కలుగుతుందనే నమ్మకంతో ఆ సమయంలో ఏడు చేపలు మరియు కాయధాన్యాలతో భోజనం తయారుచేస్తారు. ప్రపంచంలోని అనేక దేశాలు క్రిస్మస్ సమయంలో అనుసరించే సంప్రదాయములు ఈ విధంగా ఉన్నాయి. ఏమైనప్పటికీ ఆచారాలు, క్రిస్మస్ అంతర్లీన అర్థం సంతోషంగా ఉండటం మరియు మొత్తం ఆనందాన్ని పంచుకోవటం అని చెప్పవచ్చు. .

English summary

Customs Followed During Christmas

Customs Followed During Christmas,There are certain traditions and customs that are followed during Christmas. Read on to know more .