For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డిసెంబర్ 2019 : ఈ నెలలో శుభప్రదమైన తేదీలు, ముహుర్తాల గురించి మీకు తెలుసా..

హిందూ పురాణాల ప్రకారం ఈ నెల తెలుగు వారికి మొదటిది కాదు.. అలా అని చివరిది కూడా కాదు. కానీ మీరు ఈ నెలలో కొన్ని పవిత్రమైన వేడుకలు నిర్వహించుకోవడానికి ప్లాన్ చేయవచ్చు.

|

ఇంగ్లీష్ వారి క్యాలెండర్ ప్రకారం డిసెంబర్ నెల అనేది సంవత్సరంలో చివరి మాసం. ఈ నెలలో క్రిస్మస్ పండుగ గురించి మాత్రమే చాలా మందికి తెలుసు. అయితే మీకు తెలియని అనేకమైన పవిత్రమైన పండుగలు మరియు కార్యక్రమాలతో పాటు శుభప్రదమైన తేదీలు, మంచి మూహూర్తాలు సైతం ఉన్నాయి.

December

హిందూ పురాణాల ప్రకారం ఈ నెల తెలుగు వారికి మొదటిది కాదు.. అలా అని చివరిది కూడా కాదు. కానీ మీరు ఈ నెలలో కొన్ని పవిత్రమైన వేడుకలు నిర్వహించుకోవడానికి ప్లాన్ చేయవచ్చు. ఈ సందర్భంగా డిసెంబర్ నెలలో ఏయే రోజుల్లో ముఖ్యమైన తేదీలు, శుభ ముహూర్తాలు ఉన్నాయో కింద ఉన్న జాబితాను చూసి తెలుసుకోండి...

డిసెంబర్ నెలలోనే ఎక్కువ పార్టీలు.. ప్రయాణాలు.. ఇంకా మరెన్నో..డిసెంబర్ నెలలోనే ఎక్కువ పార్టీలు.. ప్రయాణాలు.. ఇంకా మరెన్నో..

డిసెంబర్ 1వ తేదీ : రాముని వివాహం

డిసెంబర్ 1వ తేదీ : రాముని వివాహం

రాముడి వివాహం అనేది పవిత్రమైన రోజు. మీరు ఏదైనా మంచి పనిని చేయాలను అనుకుంటూ ఈరోజు ఉత్తమమైన రోజు. మీ జీవితంలో మంచి భాగస్వామి కోసం ఇబ్బందులు పడుతున్న వారు ఈరోజున పూజలు చేయాలి. అలాగే డేటింగ్ కూడా ప్రారంభించవచ్చు. ఎందుకంటే ఈరోజు అవివాహితులను మంచి జీవిత భాగస్వామితో గడపడానికి మరియు ఒకరి వివాహ జీవితంలో సామరస్యంతో పాటు సాన్నిహిత్యం తీసుకురావడానికి ఉద్దేశించబడింది. విద్యార్థులకు జ్ఞానం మరియు మొత్తం పురోగతి లభిస్తుంది.

డిసెంబర్ 2వ తేదీ

డిసెంబర్ 2వ తేదీ

ఈరోజున సుబ్రమణ్యం స్వామిని ఆరాధించాలి. ఎందుకంటే ఎవరైనా ఆందోళన మరియు భయంతో బాధపడుతున్న వారు ఈరోజు నుండి మంచి ప్రయోజనాలను పొందుతారు. అలాగే తమ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమిస్తారు. అందుకే మీరు సర్వశక్తిమంతుడిని ఆరాధించాలి.

డిసెంబర్ 4వ తేదీ..

డిసెంబర్ 4వ తేదీ..

ఈరోజున మాసిక్ దుర్గాష్టమి. 4వ తేదీ నాడు మీరు మీ ముఖ్యమైన మరియు మీకు సంబంధించిన కొత్త పనిని ప్రారంభించడానికి మంచి రోజు. ఈరోజు మీరు కోరికలు నెరవేరే రోజు. అనారోగ్యం నుండి కోలుకోవడం, విద్యారంగంలో విజయం సాధించడం మరియు సంపదను పొందగల రోజు ఈ మాసిక్ దుర్గాష్టమి రోజు. ఈ రోజున తమ పనిని ప్రారంభించే వారు విజయం మరియు మనశ్శాంతిని పొందుతారు.

డిసెంబర్ 8వ తేదీ..

డిసెంబర్ 8వ తేదీ..

ఈరోజున మోక్షాద ఏకాదశి. మీరు తరచుగా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటే ఈరోజు నుండి వాటిని అధిగమించే అవకాశం ఉంటుంది. అంతకుముందు ఈరోజున శివుడికి పూజలు చేయాలి. ఈరోజున భక్తులందరూ జ్ఞానం మరియు ఆధ్యాత్మిక పురోగతితో ఆశీర్వదింపబడతారు.

డిసెంబర్ 9వ తేదీ మరియు 23వ తేదీ..

డిసెంబర్ 9వ తేదీ మరియు 23వ తేదీ..

ఈ నెలలోని పై రెండు తేదీల్లో సోమ ప్రదోష్. ఈ పర్వదినం అంటే శివుడికి ఎంతో ఇష్టం. భక్తులందరూ ఆరోగ్యకరమైన సానుకూల శక్తిని పొందటానికి ఆరాధించే రోజు ఇది. కొన్ని అడ్డంకులు కారణంగా మీ పనులు ఆలస్యం అవుతున్నాయని మీరు భావిస్తే వాటిని అధిగమించే రోజు అవుతుంది. అంతేకాకుండా మానసిక పురోగతి కోసం ఉద్దేశించిబడిన రోజు ఇది. చాలా మంది తమ ప్రియమైన వారి నుండి ఈరోజు సానుకూల మద్దతు పొందుతారు. అలాగే, భక్తులు సంతృప్తి మరియు ఆరోగ్యాన్ని సాధిస్తారు.

డిసెంబర్ 12వ తేదీ..

డిసెంబర్ 12వ తేదీ..

ఈరోజున మార్గశిర పూర్ణిమ. పిల్లలు లేని జంటలు ఈరోజు సర్వశక్తిమంతుడిని పూజించాలి. ఆయన ఆశీస్సులు లభిస్తే పిల్లలు లేని వారికి ఈరోజు చాలా పవిత్రమైన రోజు అవుతుంది. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లల శ్రేయస్సు మరియు ఆరోగ్యం కోసం దేవుడిని ఆరాధించవచ్చు. ఈ రోజున ఒకరు ఆధ్యాత్మిక పురోగతిని పొందవచ్చు.

డిసెంబర్ 15వ తేదీ..

డిసెంబర్ 15వ తేదీ..

ఈరోజున సంకష్ట చతుర్దశి. ఈరోజు మీరు పెండింగ్ పనులను పూర్తి చేయడానికి మరియు భయాలను అధిగమించడానికి ఈరోజు ఒక శుభమైన రోజు. వైవాహిక ఇబ్బందులకు గురయ్యే జంటలు వారి సమస్యలను పరిష్కరించుకోవచ్చు. సామరస్యం మరియు సాన్నిహిత్యం, ఆనందం వంటివి ఈరోజు లభిస్తాయి.

డిసెంబర్ 19వ తేదీ..

డిసెంబర్ 19వ తేదీ..

ఈరోజు మాసిక్ కలాష్టమి. ఈరోజు గాయాలు మరియు అనారోగ్యాలతో బాధపడుతున్న వారు ఈరోజు నుండి ప్రయోజనం పొందవచ్చు. మీ పెండింగ్ పనులను తిరిగి ప్రారంభించాలని మీరు ఆలోచిస్తుంటే, మీ కోరికలు నెరవేరే అవకాశం ఉంటుంది. మీ ప్రియమైన వారి నుండి సానుకూల మద్దతును పొందుతారు. ఈరోజున మీకు ఉన్న అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి. అందువల్ల ఈరోజు మీకు అదృష్టం వర్తిస్తుందని ఆశిస్తారు.

డిసెంబర్ 24వ తేదీ..

డిసెంబర్ 24వ తేదీ..

ఈరోజున మాసిక్ శివరాత్రి. భక్తులు తమ జీవితంలో ఆరోగ్యం, సంపద మరియు పురోగతిని సాధించే రోజు ఈరోజు. అలాగే వైవాహిక సమస్యలు ఉన్న జంటలకు కూడా ఈరోజు పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది. అయితే మీరు గట్టిగా ప్రయత్నించాలి. ఇది మీకు కచ్చితంగా ఫలితాలను ఇస్తుంది.

డిసెంబర్ 30వ తేదీ

డిసెంబర్ 30వ తేదీ

ఈ రోజున వినాయక చతుర్ధి. మీరు ఈరోజున ఏదైనా పని మీద బయటకు వెళ్తుంటే, మీరు వినాయకుడిని ఆరాధించాలి. అలాగే గణపతి ఆలయానికి వెళ్లి ప్రార్థనలు చేయాలి. దీని వలన ఆ దేవుడి ఆశీర్వాదం మీకు సహాయపడుతుంది. తర్వాత మీకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. అసాధారణమైన కారణాల వల్ల మీ పని ఏదైనా ఆలస్యం అయినా సందర్భాలు ఏవైనా ఉంటే, అవి తిరిగి మళ్లీ ప్రారంభించబడతాయి. విద్యార్థులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది.

డిసెంబర్ 31వ తేదీ..

డిసెంబర్ 31వ తేదీ..

ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం ఈరోజు సంవత్సరం యొక్క చివరిరోజు. కానీ హిందువులకు మాత్రం కాదు. హిందూ పురాణాల ప్రకారం ఈరోజున స్కంద షష్టి. ఈరోజు ఎవరైనా భయం మరియు చింతలతో బాధపడుతున్న వారికి ఈరోజు పవిత్రమైన రోజుగా ఉంటుంది. అలాగే నిరంతరం భయంతో ఉండేవారికి ఈరోజు దాన్ని అధిగమించడంలో సహాయపడుతుంది. అలాగే మీరు ఏదైనా పనిని తలపెట్టి ఉంటే దానిని విజయవంతంగా పూర్తి చేయడంలో సహాయపడుతుంది.

English summary

December 2019: 12 Auspicious Dates That You May Not Be Knowing

If you are going through obstacles, fears and are not getting success in whatever you do, then why not look for some auspicious days to accomplish your pending work. Therefore, we have brought a list of auspicious dates in December.
Story first published:Saturday, November 30, 2019, 16:32 [IST]
Desktop Bottom Promotion