For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దేవశయని ఏకాదశి ప్రాశస్త్యం మరియు పూజ విధి

దేవశయని ఏకాదశి ప్రాశస్త్యం మరియు పూజ విధి.హిందూ క్యాలెండర్ ప్రకారం ఒక్కో సంవత్సరంలో, అదనపు నెల వచ్చినప్పుడు, ఈ సంఖ్య ఇరవై ఆరు వరకు పెరుగుతుంది. ఈ అదనపు నెలను అధిక మాసం అని కూడా పిలుస్తారు. హిందూమతం లో

|

ఏకాదశి ప్రతి పక్షంలోని పదకొండవ రోజును సూచిస్తుంది. ప్రతి నెలలో రెండు ఏకాదశిలు వస్తాయి. ప్రతినెలలో, కృష్ణ పక్షంలో ఒకటి మరియు శుక్ల పక్షంలో ఒకటి చొప్పున, సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి.

2018 లో దేవశయని ఏకాదశి:

2018 లో దేవశయని ఏకాదశి:

హిందూ క్యాలెండర్ ప్రకారం ఒక్కో సంవత్సరంలో, అదనపు నెల వచ్చినప్పుడు, ఈ సంఖ్య ఇరవై ఆరు వరకు పెరుగుతుంది. ఈ అదనపు నెలను అధిక మాసం అని కూడా పిలుస్తారు. హిందూమతం లో వాటి ప్రాముఖ్యతను అనుసరించి, వివిధ ఏకాదశులకు, వివిధ నామాలు ఇవ్వబడ్డాయి. ఈ నెలలో జూలై 23, 2018న , దేవశయని ఏకాదశిని గమనించవచ్చు.

దేవశయని ఏకాదశి యొక్క ప్రాముఖ్యత:

దేవశయని ఏకాదశి యొక్క ప్రాముఖ్యత:

ప్రతి ఏకాదశి విష్ణువుకు అంకితం చేయబడింది. ఆషాఢ మాసంలో వచ్చే పదకొండవ రోజు దేవశయని ఏకాదశిని సూచిస్తుంది. ఈ ఏకాదశి ప్రారంభమైన మొదలు నుండి నాలుగు నెలల కాలం పాటు విష్ణువు నిద్రలోకి జారుకుంటాడని నమ్ముతారు. ఇప్పుడే చాతుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ పేరు నాలుగు నెలల కాలాన్ని సూచిస్తుంది. "దేవశయని" అనగా సంస్కృతంలో "దేవుడు నిద్రపోతున్నప్పుడు" అని అర్ధం.

దేవశయని ఏకాదశి నాడు, భక్తులు ఉపవాసం చేయాలి. ఈ ఏకాదశిని ఎలా జరుపుకోవాలో, ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

దేవశయని ఏకాదశి పూజ విధి:

దేవశయని ఏకాదశి పూజ విధి:

భక్తులు తెల్లవారుజామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయవలసి వుంటుంది. ఏ ఏకాదశి నాడు పూజ చేయాలన్నా, బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి మంచి పనులు చేస్తే, పూజలు తప్పక ఫలించి, మీకు మంచి జరుగుతుంది. మీరు పూజ నిర్వహించే ప్రదేశంలో, గంగాజలంతో శుద్ధి చేయండి. అక్కడ విష్ణు విగ్రహ స్థాపన చేయండి.

ప్రతి ఏకాదశి రోజున మనం ఏ విధంగా పూజ చేస్తామో, అదే విధంగా ఈ ఏకాదశి నాడు కూడా చేయాలి. పూజా స్థలాన్ని శుద్ధి చేసి, విష్ణువుకు ప్రీతికరమైన పసుపు బట్టలను మరియు ఇతర వస్తువులను సమర్పించి పూజ చేయండి. వ్రతకథను చదివి, హారతిని ఇచ్చి, భక్తులకు ప్రసాదాన్ని పంచి పూజను ముగించండి.

మరచిపోకూడని నియమాలు:

మరచిపోకూడని నియమాలు:

పూజను ముగించిన తర్వాత, విష్ణువు విగ్రహాన్ని తెల్లని వస్త్రంతో కప్పి, దిండుతో సహా పరుపును ఏర్పాటు చేసి, విగ్రహాన్ని ఆ పరుపుపై పెట్టి నిద్రపోనివ్వాలి. ముఖ్యంగా దేవశయని ఏకదశి నాడు ఇలా తప్పక చేయాలి.ఇలా చేయడంతో దేవశయని ఏకాదశి కోసం పూజ ముగుస్తుంది.

మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, భక్తులు చేసే దానాలు వారు చేసే పుణ్యానికి ప్రతీకగా నిలుస్తాయి. అందువల్ల పేదలకు, ఆర్తులకు దానం చేయడం చాలా ముఖ్యం.

ఏకాదశి రోజు పాటించవలసిన ఇతర నియమాలు:

ఏకాదశి రోజు పాటించవలసిన ఇతర నియమాలు:

ఏకాదశి రోజు, ఉపవాసం పాటించేటప్పుడు, ధాన్యాలు తినకూడదు. ఉపవాసం పాటించనప్పటికి, అన్నం నుండి దూరంగా ఉండాలి. ఈ రోజు గోర్లు లేదా జుట్టును కత్తిరించకూడదు. మహిళలు తల రుద్దుకోకూడదని సూచించబడింది. మాంసాహారాన్ని కూడా భుజించరాదు.

ఈ రోజుల్లో ఉపవాసాలు చేసేవారికి

ఈ రోజుల్లో ఉపవాసాలు చేసేవారికి

ఈ రోజుల్లో ఉపవాసాలు చేసేవారికి ముక్తి లభిస్తుందని చెప్పబడింది. ఈ సమయంలో ఎవరైతే భక్తిశ్రద్దలతో భగవంతుని ప్రార్థిస్తారో, వారి పాపాలు కడగబడతాయి. పవిత్రమైన నదులలో స్నానం చేయడం వలన కూడా భక్తులకు విష్ణువు యొక్క ఆశీర్వాదాలు లభిస్తాయి.


English summary

Devshayani Ekadashi 2018 Date, Importance and Puja Vidhi

Devshayani Ekadashi is the day when Lord Vishnu goes into sleep for four months; this period is known as Chaturmas. Every year, the eleventh day of the Ashadha month during the Shukla Paksha, as per Hindu Panchang, is observed as a fasting day on. This Ekadashi brings good health, wealth and salvation with the blessings of Lord Vishnu.
Story first published: Monday, July 23, 2018, 10:51 [IST]
Desktop Bottom Promotion