Latest Updates
-
కండలను ఉక్కును మార్చే రాగితో హెల్తీ బన్ దోశ.. బరువు తగ్గాలంటే పక్కా తినాల్సిందే.! -
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.!
Devshayani Ekadashi 2020 : తొలి ఏకాదశిన ఇలా చేస్తే.. అనుకున్న పనులన్నీ నెరవేరుతాయట...!
దేవశయని ఏకాదశినే తొలి ఏకాదశి అంటారు. ఆషాఢ మాసంలో వచ్చే ఈ పవిత్రమైన రోజున ఏయే పూజలు జరుపుకుంటారో తెలుసుకుందాం.
ఏకాదశి అంటే పదకొండు అని అర్థం. అంటే పంచ ఇంద్రియాలు.. పంచ జ్ణానేంద్రియాలు.. మొత్తం పది. వీటిపై పెత్తనం చేసే అంతరంగిక ఇంద్రియం. ఈ పదకొండు కలిసి ఏకోన్ముఖంగా కలిసి పని చేసే సమయాన్ని ఏకాదశిగా పెద్దలు చెప్పారు.

ఈ సమయంలో మనసు మీద చంద్రుని యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. చంద్రుని యొక్క కళలను బట్టి మనకు తిథులు ఏర్పడ్డాయి.

వీటన్నింటి సంగతి పక్కనబెడితే ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు ప్రత్యేక పూజలు మరియు నివారణల సహయంతో విష్ణువును ప్రసన్నం చేసుకునేందుకు చాలా మంది ప్రయత్నిస్తారు.

పద్మపురాణం ప్రకారం.. శయన ఏకాదశి రోజున కొన్ని మంత్రాలను వింటే మనం చేసిన మహాపాపాలు తొలగిపోతాయి. అంతటి మహత్యం కలిగినది ఈ తొలి ఏకాదశి.

అంతేకాదు విష్ణుమూర్తి పాల సముద్రంలో నిద్రించే రోజు ఈరోజు. అందుకే ఈరోజుకు ఎంతో విశిష్టత ఏర్పడింది. ఈ పవిత్రమైన రోజున దారిద్ర్యం, కష్టాలతో పోరాడేవారు.. విష్ణుమూర్తి కరుణ కోరుకునే వారు ఈ తొలి ఏకాదశిన ఏయే పనులు చేయాలి.. ఉపవాస దీక్షను ఎలా పాటించాలనే ముఖ్యమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

పూజకు ముందు..
తెల్లవారు జామునే నిద్ర లేచి, నిత్య కార్యక్రమాలను పూర్తి చేసుకోవాలి. సూర్యోదయానికి ముందే తలస్నానం చేసి, నుదుట కుంకుమను పెట్టుకోవాలి. తర్వాత లక్ష్మీనారాయణుడి చిత్ర పటాన్ని లేదా వేంకటేశ్వరుని పటానికి గంధం, కుంకుమను పెట్టాలి. అంతకుముందు పూజా గదిని శుభ్రం చేసి అలంకరించాలి.. వీటి కంటే ముందు పసుపు గణపతిని పూజించాలి.

విష్ణుమూర్తికి ఆ మాలతో..
ఆ తర్వాత విష్ణుమూర్తి చిత్రపటాన్ని తులసి మాలతో అలంకరించాలి. ఇలా తులసితో విష్ణుమూర్తిని పూజించడం వల్ల మీకు అఖండ ఐశ్యర్యం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. కానీ వినాయకుడికి తులసి మాలను వేయకూడదు. తులసితో పూజించకూడదు. కేవలం వినాయక చవితి రోజున మాత్రమే వినాయకుడిని పూజించాలి. అలాగే మీకు అందుబాటులో ఉన్న రకరకాల పూలతో, ధూపదీప నైవేద్యాలను సమర్పించాలి.

దేవుని కటాక్షం కోసం..
లక్ష్మీనారాయణుడి కరుణా, కటాక్షం కోసం మీరు తయారు చేసే నైవేద్యంలో బెల్లం, యాలకులతో కలిపి తయారు చేసిన పదార్థాన్ని కచ్చితంగా వేయాలి. అలాగే గోధుమలతో చేసిన బెల్లం పరమాన్నాన్ని కూడా నైవేద్యంలో ఉంచాలి.

విష్ణు పురాణం..
ఈ తొలి ఏకాదశి రోజున విష్ణు పురాణం, విష్ణు సహస్ర నామం, విష్ణు అష్టోత్తరం.. భాగవతంలోని శ్లోకాలను పారాయణం చేయాలి. అయితే మంత్రాలు రాని వారు ‘‘ఓం నమో నారాయణాయ'' ‘‘ఓం నమో భగవతే వాసు దేవాయ'' అని స్మరించుకోవాలి. అలాగే ఏడుకొండల వాడ.. ఏడు నామాల వాడ అని స్మరించుకున్న కూడా ఆ దేవుని ఆశీస్సులు మీకు తప్పకుండా లభిస్తాయి. పూజ ముగిసిన తర్వాత హారతి ఇవ్వాలి.

ఉపవాసం..
ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం ద్వారా, అన్ని రకాల బాధల నుండి ఉపశమనం పొందుతారని చాలా మంది హిందువులు నమ్ముతారు. అంతేకాదు తమ జీవితంలో ఎదురైన అవరోధాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. ఆర్థిక సమస్యలు కూడా అంతమవుతాయి. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉంటే ప్రత్యేక ప్రయోజనాలు కూడా కలుగుతాయి. వీటితో పాటు ఈరోజున గోపూజ చేస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది.

ఈ పనులు చేయరాదు..
ఈ పవిత్రమైన కొన్ని శుభకార్యాలను ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. అవి ఏంటంటే వివాహం చేసుకోవడం.. ఇంటి ప్రవేశం, కొత్త వాహనం కొనుగోలు చేయడం.. షాపింగ్, షేవింగ్ వంటి పనులను అస్సలు చేయకూడదు.



Click it and Unblock the Notifications