For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Dhanteras 2021:ధన త్రయోదశి విశిష్టతలేంటో తెలుసుకుందామా...

ధన త్రయోదశి విశిష్టతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

|

హిందూ పంచాంగం ప్రకారం ధన త్రయోదశికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో క్రిష్ణ త్రయోదశి రోజున ఈ పండుగ వస్తుంది.

Dhanteras 2021: What is Dhanteras? Why is it celebrated?

తెలుగు రాష్ట్రాల్లో దీన్ని ధన త్రయోదశిగా పిలుస్తారు. ఉత్తర భారతంలో దీన్ని దంతేరాస్ అని పిలుస్తారు. పురాణాల ప్రకారం దేవతలు, రాక్షసులు అమ్రుతం కోసం క్షీరసాగర మధనం చేస్తున్న సమయంలో పాల సముద్రం నుంచి శ్రీ మహాలక్ష్మీ ఉద్భవించినట్లు చెబుతారు.

Dhanteras 2021: What is Dhanteras? Why is it celebrated?

అలాగే సంపదలను ఇచ్చే కల్పవ్రుక్షం, కామధేనువు, దేవ వైద్యుడు, ధన్వంతరి కూడా శ్రీ మహాలక్ష్మీతో పాటే జన్మించారని పండితులు చెబుతుంటారు. మనకు ఎన్ని తెలివితేటలు ఉన్నా.. మనం ఎన్ని ఉన్నత చదవులు చదివినా.. శ్రీ మహాలక్ష్మీ అనుగ్రహం, ఆశీర్వాదం లేకపోతే మన జీవితంలో ముందుకు వెళ్లడం అసాధ్యం. అందుకే శ్రీ మహాలక్ష్మీ ఆశీస్సుల కోసం భక్తులందరూ ఈ పవిత్రమైన రోజున అమ్మవారికి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. శ్రీ మహాలక్ష్మీ ధనానికి ప్రతీక. అందుకే ఆమె పుట్టినరోజైన క్రిష్ణ త్రయోదశిని ధన త్రయోదశి అని అంటారు. ఈ నేపథ్యంలో 2021వ సంవత్సరంలో ధంతేరాస్ లేదా ధన త్రయోదశి ఎప్పుడొచ్చింది? ఈ పండుగ యొక్క విశిష్టతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

Dhanteras 2021 :ఇంట్లో ఈ పూజను చేయడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా...Dhanteras 2021 :ఇంట్లో ఈ పూజను చేయడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా...

ధన త్రయోదశి ఎప్పుడంటే..?

ధన త్రయోదశి ఎప్పుడంటే..?

2021 సంవత్సరంలో ధన త్రయోదశి నవంబర్ రెండో తేదీన వచ్చింది. ధనానికి ప్రతిరూపమైన లక్ష్మీదేవిని ఈరోజు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఎందుకంటే ధనలక్ష్మీ ఈ పవిత్రమైన రోజునే పుట్టిందని చాలా మంది నమ్ముతారు. అశ్వీయుజ క్రిష్ణ త్రయోదశిని ధన త్రయోదశి అంటారు. అష్ట ఐశ్వర్యాలకు, సిరి సంపదలకు ప్రతిరూపమైన ధనలక్ష్మీకి ఈరోజు ప్రత్యేక పూజలు చేస్తారు.

బంగారం కొనుగోలు..

బంగారం కొనుగోలు..

లక్ష్మీదేవిని ధన ప్రదాతగా భావిస్తారు కాబట్టి.. ఆమె ఈరోజే ఉద్భవించిన కారణంగా ధన త్రయోదశి రోజున బంగారం, వెండి ఆభరణాలతో పాటు విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇలా కొనుగోలు చేయడం వల్ల ధనలక్ష్మీ ఆశీస్సులు సంవత్సరం పొడవునా ఉంటాయని చాలా మంది నమ్ముతారు.

కుభేరుని ఆరాధ..

కుభేరుని ఆరాధ..

ధన త్రయోదశి రోజున లక్ష్మీదేవితో పాటు కుభేరుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ పవిత్రమైన రోజున కుభేరుడిని పూజించడం వల్ల అక్షయ సంపదలు పెరుగుతాయని నమ్ముతారు. అలాగే బంగారం, వెండి, రాగి, పంచలోహ పాత్రలను కొనుగోలు చేస్తారు. రాబోయే కాలానికి ఇది మరింత పెరుగుతుందని నమ్ముతారు. అలాగే ఈ రోజున ఎవ్వరికీ రుణాలు ఇవ్వడం మరియు అనవసర ఖర్చులు వంటివి చేయరు. దీన్ని సంప్రదాయంగా భావిస్తారు.

సొంతరాశిలోకి శని నేరుగా ప్రవేశిస్తే... ఈ రాశులకు బంపరాఫర్...!సొంతరాశిలోకి శని నేరుగా ప్రవేశిస్తే... ఈ రాశులకు బంపరాఫర్...!

యమ ధర్మరాజు పూజ..

యమ ధర్మరాజు పూజ..

ధన త్రయోదశి రోజున యమ ధర్మరాజుకు కూడా ప్రత్యేక పూజలు చేస్తారు. పరిపూర్ణ ఆయుష్షు కోసం సూర్యాస్తమయం సమయంలో ఇంటి ప్రధాన ద్వారానికి రెండు వైపులా మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి వేసి దీపారాధన చేస్తారు. వీటిని యమ దీపాలుగా చెబుతారు. యముడు దక్షిణ దిక్కుకు అధిపతిగా ఉంటాడు కాబట్టి.. ఇంటి ఆవరణంలో దక్షిణం వైపున, ధాన్యపు రాశి మీద ఈ దీపాలను వెలిగిస్తారు. ఈ యమ దీపం వెలిగించడం వల్ల యముడు శాంతిస్తాడని, అకాల మరణం దరి చేరనీయడమని చాలా మంది నమ్ముతారు.

లక్ష్మీదేవికి స్వాగతం..

లక్ష్మీదేవికి స్వాగతం..

ఈ పవిత్రమైన రోజున లక్ష్మీదేవికి స్వాగతం పలకాలంటే.. కొత్త వస్తువులను, నగలను వెండి వస్తువులతో పాటు మరిన్ని విలువైన వస్తువులను కొంటారు. వీటిని కొనడం ద్వారా లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించి ఇల్లు సంపదలతో తులతూగాలని కోరుకుంటారు. ఒకవేళ మీరు బంగారం కొనలేకపోతే.. మీకు అంత సామర్థ్యం లేకపోతే.. మీరు ఏవైనా కొత్త పాత్రలు కొని లక్ష్మీదేవి, వినాయకుడిని పూజించొచ్చు.

ఈ పనులు చేయొద్దు..

ఈ పనులు చేయొద్దు..

* ఈ పవిత్రమైన రోజున ఎవ్వరికీ బహుమతులు ఇవ్వకూడదు.

* ఈరోజున ఇనుము సంబంధిత వస్తువులను కొనుగోలు చేయకూడదు.

* ఈరోజున కొత్త, పాత వాహనాలను విక్రయించరాదు.

* ఈరోజున నల్లని దుస్తులను ధరించరాదు.

* ఈరోజు నూనెను కొద్దిగా వాడాలి.

FAQ's
  • 2021 సంవత్సరంలో ధన త్రయోదశి ఎప్పుడొచ్చింది?

    2021 సంవత్సరంలో ధన త్రయోదశి నవంబర్ రెండో తేదీన వచ్చింది. ధనానికి ప్రతిరూపమైన లక్ష్మీదేవిని ఈరోజు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఎందుకంటే ధనలక్ష్మీ ఈ పవిత్రమైన రోజునే పుట్టిందని చాలా మంది నమ్ముతారు. అశ్వీయుజ క్రిష్ణ త్రయోదశిని ధన త్రయోదశి అంటారు.

English summary

Dhanteras 2021: What is Dhanteras? Why is it celebrated?

Here we are talking about the Dhanteras 2021:What is dhanteras? why it is celebrated? Read on
Story first published:Saturday, October 23, 2021, 14:09 [IST]
Desktop Bottom Promotion