For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Dhanurmasam rules:ఈ మాసంలో ఏ పనులు చేయాలి.. ఏవి చేయకూడదో తెలుసా...

|

హిందూ క్యాలెండర్ ప్రకారం, ధనుర్మాసానికి ఎంతో ప్రత్యేకమైనది. ఈ సమయంలో సూర్యుడు ధనస్సు నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ధనుర్మాసం వచ్చిందంటే.. ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది.

విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం కావడం వల్ల వైష్ణవులు ధనుర్మాస వ్రతం ఆచరిస్తారు. గోదాదేవి ధనుర్మాసమంతా విష్ణు వ్రతం చేపట్టి, స్వామిని కీర్తించింది. సూర్య దేవాలయాలు, వైష్ణవ ఆలయాలను దర్శించుకుంటే ఎంతో పుణ్యం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. ఈ ధనుర్మాసం విష్ణువికి చాలా ప్రత్యేకమైనది.

తిరుమలలో ధనుర్మాసం నెలరోజులు.. సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు. విష్ణు ఆలయాలల్లో ఉదయం అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు. ఇలా చేయడాన్ని బాలభోగం అంటారు. అలాగే ధనుర్మాసం దేవతలకి బ్రహ్మ ముహూర్తం లాంటిది. అయితే ఈ కాలాన్ని కొన్ని ప్రాంతాల్లో శూన్య మాసంగా భావిస్తారు. ఈ కాలంలో ఏ పని చేసినా శూన్య ఫలితం వస్తుందని భావిస్తారు. ఎందుకంటే ఈ మాసాన్ని శనికి సంబంధించిన మాసంగా భావిస్తారు. ఈ సందర్భంగా ధనుర్మాసంలో చేయాల్సిన పనులేంటి.. చేయకూడని పనులేంటి.. ఆచరించాల్సిన పద్ధతులంటే అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మార్గశిర మాసంలో మంచి ముహుర్తాలుంటాయా? పెళ్లిళ్లకు ఈ నెల మంచిదా? కాదా?

విష్ణువు ఆరాధన..

విష్ణువు ఆరాధన..

హిందూ పురాణాల ప్రకారం, మార్గశిర మాసంలో శ్రీ మహా విష్ణుమూర్తికి ఎంతో ప్రత్యేకమైనది. ఈ కాలంలో గాయత్రీ మంత్రాన్ని జపిస్తే మంచి ఫలితాలొస్తాయని పండితులు చెబుతారు. ఈ నెలలో మీరు ప్రతిరోజూ స్నానం చేసిన తర్వాత విష్ణు సహస్రనామం, గజేంద్ర మోక్షం, భగవద్డీతను పఠించాలి. ఇలా చేయడం వల్ల మీకు కష్టాల నుండి విముక్తి లభిస్తుంది.

ధనుర్మాసంలో..

ధనుర్మాసంలో..

ఈ మాసంలో సూర్యోదయానికి ముందే అంటే తెల్లవారుజామున బ్రహ్మ ముహుర్తంలోనే నిద్ర లేవాలి. ఆ తర్వాత స్నానం చేసి.. పూజను ప్రారంభించాలి. సూర్యోదయం తర్వాత నైవేద్యం కూడా పారాయణం చేయొచ్చు. సాయంకాలం సమయంలో నక్షత్రాలు వచ్చే సమయంలో విష్ణుమూర్తిని ఆరాధిస్తే గొప్ప ఫలితాలొస్తాయట. ధనుర్మాసంలో కనీసం ఒక్కరోజైన శ్రీ మహావిష్ణువును పూజిస్తే ఎంతో పుణ్య ఫలాలు దక్కుతాయని నమ్ముతారట. ఈ మాసంలో నూనె స్నానాలకు ప్రత్యేకమైనదట.

ధనస్సు రాశిలోకి..

ధనస్సు రాశిలోకి..

ధనుర్మాసంలోనే సూర్యుడు ధనస్సు రాశిలోకి సంచారం చేస్తాడు. ఈ కారణంగానే ఈ మాసాన్ని ధనుర్మాసం అంటారు. ఇదే రాశిలో సుమారు నెలరోజుల పాటు సంచారం చేస్తాడు. ఈ సమయాన్ని పవిత్రంగా భావించినప్పటికీ.. ఈ కాలంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదనే నిబంధనలు ఉన్నాయి. ఇది జనవరి 14వ తేదీ వరకు ఉంటుంది.

Datta Jayanti 2021:దత్త జయంతి శుభ ముహుర్తం ఎప్పుడు? దత్తాత్రేయుని విశిష్టత ఏంటి?

ముఖ్యమైన పనులు వాయిదా..

ముఖ్యమైన పనులు వాయిదా..

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈ కాలంలో సూర్యుని ప్రయాణం చాలా నెమ్మదిగా సాగుతుంది. గురుడి ప్రభావం కూడా తక్కువగా ఉంటుంది. ఈ కారణంగా దేవుడి పూజతో పాటు కొన్ని శుభకార్యాలు నిషేధించబడ్డాయి. సూర్యుని గమనం జనవరి 14వ తేదీ మకర రాశిపై ప్రభావం చూపుతుంది. ఈ సమయంలో సూర్యుని దిశ మారుతుంది. అప్పటి నుండి మళ్లీ శుభకార్యాలు ప్రారంభమవుతాయి.

ఏమి చేయకూడదంటే..

ఏమి చేయకూడదంటే..

ధనుర్మాసంలో ఎలాంటి వివాహ కార్యక్రమాలు, నిశ్చితార్థాలు, వధూవరుల వివాహాలు చేయకూడదట. ముఖ్యంగా ఇంటి నిర్మాణాలు, ఇల్లు కొనడం.. కొత్త ఇంట్లోకి ప్రవేశించడం వంటి పనులు చేయకూడదట. మరోవైపు కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించినా.. అనేక నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందట. ఎందుకంటే ఈ సమయంలో సూర్యుడు బలహీనంగా ఉంటాడు. ఈ కారణంగానే శుభకార్యాలను చేపట్టకూడదు.

మరో కథనం ప్రకారం..

మరో కథనం ప్రకారం..

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఏడాది పొడవునా సూర్యోదయం సమయంలో ఎప్పుడూ అశ్వరథాల ప్రయాణం అనేది ఆగదు. అయితే ఎండలో కూడా వేగంగా పరుగెత్తే ఈ గుర్రాలు.. ధనుర్మాసంలో మాత్రం చాలా అలసిపోతాయట. ఈ గుర్రాల కష్టం చూసిన సూర్యుడు విశ్రాంతి తీసుకునేందుకు ముందు వాటిని చెరువు వద్ద నీరు తాగేందుకు తీసుకెళ్తాడు. అయితే ఇదే సమయంలో సూర్యుని రథం బలహీనంగా మారిపోతుందట. అప్పుడు తన గుర్రాలను చెరువు దగ్గర వదిలేసి గాడిదలకు రథానికి కడతాడు. అప్పుడు అవి బరువైన రథాన్ని నెమ్మదిగా లాగుతాయి. అందుకే సూర్యుడు ఈ నెల రోజుల పాటు నెమ్మదిగా ప్రయాణిస్తాడట. దీంతో ఈ సమయంలో సూర్యుని ప్రయాణం చాలా నిదానంగా ఉంటుంది.

2021 సంవత్సరంలో ధనుర్మాసం ఎప్పుడు ప్రారంభమైనంది?

2021 సంవత్సరంలో డిసెంబర్ 16వ తేదీ నుండి ధనుర్మాసం ప్రారంభమైంది. హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి ఏటా మార్గశిర మాసంలో పుష్య నక్షత్రంతో ప్రారంభమయ్యే మాసం శనికి సంబంధించనది. అందుకే ఈ మాసాన్నే శూన్య మాసం అంటారు. ఈ మాసంలో ఏ పని చేసినా శూన్యమని నమ్ముతారు.

ధనుర్మాసంలో సూర్యుడు ఏ రాశిలోకి ప్రవేశిస్తాడు?

ధనుర్మాసంలోనే సూర్యుడు ధనస్సు రాశిలోకి సంచారం చేస్తాడు. ఈ కారణంగానే ఈ మాసాన్ని ధనుర్మాసం అంటారు. ఇదే రాశిలో సుమారు నెలరోజుల పాటు సంచారం చేస్తాడు. ఈ సమయాన్ని పవిత్రంగా భావించినప్పటికీ.. ఈ కాలంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదనే నిబంధనలు ఉన్నాయి. ఇది జనవరి 14వ తేదీ వరకు ఉంటుంది.

English summary

Dhanurmasam rules : Do's and Don'ts in Dhanu month in Telugu

Here we are talking about the dhanurmasam rules:do's and don'ts in dhanurmasam in Telugu. Have a look
Story first published: Monday, December 20, 2021, 15:04 [IST]