For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దివాళి మరియు దీపావళి మధ్య గల తేడాలేంటి? ఈ పండుగ విశిష్టతలేంటో తెలుసుకుందామా...

దివాళి మరియు దీపావళి మధ్య ఉండే తేడాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

|

హిందువులు జరుపుకునే పండుగలలో దీపావళికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ పండుగను ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. చెడుపై మంచి విజయం సాధించిన సందర్భంగా జరుపుకునే వేడుక ఇది.

Difference between Diwali and Deepavali in Telugu

ప్రతి ఒక్కరి ఇంట్లో చీకటిని తొలగించి వెలుగులను తీసుకొచ్చే అద్భుతమైన వేడుక. మతంతో సంబంధం లేకుండా అందరూ కలిసిమెలసి ఆనందంగా జరుపుకునే పండుగ దీపావళి. హిందూ క్యాలెండర్ ప్రకారం, అశ్వీయుజ మాసంలో బహుళ అమావాస్య రోజున ఈ పండుగ వస్తుంది.

Difference between Diwali and Deepavali in Telugu

ఈ ఏడాది నవంబర్ నాలుగో తేదీన ఈ పండుగ వచ్చింది. అయితే ఈ పండుగను ఉత్తర భారతంలో దివాళి అని పిలుస్తారు. అలాగే అక్కడ ఐదు రోజుల పాటు ఈ వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. మన దక్షిణ భారతంలో నాలుగురోజుల పాటు జరుపుకుంటారు. మనం దీపావళి అని పిలుస్తాం. ఈ సందర్భంగా దివాళి మరియు దీపావళి మధ్య గల తేడాలేంటి? ఈ పండుగ యొక్క విశిష్టతలేంటి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Naraka Chaturdashi 2021:నరక చతుర్దశిని ఎందుకు జరుపుకుంటారు? దీని వెనుక ఉన్న కథేంటో తెలుసుకుందామా...Naraka Chaturdashi 2021:నరక చతుర్దశిని ఎందుకు జరుపుకుంటారు? దీని వెనుక ఉన్న కథేంటో తెలుసుకుందామా...

దివాళి

దివాళి

దివాళి మరియు దీపావళి వ్యత్యాసం ఏంటంటే, దివాళి అనే పండుగను ఉత్తర భారతంలోని రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు జరుపుకునే పండుగ. అదే మన దక్షిణ భారతదేశంలోనూ ఎక్కువగా జరుపుకునే నాలుగు రోజుల పండుగ.

దివాళి, దీపావళి మధ్య తేడా..

దివాళి, దీపావళి మధ్య తేడా..

పురాణాల ప్రకారం.. శ్రీరాముడు వనవాసం ముగించుకుని తిరిగి అయోధ్యకు వచ్చి తన రాజ్యంలో అడుగుపెట్టిన సందర్భంగా ఉత్తర భారతంలో దివాళి పండుగ సంబురాలను ఘనంగా జరుపుకుంటారు. అదే మన దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల్లో అయితే శ్రీ కిష్ణుడి సతీమణి సత్యభామ నరకాసురుడిని సంహరించిన సందర్భంగా దీపావళి సంబరాలు జరుపుకుంటారు. దీపావళి అనేది సంస్క్రుతం నుంచి వచ్చిన పదం ఈ పండుగ హిందూ క్యాలెండర్ ప్రకారం అశ్వీయుజ మాసంలో అమావాస్య నాడు వస్తుంది.

దీపావళి ఎలా ప్రారంభమయ్యింది?

దీపావళి ఎలా ప్రారంభమయ్యింది?

దీపావళి అంటే వెలుగుల పండుగ. చీకటిని పారద్రోలి కాంతులను పంచే వేడుక. ఇది ఉత్తర భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ సమయం రాముడు వనవాసం నుండి తిరిగి అయోధ్య రాజ్యానికి వచ్చిన సందర్భాన్ని సూచిస్తుంది. ఇది రామాయణంలోని ఇతిహాసంలోని ఒక భాగం. ఇక్కడ రాముడు యువరాజుగా ఉన్నప్పుడు, అయోధ్యలోని తన తండ్రి రాజ్యం నుండి వనవాసానికి పంపబడ్డాడు. 14 సంవత్సరాలు వనవాసం పూర్తయిన తర్వాత తన భార్య సీతాదేవి, సోదరుడు లక్ష్మణుడితో కలిసి తిరిగొచ్చాడు. ఈ సమయంలో ఆ రాజ్యంలోని అన్ని గ్రామాల ప్రజలు మరియు రాజధాని నగరానికి మంచి పాలకుడు తిరిగి వచ్చినందుకు జరుపుకోవడానికి చిన్న మట్టి దీపాలను వెలిగించారు. ఈ పండుగను ఐదు రోజుల పాటు జరుపుకుంటారు. ధంతేరాస్, మినీ దీపావళి, దీపావళి మరియు లక్ష్మీపూజ, గోవర్ధన పూజ, భాయ్ దూజ్ వంటి వేడుకలను జరుపుకుంటారు.

ధన్వంతరి భగవంతుని జన్మదినాన్నే ధంతేరాస్ గా జరుపుకుంటారు. ధన్వంతరి దేవుడిని వైద్యునిగా పరిగణిస్తారు. అనంతరం లక్ష్మీదేవిని పూజిస్తారు. తమకు సంపద మరియు శ్రేయస్సును అందించాలని ప్రార్థిస్తారు.

Diwali 2021:దీపావళికి ముందే ఈ వస్తువులను ఇంట్లో నుండి తీసేయండి...!Diwali 2021:దీపావళికి ముందే ఈ వస్తువులను ఇంట్లో నుండి తీసేయండి...!

దక్షిణ భారతంలో..

దక్షిణ భారతంలో..

దక్షిణ భారతదేశంలోనూ దీపావళి పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. పురాణాల ప్రకారం, శ్రీ క్రిష్ణుడి భార్య సత్యభామ నరకాసరుడిని సంహరించిన సందర్భంగా దీపావళి పండుగ సంబరాలను జరుపుకున్నారు. మరోవైపు రాముడి చేతిలో రావణుడి పరాజయం సందర్భంగా కూడా ఈ వేడుకలను జరుపుకుంటారు. అదేవిధంగా ఈ పవత్రమైన రోజున లక్ష్మీదేవి పాల సముద్రం నుండి ఉద్భవించింది. అందుకే ఈరోజు లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు.

దీపాల అలంకరణ..

దీపాల అలంకరణ..

దీపావళి పండుగ సందర్భంగా దక్షిణ, ఉత్తర భారతంలో ప్రతి ఇంటిని దీపాలతో అలంకరిస్తారు. మట్టి ప్రమిదలు, నువ్వుల నూనె, ఆవు నెయ్యి వంటి వాటితో దీపాలను వెలిగిస్తారు. ఇలా వెలిగించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. అలాగే తులసి చెట్టు వద్ద కూడా దీపాలను వెలిగిస్తారు. ఈరోజున ధనలక్ష్మీ పూజలు చేస్తే ఆయురారోగ్యాలు, అష్టఐశ్వర్యాలు లభిస్తాయని నమ్ముతారు.

బలి పాడ్యమి..

బలి పాడ్యమి..

మరో కథనం ప్రకారం.. దీపావళి తర్వాతి రోజున బలి పాడ్యమి.. చతుర్దశి నాడు విష్ణుమూర్తి వామనుడి రూపంలో వచ్చి బలి చక్రవర్తిని పాతాళానికి అణిచేశాడు. ఇదే రోజున బలి చక్రవర్తి భూమి మీదకు వచ్చాడని.. అందుకే బలికి ప్రత్యేక పూజలు చేస్తారు. మహారాష్ట్ర వంటి రాష్ట్రంలో అయితే ఈరోజు నవ దివస్ గా జరుపుకుంటారు. గుజరాతీలు దీన్ని ఉగాది పండుగలా భావిస్తారు. శ్రీ క్రిష్ణుడు ప్రజలను జడివాన నుండి కాపాడేందుకు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి అందరినీ కాపాడిన రోజుగా భావిస్తారు.

FAQ's
  • ఉత్తర, దక్షిణ భారతంలో దీపావళి పండుగను ఎన్ని రోజులు జరుపుకుంటారు?

    ఈ ఏడాది నవంబర్ నాలుగో తేదీన ఈ పండుగ వచ్చింది. అయితే ఈ పండుగను ఉత్తర భారతంలో దివాళి అని పిలుస్తారు. అలాగే అక్కడ ఐదు రోజుల పాటు ఈ వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. మన దక్షిణ భారతంలో నాలుగురోజుల పాటు జరుపుకుంటారు. మనం దీపావళి అని పిలుస్తాం.

English summary

Difference between Diwali and Deepavali in Telugu

Here we are talking about the difference between diwali and deepavali in Telugu. Read on
Story first published:Wednesday, November 3, 2021, 12:57 [IST]
Desktop Bottom Promotion