For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Diwali 2021:దీపావళికి ముందే ఈ వస్తువులను ఇంట్లో నుండి తీసేయండి...!

దీపావళి 2021ముందు మీ ఇంట్లో అశుభకరమైన వస్తువులను తొలగించండి.

|

ఇటీవలే దసరా పండుగ ముగిసింది.. మరి కొద్ది క్షణాల్లో వెలుగుల పండుగ.. దీపావళి రాబోతోంది. ఇప్పటికే ఈ పండుగ సందర్భంగా అందరూ రకరకాల రంగుల లైట్లను అలంకరించడానికి ప్రణాళికలు రూపొందించుకున్నారు.

Diwali 2021: Inauspicious things to throw away from house before deepawali in Telugu

చాలా మంది తమ ఇళ్లను శుభ్రం చేసుకునే పనిలో పడ్డారు. ఈ పండుగకు ముందే ఇంటికి కొత్త రంగులు కూడా వేస్తున్నారు. అయితే దీపావళి పండుగ సమయంలో శుభ్రతకు చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం, ఎవరి ఇల్లు అయితే శుభ్రంగా ఉంటుందో.. లక్ష్మీదేవి వారి ఇంటికి వస్తుంది. అలాంటికి ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యలు ఉండవని చాలా మంది నమ్ముతారు.

Diwali 2021: Inauspicious things to throw away from house before deepawali in Telugu

అయితే దీపావళికి ముందు కొన్ని వస్తువులను అస్సలు ఇంట్లో ఉంచుకోకూడదట. ఇలాంటి వాటిని ఇంట్లో పెట్టుకోవడం వల్ల అశుభ ఫలితాలు వస్తాయట. అలాంటి వారి ఇంట్లో లక్ష్మీ దేవి ఎప్పటికీ నివాసం ఉండదట. అంతేకాదు వారికి పేదరికం, ఆర్థిక సమస్యలు వస్తాయట. ఈ సందర్భంగా దీపావళికి ముందు ఎలాంటి వస్తువులను తొలగించాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Diwali 2021:దీపావళి పండుగ వేళ చేయాల్సిన, చేయకూడని పనులివే...Diwali 2021:దీపావళి పండుగ వేళ చేయాల్సిన, చేయకూడని పనులివే...

పగిలిన ఫర్నీచర్..

పగిలిన ఫర్నీచర్..

వాస్తు శాస్త్రం ప్రకారం, పండుగ వేళ విరిగిన ఫర్నీచర్ ను ఇంట్లో ఉంచడం అశుభం. ఇలాంటి వస్తువులు మీ ఇంట్లో ఉంచడం వల్ల చెడు ప్రభావం కలుగుతుంది. మీ ఇంట్లో ఏదైనా టేబుల్ కుర్చీ లేదా మంచం విరిగిపోయినవి ఉంటే వెంటనే వాటిని ఇంటి నుండి బయటకు పారేయండి. అంతేకాదు.. ఇంట్లోని ఇతర ఫర్నీచర్ కూడా ఎల్లప్పుడూ కచ్చితమైన స్థితిలో ఉండాలని గుర్తుంచుకోండి.

విరిగిన పాత్రలు..

విరిగిన పాత్రలు..

వాస్తు శాస్త్రం ప్రకారం, మీ ఇంట్లో విరిగిన పాత్రలు ఉంచకూడదు. ఇలా ఉండటం వల్ల మీ ఇంటికి చెడు వాతావరణం వస్తుంది. కాబట్టి దీపావళి పండుగకు మీ ఇంట్లో ఇలాంటి పాత్రలు ఏవైనా ఉంటే వాటిని వెంటనే తొలగించండి. లేదంటే లక్ష్మీ దేవి అనుగ్రహం మీకు లభించదు. అలాగే లక్ష్మీదేవికి ఆగ్రహం కూడా కలగొచ్చు.

విరిగిన విగ్రహాలు..

విరిగిన విగ్రహాలు..

మీ ఇంట్లోని పూజ గదిలో మరియు ఇతర గదులలో విరిగిన విగ్రహాలు వెంటనే వాటిని తీసేయండి. ముఖ్యంగా దీపావళికి ముందు మీ ఇంట్లో వాటిని ఉంచొద్దు. కాబట్టి ఇప్పుడే మీ ఇంట్లోని దేవుని విగ్రహాలను ఒకసారి గమనించండి. అందులో ఏ విగ్రహాలు లేదా చిత్రపటాల్లో చిన్న చీలికలు వచ్చినా వాటిని తొలగించండి. వాటి స్థానంలో కొత్త దేవుని విగ్రహాన్ని ప్రతిష్టించండి. దీని వల్ల మీకు, మీ కుటుంబానికి మేలు జరుగుతుంది.

Dhanteras 2021: ధన త్రయోదశి రోజున ఖచ్చితంగా బంగారం ఎందుకు కొనాలి?Dhanteras 2021: ధన త్రయోదశి రోజున ఖచ్చితంగా బంగారం ఎందుకు కొనాలి?

పగిలిన గాజులను ఉంచొద్దు..

పగిలిన గాజులను ఉంచొద్దు..

మీ ఇంట్లో దీపావళికి ముందు పగిలిన గాజును ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచొద్దు. పొరపాటున మీరు మీ ఇంట్లో పగిలిన గాజులను ఉంచితే.. అశుభంగా ఉంటుంది. వీటితో పాటు పగిలిన బల్బులు మరియు పగిలిన అద్దాలు ఉంటే దాన్ని తొలగించండి. ఎందుకంటే పగిలిన గాజు ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది.

చిరిగిన చెప్పులు, బూట్లు..

చిరిగిన చెప్పులు, బూట్లు..

దీపావళికి ప్రతి ఒక్కరూ ఇంటిని శుభ్రం చేసుకుని.. అందంగా అలంకరించుకుంటారు. అయితే ఇంటి బయట ఉండే చెప్పులను, బూట్లను అంతగా పట్టించుకోరు. అయితే దీపావళికి ముందు చిరిగిన బూట్లు, చిరిగిన చెప్పులను ఉంటే బయటకు పారవేయాలి. దీని వల్ల కూడా మీ ఇంటికి ప్రతికూల శక్తిని వ్యాప్తి చేస్తాయి.

ఆగిపోయిన గడియారం..

ఆగిపోయిన గడియారం..

వాస్తు శాస్త్రం ప్రకారం, మీ ఇంట్లో ఆగిపోయిన గడియారాన్ని ఉంచొద్దు. ఇలాంటి వాటిని ఉంచడం మీ ఇంటికి చెడు ఫలితాలు రావొచ్చు. ఎందుకంటే గడియారం ఆనందం మరియు పురోగతికి చిహ్నం. మీ ఇంట్లో విరిగిన లేదా ఆగిన గడియం ఉంటే.. వెంటనే వాటిని తొలగించి.. దాని స్థానంలో కొత్తదాన్ని తెచ్చి పెట్టండి.

FAQ's
  • దీపావళికి ముందు ఎలాంటి వస్తువులను తొలగించాలి?

    2021 నవంబర్ మాసంలో దీపావళి పండుగ సందర్భంగా ఇలాంటి వస్తువులను అస్సలు ఉంచుకోకూడదు. మీ ఇంట్లో పగిలిన అద్దాలు, గాజులు, విరిగిన విగ్రహాలు, ఆగిన గడియారాలు, విరిగిన ఫర్నీచర్ ఉంచుకోకూడదు. వీటిని ఉంచుకోవడం వల్ల మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. కాబట్టి దీపావళికి ముందే వీటిని తొలగించండి.

English summary

Diwali 2021: Inauspicious things to throw away from house before deepawali in Telugu

Here we are talking about the diwali 2021:Inauspicious things to throw away from house before deepawali in Telugu. Have a look
Story first published:Thursday, October 28, 2021, 16:46 [IST]
Desktop Bottom Promotion