For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇంట్లో ఎలాంటి లక్ష్మీ దేవి ఫోటోలు ఉంటే అష్టఐశ్వర్యాలు పొందుతారు..?

కానీ మీకు తెలుసా..? కొన్ని ర‌కాల ల‌క్ష్మీదేవి చిత్ర ప‌టాల‌ను, బొమ్మలను, లేదా పంచలోహాలతో తయారుచేసిన విగ్రహాలను, ప్రతిమలను పూజిస్తే ధ‌నం నష్టం జరుగుతుంది.ఉన్నధ‌నం కూడా ఎలా వ‌చ్చిందో అలాగే ఖర్చుఅవుతుంది

|

సహజంగా హిందు సాంప్రదాయంలో దేవుళ్ళను ఎక్కవ దేవుళ్ళను పూజిస్తుంటారు. అయితే అన్ని మతాల వారు పూజించే లక్ష్మీదేవినే. ఈ ప్రపంచ మొత్తంలో అందరికీ అవసరాలను తీర్చేది డబ్బు, ధనానికి ఆదిదేవత లక్ష్మీ దేవి. చాలా మంది త‌మ‌కు అష్టైశ్వ‌ర్యాలు క‌ల‌గాల‌ని త‌మ‌కు ఇష్ట‌మైన ల‌క్ష్మీ దేవిని వివిధ రూపాల్లో ఆరాధిస్తుంటారు.

ఎందుకంటే ధ‌నానికి ఆమే కదా అధిప‌తి. ఎవ‌రికి ఐశ్య‌ర్యం సిద్ధించాల‌న్నా ఆమె అనుగ్ర‌హంతోనే అది సాధ్యం అవుతుంది. క‌నుకే చాలా మంది లక్ష్మిని ప్రార్థిస్తారు. అయితే చాలా మంది భ‌క్తులు త‌మ అనుకూల‌త‌లు, ఇష్టాల‌ను బ‌ట్టి వివిధ రూపాలు, ఆకారాలు, చిత్రాల్లో ఉన్న ల‌క్ష్మీ దేవి ప‌టాల‌ను, బొమ్మ‌ల‌ను, లేదా పంచలోహాలతో తయారుచేసిన విగ్రహాలను, ప్రతిమలను పూజిస్తారు.

కానీ మీకు తెలుసా..? కొన్ని ర‌కాల ల‌క్ష్మీదేవి చిత్ర ప‌టాల‌ను, బొమ్మలను, లేదా పంచలోహాలతో తయారుచేసిన విగ్రహాలను, ప్రతిమలను పూజిస్తే ధ‌నం నష్టం జరుగుతుంది. పైగా ఉన్న ధ‌నం కూడా ఎలా వ‌చ్చిందో అలాగే ఖర్చైపోతుందట. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ క్ర‌మంలో భక్తులు ఎలాంటి ప‌టాల‌ను, బొమ్మ‌ల‌ను పూజించాలో, ఎలాంటి వాటిని పూజించ‌కూడ‌దో ఇప్పుడే.. తెలుసుకుందాం...

గుడ్ల‌గూబ మీద లేదా పక్కన ఉన్న లక్ష్మీఫోటోను వెంటనే తొలగించాలి

గుడ్ల‌గూబ మీద లేదా పక్కన ఉన్న లక్ష్మీఫోటోను వెంటనే తొలగించాలి

గుడ్ల‌గూబ తెలుసుగా. దానిపై లక్ష్మీ దేవి కూర్చున్న‌ట్టుగా ఉండే ఫోటోను కానీ, లేదా విగ్రహాన్ని కానీ పూజించ‌కూడ‌ద‌ట‌. దీంతో అంతా అశుభ‌మే జ‌రుగుతుంద‌ట‌. ధ‌నం వ‌చ్చింది వ‌చ్చిన‌ట్టు ఖర్చు అవుతుందట‌.

ఎట్టి పరిస్థితిలో తామర పువ్వుపై నిల్చుని ఉన్న ల‌క్ష్మీని పూజింపకూడదు

ఎట్టి పరిస్థితిలో తామర పువ్వుపై నిల్చుని ఉన్న ల‌క్ష్మీని పూజింపకూడదు

తామ‌ర పూవుపై ల‌క్ష్మీదేవి నిలుచుని ఉన్న ఫొటోను ఇంట్లో ఎట్టిపరిస్థితిలో పెట్టుకోకూడదు. తామర పువ్వులో కూర్చున్న‌ట్టుగా ఉన్న ఫొటోను పూజించడం వల్ల అంతా శుభ‌మే జ‌రుగుతుంది. అష్టఐశ్వ‌ర్యం సిద్ధిస్తుంద‌ట‌.

 గ‌రుత్మంతునిపై విష్ణువుతోపాటు ల‌క్ష్మీ దేవి కూర్చొని ఉన్న మంచిది

గ‌రుత్మంతునిపై విష్ణువుతోపాటు ల‌క్ష్మీ దేవి కూర్చొని ఉన్న మంచిది

గ‌రుత్మంతునిపై విష్ణువుతో పాటు ల‌క్ష్మీ దేవి కూర్చుని ఉన్న ఫొటోను పూజించినా మిక్కిలిగా ధ‌నం ల‌భిస్తుంద‌ట‌. అంతా మంచే జరుగుతుంది.

విష్ణువు ప‌డుకుని ఉండ‌గా, ఆయ‌న కాళ్ల వ‌ద్ద లక్ష్మీ దేవి ఉన్న

విష్ణువు ప‌డుకుని ఉండ‌గా, ఆయ‌న కాళ్ల వ‌ద్ద లక్ష్మీ దేవి ఉన్న

శేష‌త‌ల్పంపై విష్ణువు ప‌డుకుని ఉండ‌గా, ఆయ‌న కాళ్ల వ‌ద్ద లక్ష్మీ దేవి ఉన్న ఫోటోను లేదా విగ్రహాన్ని పూజిస్తే అలాంటి వారి దాంప‌త్య జీవితం సుఖ‌మయంగా సాగుతుంద‌ట‌.

కుబేరుని విగ్ర‌హం

కుబేరుని విగ్ర‌హం

లక్ష్మీదేవికి అనుగ్రహం పొందిన కుబేరుని విగ్ర‌హం లేదా ఫొటోను ఇంట్లో పెట్టుకుంటే ల‌క్ష్మీ దేవి సంతృప్తి చెంది ఆ ఇంట్లోని వారికి ఐశ్వ‌ర్యాల‌ను క‌లిగిస్తుంద‌ట‌.

పాద‌ర‌సంతో త‌యారు చేసిన ల‌క్ష్మీ దేవి విగ్ర‌హాన్ని పూజిస్తే

పాద‌ర‌సంతో త‌యారు చేసిన ల‌క్ష్మీ దేవి విగ్ర‌హాన్ని పూజిస్తే

పాద‌ర‌సంతో త‌యారు చేసిన ల‌క్ష్మీ దేవి విగ్ర‌హాన్ని పూజిస్తే అన్నీ శుభాలే క‌లుగుతాయ‌ట‌. ధ‌నం కూడా బాగా స‌మ‌కూరుతుంద‌ట‌.

 శ్రీ‌యంత్రాన్ని ఒక ఎర్ర‌ని వ‌స్త్రంలో చుట్టి దాన్ని మీ మ‌నీ లాక‌ర్‌లో పెట్టాలి.

శ్రీ‌యంత్రాన్ని ఒక ఎర్ర‌ని వ‌స్త్రంలో చుట్టి దాన్ని మీ మ‌నీ లాక‌ర్‌లో పెట్టాలి.

శ్రీయంత్రం గురించి తెలియని వారుండరు. ఇంట్లో ఎలాంటి కష్టనష్టాలు జరగకుండా, ధన ధాన్యంతో సంవ్రుద్దిగా ఉండాలని, ఇంట్లో శ్రీయంత్రాన్ని ఏర్పాటు చేసుకుంటారు. దీపావళి రోజున స్ఫ‌టిక శ్రీ‌యంత్రాన్ని ఒక ఎర్ర‌ని వ‌స్త్రంలో చుట్టి దాన్ని మ‌నీ లాక‌ర్‌లో పెట్టాలి. ఇలా చేస్తే ఆ ఇంట్లో అంతా శుభ‌మే జ‌రుగుతుంది.

ల‌క్ష్మీ పూజ చేసేట‌ప్పుడు తుల‌సి ఆకులు, ధూపం, దివ్వెలు,

ల‌క్ష్మీ పూజ చేసేట‌ప్పుడు తుల‌సి ఆకులు, ధూపం, దివ్వెలు,

ల‌క్ష్మీ పూజ చేసేట‌ప్పుడు విష్ణువుకు ప్రీతికరమైన తుల‌సి ఆకులు, ధూపం, దివ్వెలు, పువ్వుల‌ను ఎక్కువగా వాడి పూజ చేయాల‌ట‌. దీంతో అనుకున్న‌ది నెరవేరుతుందట.

దీపావళి రోజున ల‌క్ష్మీ దేవి, కుబేరున్ని పూజించి అనంత‌రం ఈ మంత్రాన్ని 108 సార్లు ప‌ఠించాలి.

దీపావళి రోజున ల‌క్ష్మీ దేవి, కుబేరున్ని పూజించి అనంత‌రం ఈ మంత్రాన్ని 108 సార్లు ప‌ఠించాలి.

దీపావళి రోజున ల‌క్ష్మీ దేవితో పాటు, కుబేరున్ని పూజించి తర్వాత ఈ మంత్రాన్ని 108 సార్లు ప‌ఠించాలి. ఇలా మంత్ర జపం చేయడం వ‌ల్ల భక్తులకు అనుకున్న‌ది నెర‌వేరుతుంద‌ట‌.

ఓం య‌క్షాయ కుబేరాయ వైశ్ర‌వ‌ణాయ ధ‌న‌ధాన్యాధిప‌త‌యే

ధ‌న‌ధాన్య‌స‌మృద్ధిం మే దేహి దాప‌య స్వాహా

English summary

Diwali Special : Pray for these Lakshmi idols and photos to get better results.!

Diwali Special : Pray for these Lakshmi idols and photos to get better results.! Goddess Lakshmi , not just a woman, she is the entire universe, the expressive power of the lord ...Goddess Lakshmi is one among the trinity of goddesses. Wedded to Maha Vishnu, Laksmi is the provider of wealth and prosperity. The word Lakshmi has its roots in the sanskrit word "Lakshya" which means 'goal' or 'aim'. She is one of the most common deities worshiped in a Hindu home. The month of October is of special significance for the worship of Lakshmi.
Desktop Bottom Promotion