For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శివుడి సోదరి వెనక ఉన్న ఆశ్చర్యకర కథేంటి ?

By Swathi
|

పురాణాల విషయానికి వస్తే.. మనం ఏం చూసి ఉంటామో, ఏది చదివి ఉంటామో.. వాటినే నమ్ముతాం. కానీ.. చాలా అరుదుగా వినిపించే కథలు చాలా ఆశ్చర్యానికి గురిచేస్తాయి. చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అలాంటి విషయాల గురించి మరింత ఎక్కువ తెలుసుకోవాలనిపిస్తుంది.

ఆశ్చర్యపరుస్తున్న శ్రీరాముడి సోదరి రహస్య జీవితం.. !! ఆశ్చర్యపరుస్తున్న శ్రీరాముడి సోదరి రహస్య జీవితం.. !!

భారతీయ పురాణాలు కూడా అలాంటివే. మనకు చెప్పిన కథలను మాత్రమే నమ్ముతాము. కానీ.. కొన్ని వాస్తవానికి జరిగినా.. వాటిని మనకు వివరించలేదు. అలాంటిదే శివుడి సోదరి జీవితం కూడా ? ఆశ్చర్యంగా ఉందా.. శివుడికి సోదరి ఎవరు అని ? నిజమే.. శివుడికి సోదరి ఉంది. ఆమె ఆసక్తికర కథేంటి ? అలాగే.. ఆమెను పార్వతీదేవి కైలాసం నుంచి ఎందుకు పంపించిందో.. ఇప్పుడు తెలుసుకుందాం.

శాంత

శాంత

అయోధ్యలో ముందుగా రాముడు జన్మించలేదన్న వాస్తవం.. అందరినీ ఆశ్చర్యపరిచింది. రాముడికి శాంత అనేక సోదరి ఉందన్న విషయం కూడా.. అందరినీ.. షాక్ కి గురిచేసింది. ఆమెను తన తండ్రే.. రాజ్యం నుంచి బయటకు పంపాడు.

శివుడు

శివుడు

మీకు తెలుసా ? శివుడికి కూడా సోదరి ఉందని ? ఈ విషయం చాలామందికి తెలియదు. శివుడికి సోదరి ఉందా అంటే.. చాలామంది నమ్మలేకపోతారు.

దేవి అసావరి

దేవి అసావరి

కానీ.. శివ పురాణంలో.. శివుడి సోదరి గురించి ప్రస్తావించారు. దేవి అసావరిని శివుడే రూపొందించాడు. అది కూడా.. తన భార్య పార్వతీ దేవిని ఒప్పించి.. ఈమెను సృష్టిస్తాడు.

కైలాసం

కైలాసం

శివపార్వతుల పెళ్లి తర్వాత.. పార్వతి కైలాసానికి వస్తుంది. ఆమె తన కుటుంబాన్ని, అక్కచెల్లెల్లను దూరమవుతున్నానని బాధపడుతుంది.

తోడు కావాలని

తోడు కావాలని

అలా తన కుటుంబ సభ్యులను మిస్ అవుతున్న పార్వతీదేవిని.. శివుడు, శివుడి పరమ భక్తుడు నంది జాగ్రత్తగా చూసుకునేవాళ్లు. అయినా కూడా.. పార్వతీదేవి.. తనకు ఒక తోడు కావాలని భావించేది.

పార్వతీదేవి కోరిక

పార్వతీదేవి కోరిక

కైలాసంలో తనకు సోదరిలా ఉండే.. ఒక తోడు కావాలని.. తన కోరికను శివుడికి వివరించింది. శివుడి ధ్యానంలోకి వెళ్లినప్పుడు తన ఆలోచనలు, అభిప్రాయాలు పంచుకోవడానికి రోజంతా గడపడానికి ఒక తోడు కావాలని కోరుకుంది.

కోరిక తీర్చడానికి

కోరిక తీర్చడానికి

కైలాసంలో ఎక్కువమంది మగవాళ్లు ఉంటారు. పార్వతీదేవి మాత్రమే కైలాసంలో ఉండే మహిళ.

సరస్వతీ దేవి

సరస్వతీ దేవి

శివుడు.. సరస్వతీదేవిని సోదరిగా భావిస్తూ.. సరస్వతిదేవితో రోజంతా గడుపుతావా అని.. పార్వతిని అడిగాడు. ఆమెతో కబుర్లు చెబుతూ, కాలక్షేపం చేయమన్నారు.

బ్రహ్మ

బ్రహ్మ

సరస్వతి తన భర్త బ్రహ్మతో కలిసి ఉంటుంది కదా.. ఇక తనకు నచ్చినట్లు.. సరస్వతి దేవి ఎలా గడుపుతుందని గుర్తు చేసుకుంది.

శివుడి సోదరి జననం

శివుడి సోదరి జననం

పార్వతీ దేవి కోరికను.. శివుడి అంగీకరించి.. ఆమె కోరిక నెరవేర్చాలని నిర్ణయించుకున్నాడు. తన సోదరిని మాత్రమే సృష్టించగలను అని చెప్పి.. ఆమెను జీవితాంతం.. జాగ్రత్తగా చూసుకోవాలని శివుడు..పార్వతికి చెబుతాడు.

అంగీకరించిన పార్వతి

అంగీకరించిన పార్వతి

శివుడు తన సోదరిని సృష్టిస్తాను అన్నందుకు పార్వతి చాలా సంతోషపడింది. మహిళను ఎలా సృష్టించాలనేదానిపై ఐడియా లేదు. అయితే తన శక్తి, తెలివిని ఉపయోగించి.. మహిళలను.. తన పోలికలతో సృష్టిస్తాడు.

అసావరి జననం

అసావరి జననం

కాస్త బొద్దుగా, ఆకర్షణీయంగా, పొడవాటి జుట్టు కలిగి, పగిలిన పాదాలు, ఏమీ ధరించని, జంతువు చర్మం కలిగిన మహిళను శివుడు సృష్టిస్తాడు.

ఆడపడుచు

ఆడపడుచు

శివుడు ఆమెను పార్వతి దగ్గరకు తీసుకెళ్లి.. తన సోదరి అని.. దేవి అసావరిని పరిచయం చేస్తాడు. తనకు ఆడపడుచు దొరికిందని.. పార్వతి చాలా సంతోషపడుతుంది. ఆమెకు స్నానం చేయించి.. కొత్త దుస్తులను ఇస్తుంది.

కుటుంబం

కుటుంబం

తన వంటగదిలో.. తనకు భోజనం పెట్టమని పార్వతీదేవి.. దేవి అసావరి అడుగుతుంది. వెంటనే పార్వతీదేవి అసావరికి రుచికరమైన భోజనం తయారు చేసి పెడుతుంది. అంతా ఒకేసారి తినేసి.. కైలాసంలో ఉన్న ఆహారం మొత్తం అయిపోయేంత వరకు ఇంకా కావాలని అడుగుతూనే ఉంటుంది. అప్పుడు ఏం చేయలేక అయోమయంలో పడిపోతుంది.. పార్వతి.

పగిలిన పాదాలు

పగిలిన పాదాలు

పార్వతి అసావరి ఆకలి తీర్చడానికి శివుడి సహాయం కోసం బయల్దేరింది. దుర్మార్గంగా.. పార్వతిని బంధించి.. తన పగిలిన పాదాల్లో దాచుకుంటుంది.. దేవి అసావరి. ఇదంతా తెలుసుకున్న శివుడు వచ్చి.. పార్వతికి చికిత్స అందిస్తాడు.

అపద్ధం చెప్పిన అసావరి

అపద్ధం చెప్పిన అసావరి

ఆమెపై కిరాతకంగా వ్యవహరించిని అసావరిని.. పార్వతి ఎక్కడ అని శివుడు అడిగాడు. ఆమె ఎక్కడికి వెళ్తుందో తనకేం తెలుసని అసావరి అపద్ధం చెబుతుంది. అబద్ధం చెబుతోందని తెలుసుకున్న శివుడు ఆమెను హెచ్చరిస్తాడు. అందుకు భయపడి.. కాలిని కదిలించడంతో.. పార్వతి పగిలిన పాదాల్లో నుంచి బయటపడుతుంది.

తాను ఇచ్చిన మాట తప్పిన పార్వతి

తాను ఇచ్చిన మాట తప్పిన పార్వతి

చాలా కిరాతకంగా వ్యవహరించిన అసావరి ప్రవర్తన గురించి బాధపడిన పార్వతి.. ఆమెను కైలాసం వదిలివెళ్లమని అడుగుతుంది. అసావరిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పినట్టు మాట తీసుకున్నానని.. శివుడు గుర్తు చేస్తాడు.

మంచి బుద్ది

మంచి బుద్ది

మాట తప్పినందుకు శివుడిని క్షమాపణ కోరిన పార్వతి.. అసావరితోపాటు.. కైలాసంలో ఉండటం కష్టమని చెబుతుంది.

అసావరి పునర్జన్మ

అసావరి పునర్జన్మ

అసావరికి మంచి బుద్ధి ప్రసాదించాలని.. శివుడు నిర్ణయించుకుంటాడు. అసావరి చాలా వినయ విధేయతలు కలిగి ఉంటే.. తనకు ఎలాంటి సమస్య ఉండదని, కైలాసంలో ఆమెతో పాటు ఉంటానని చెబుతుంది పార్వతి.

సందేశం

సందేశం

అయితే పార్వతి అభ్యర్థనను శివుడు తోసిపుచ్చుతారు. ఒకే ఇంట్లో ఇద్దరు మహిళలు.. ఎక్కువ కాలం సంతోషంగా ఉండలేరని.. చెబుతాడు శివుడు. అంటే రక్త సంబంధం కాకుండా.. ఇతర మహిళతో సంతోషంగా ఉండలేరని వివరించారు.

English summary

Do You Know about Lord Shiva's sister ? Secret Story of Lord Shiva's Sister

Do You Know about Lord Shiva's sister ? Secret Story of Lord Shiva's Sister. When it comes to ancient legends, we believe in what we hear and see, but seldom take interest in finding out about them ourselves.
Desktop Bottom Promotion