For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిమిషంలో కోరికలు తీర్చే దేవత గురించి మీకు తెలుసా...

నిమిషంలో కోరికలు తీర్చే దేవతగా ప్రసిద్ధి గాంచిన ఈ దేవత పేరు నిమిషాంబిక దేవి. భక్తులందరికీ దర్శనమిచ్చే ఈ దేవి పార్వతీదేవీ అంశగా పురాణాలు చెబుతున్నాయి.

|

మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పురాతన దేవాలయాలు ఉన్నాయి. ప్రతి దేవాలయానికి పెద్ద చరిత్ర అనేది ఉంటుంది. అలాగే దేవాలయంలోని దేవుళ్లకు అనేక మహిలు ఉంటాయి. అలాగే ప్రతి గ్రామంలోనూ గ్రామ దేవతలు కొలువై ఉండటం మనందరికీ తెలిసిన విషయమే.


అయితే ఎక్కడా లేని విధంగా కర్నాటకలోని ఓ గ్రామంలో కేవలం ఒక్క నిమిషంలో ఓ దేవత భక్తులు కోరికలను నెరవేరుస్తుందట. ఇంతకీ ఇది నిజమేనా కాదా? ఈ గ్రామం ఎక్కడ ఉంది? ఆ గ్రామ దేవత పేరు ఏంటి? అనే పూర్తి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకోండి...
నిమిషాంబిక దేవి..

నిమిషాంబిక దేవి..

నిమిషంలో కోరికలు తీర్చే దేవతగా ప్రసిద్ధి గాంచిన ఈ దేవత పేరు నిమిషాంబిక దేవి. భక్తులందరికీ దర్శనమిచ్చే ఈ దేవి పార్వతీదేవీ అంశగా పురాణాలు చెబుతున్నాయి.

ఖడ్గంతో రుద్ర రూపంలో..

ఖడ్గంతో రుద్ర రూపంలో..

ఈ అమ్మవారి ఆలయంలో గర్భగుడిలో ఉంటారు. ఈ అమ్మవారి చేతిలో ఖడ్గంతో రుద్రరూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ అమ్మవారిని భక్తులు ఏదైనా కోరికలు కోరుకుంటే నిమిషంలో ఫలితం ఉంటుందని భక్తులందరూ విశ్వసిస్తారట.

400 సంవత్సరాల క్రితం

400 సంవత్సరాల క్రితం

కృష్ణరాజు ఒడియార్ అనే రాజు ఈ ఆలయాన్ని 400 సంవత్సరాల క్రితం ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది.

పురాణాల ప్రకారం...

పురాణాల ప్రకారం...

పూర్వం ఇక్కడ ముక్తకుడు అనే ఒక రుషి ఉండేవాడు. ఆయన శివుడి అంశ అని అందరూ చెప్పేవారు. అయితే ముక్తకుడు లోక కళ్యాణార్థం ఒక యాగాన్ని తలపెట్టగా, ఆ యాగం వలన తమకు ముప్పు ఉందని భావించిన రాక్షసులు ఆ యాగాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.

ఒక్క నిమిషంలోనే..

ఒక్క నిమిషంలోనే..

అయితే యాగం జరుగుతుండగా ముక్తకుడిపై రాక్షసులు ముప్పేట దాడి చేస్తారు. వారిని వారించడం ముక్తకుడి వల్ల సాధ్యం కాలేదు. అప్పుడు పార్వతీ దేవి యజ్ఞకుండంలో నుండి ఉద్భవించి ఆ రాక్షసులో కేవలం ఒక్క నిమిషంలోనే అంతం చేసిందట. ఆ విధంగా ఇక్కడ వెలసిన పార్వతీ దేవికి నిమిషాంబిక దేవి అనే పేరు వచ్చినట్లు పురాణాలలో పేర్కొనబడింది.

శ్రీ చక్ర ఆరాధన..

శ్రీ చక్ర ఆరాధన..

ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహంతో పాటు శ్రీ చక్రాన్ని కూడా ఆరాధిస్తుంటారు. ఇక్కడ శివుడు మౌక్తికేశ్వరునిగా పూజలను అందుకుంటారు. ఈ ఆలయానికి వచ్చే భక్తులు గాజులు, బట్టలను, నిమ్మకాయల దండలను అమ్మవారికి సమర్పిస్తుంటారు.

బలిపీఠంపై గంటలు..

బలిపీఠంపై గంటలు..

ఈ ఆలయంలో ఇంకో విశేషం కూడా ఉంది. అది ఏంటంటే బలిపీఠం మీద అన్నం పెట్టి గంటలను మోగిస్తే ఎక్కడెక్కడి నుండో కాకులు వచ్చి ఈ ఆహారాన్ని స్వీకరిస్తాయట. ఇలా ప్రతిరోజూ కాకులకు ఆహారాన్ని పెట్టడాన్ని బలిభోజనం అని పిలుస్తారట.

మాండ్య జిల్లాలో..

మాండ్య జిల్లాలో..

ఈ ఆలయం ఎక్కడ ఉందంటే కర్నాటక రాష్ట్రం మాండ్య జిల్లాలో ఉంది. ఆ జిల్లాలోని శ్రీరంగపట్నానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో గంజాం అనే చిన్న గ్రామంలో ఈ నిమిషాంబిక దేవి ఆలయం ఉంది. ఈ ఆలయంలోని అమ్మవారి మెడలో వేసిన నిమ్మకాయలను తీసుకెళ్లి మీ ఇంట్లోని పూజగదిలో ఉంచితే సర్వశుభాలూ జరుగుతాయని భక్తులు నమ్ముతారు.

English summary

Do you know about the Goddess who fulfills the desires of the minute

Sri Nimishamba is considered as the incarnation of goddess parvathi, the consort of Lord Shiva. This place Ganjam is considered as a holy place. Muktharaja of Somavamsha Aryakshatriya performed penance at Nimishamba Temple.
Story first published:Saturday, December 7, 2019, 16:59 [IST]
Desktop Bottom Promotion