మీకు అయ్యప్పస్వామి కథ తెలుసా?

Subscribe to Boldsky

ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలలో శబరిమల ఒకటి. ఈ పుణ్యక్షేత్రాన్ని ప్రతియేటా భక్తకోటి సందర్శిస్తుంటారు. ప్రపంచంలో ఏడాదికోసారి భక్తులు సందర్శించే పుణ్య క్షేత్రాల జాబితాలో హజి్‌లోని మక్కా మసీదు ప్రథమ స్థానంలో ఉంటే.. శబరిమలది రెండోస్థానం అని చెప్పవచ్చు.

శబరిమలలో కొలువైవున్న అయ్యప్ప స్వామి క్షేత్రం, దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచినది. కేరళ పశ్చిమ కొండ పర్వతప్రాంతాలలో కొలువై ఉన్న ఈ ఆలయానికి సమీపంలో తమిళనాడు సరిహద్దు ప్రాంతం ఉంది. మొత్తం 18 పర్వత శ్రేణుల మధ్య నెలకొన్న ఈ ప్రాంతాన్ని పూంకవనమ్ అని పిలుస్తారు. ఈ ప్రాంతమంతా దట్టమైన అడవులు మరియు కొండలతో కూడి ఉంటుంది.

శబరిమలలో అయ్యప్ప స్వామి విగ్రహాన్ని పరశురామ మహర్షి ప్రతిష్టించినట్లు చెపుతారు. అయ్యప్ప స్వామికి సంబంధించిన ఓ కథ ప్రకారం....

1. విష్ణువు మరియు శివుడి కొడుకు,అయ్యప్ప

1. విష్ణువు మరియు శివుడి కొడుకు,అయ్యప్ప

అయ్యప్పన్ లేదా అయ్యప్ప దక్షిణభారతంలోనే ప్రసిద్ధమైన హిందూ దేవుడు. అయ్యప్ప పరమశివుడు మరియు విష్ణుమూర్తిల కలయికతో (విష్ణుమూర్తి స్త్రీ అవతారం మోహినిగా) పుట్టిన బిడ్డగా చెప్తారు.

2.విష్ణువు మరియు శివుడి అంశ

2.విష్ణువు మరియు శివుడి అంశ

అందుకని అయ్యప్పను హరిహరపుత్ర లేదా హరిహరన్ పుత్రన్ అని కూడా అంటారు, దాని అసలు అర్థం హరి లేదా విష్ణువు మరియు హరన్ లేదా శివుడి కొడుకు అని.

3. అయ్యప్పను మణికందన్ అని ఎందుకంటారు

3. అయ్యప్పను మణికందన్ అని ఎందుకంటారు

అయ్యప్పను మణికంఠ అని ఎందుకంటారు అంటే ఆయన జీవితచరిత్ర ప్రకారం, ఆయన తల్లిదండ్రులు పుట్టగానే అయ్యప్ప మెడ(కందన్) చుట్టూ ఒక బంగారు గంట (మణి) కట్టారంట.

4. దైవకార్యంకై పుట్టిన దేవత

4. దైవకార్యంకై పుట్టిన దేవత

ఒక కథనం ప్రకారం శివుడు మరియు మోహిని తమ బిడ్డను(తన కర్తవ్యాన్ని నిర్వహించటం కోసం) పంపానది తీరంలో వదిలివెళ్ళారట. పిల్లలు లేని పండాలం రాజు రాజశేఖరుడు ఆ పసికందు అయ్యప్పను గుర్తించి తనకు దక్కిన వరంగా, తన కొడుకుగా దత్తతు చేసుకున్నాడూ.

5. అయ్యప్ప ఎందుకు సృష్టించబడ్డాడు

5. అయ్యప్ప ఎందుకు సృష్టించబడ్డాడు

పురాణాలలో అయ్యప్ప జన్మరహస్య కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. దుర్గా అమ్మవారు మహిషాసురుడ్ని చంపేసాక, అతని సోదరి మహిషి పగ తీర్చుకోటానికి బయల్దేరుతుంది.

6.బ్రహ్మ వరం

6.బ్రహ్మ వరం

ఆమె విష్ణువు మరియు శివుడికి కలిపి పుట్టిన బిడ్డతోనే తను సంహరింపబడగలదని బ్రహ్మ నుంచి వరం పొందింది. మరో మాటల్లో చెప్పాలంటే ఆమెను ఎవరూ ఆపలేరు,నాశనం చేయలేరు. ప్రపంచాన్ని ఆమె నుంచి రక్షించటానికి, విష్ణుమూర్తి మోహినిగా అవతారం ధరించి పరమశివుడిని పెళ్ళాడాడు. వారి కలయికతోనే అయ్యప్ప స్వామి జన్మించాడు.

7. అయ్యప్ప చిన్నతనం

7. అయ్యప్ప చిన్నతనం

మహారాజు రాజశేఖరుడు అయ్యప్పను దత్తత చేసుకున్నాక, తన సొంతబిడ్డ రాజరాజన్ పుట్టాడు. ఇద్దరు అబ్బాయిలు యువరాజుల్లాగానే పెరిగినా, అయ్యప్ప యుద్ధకళలలో, వివిధ శాస్త్రాలు,పురాణాలలో తన ప్రతిభ కనబర్చాడు.

8.గురువు

8.గురువు

శిక్షణ,చదువు అయిపోయాక. తన గురువుకి గురుదక్షిణ చెల్లించిన సమయంలో, అయ్యప్ప అభూతశక్తులు తెలిసిన గురువు ఆయనని తన గుడ్డి మరియు మూగ కొడుకుకి చూపు,మాట తెప్పించమని కోరాడు. మణికంఠ తన చేతిని ఆ బాబు తలపై పెట్టగానే అద్భుతం నిజంగానే జరిగింది!

9. అయ్యప్పపై రాజకుట్ర

9. అయ్యప్పపై రాజకుట్ర

సింహాసనానికి వారసుడిని ప్రకటించే సమయం వచ్చేసరికి, మహారాజు రాజశేఖర అయ్యప్పనే రాజుగా చూడాలనుకున్నాడు కానీ మహారాణి తన సొంత కొడుకే రాజు కావాలని ఆశించింది. అందుకని దివాను(మంత్రి) మరియు వైద్యుడితో కలిసి మణికంఠను చంపేసే పథకం వేసింది.

10. పులి పాలు

10. పులి పాలు

అనారోగ్యం నాటకంలో భాగంగా, మహారాణి తన వైద్యుడు అసాధ్యమైన చిట్కా చెప్పేట్లా చేసింది- ఆడపులి పాలని తేవడం. ఎవరూ అది చేయలేనప్పుడు, ధైర్యవంతుడైన మణికంఠ తను వెళ్తానని, తండ్రి వద్దంటున్నా చెప్తాడు.

11. మహిషి

11. మహిషి

వెళ్ళేదారిలో, రాక్షసి మహిషిని ఎదుర్కొని, అఝుథ నది తీరంలో సంహరిస్తాడు. అలా ఆయన జీవితలక్ష్యం పూర్తయింది.కానీ వెళ్ళాల్సిన దూరం చాలా ఉంది..అందుకని, మణికంఠ అడవిలో పులిపాల కోసం ప్రవేశించాడు. అక్కడేమయిందో తెలుసా?పులితో పోరాడి గెలిచి, దాని మీదనే ఊరేగుతూ భవంతికి తిరిగొచ్చాడు!

12. అయ్యప్పను దేవుడిగా అంగీకరించడం

12. అయ్యప్పను దేవుడిగా అంగీకరించడం

మహారాజుకి తన కొడుకుపై మహారాణి చేసిన కుట్ర తెలిసిపోయి, మణికంఠను క్షమించమని అర్థిస్తాడు. మణికంఠ మహారాజుకి తన జీవితలక్ష్యం పూర్తయినందున, స్వర్గానికి తిరిగి వెళ్ళాల్సివుంటుందని తెలిపాడు. మహారాజును శబరి కొండపై తన చిన్న జీవితానికి గుర్తుగా ఒక ఆలయం నిర్మించమని కోరతాడు.

13. పరశురాముడు

13. పరశురాముడు

ఈ గుడి కట్టడం పూర్తయ్యాక, పరశురాముడు అయ్యప్ప విగ్రహాన్ని మకరసంక్రాంతి పర్వదినాన ప్రతిష్టించాడట. అలా అయ్యప్ప దేవునిగా పూజించబడుతున్నాడు.

14. అయ్యప్పస్వామిని పూజించటం

14. అయ్యప్పస్వామిని పూజించటం

అయ్యప్పస్వామి, తన భక్తులు తనని చేరుకోటానికి, తన ఆశీర్వాదం పొందటానికి కఠినమైన మతాచారాలను పెట్టాడని నమ్ముతారు. మొదట భక్తులు 41 రోజుల కఠిన తపస్సును చేసాక ఆలయానికి యాత్రను మొదలుపెట్టాలి.

15. బ్రహ్మచర్యం పాటించాలి

15. బ్రహ్మచర్యం పాటించాలి

ఇదొక్కటే కాదు. శారీరక అవసరాలు, కుటుంబ బంధాలు అన్నీ వదిలేసి పూర్తిగాసన్యాసిలాగా, ‘బ్రహ్మచారి'లా జీవించాలి.

16. కష్టతరమైన యాత్ర

16. కష్టతరమైన యాత్ర

పైగా భక్తులు మైళ్ళకి మైళ్ళు నడవాలి, పంపా నదిలో మునిగి స్నానం చేయాలి, ఇక ఆఖరున ఏటవాలుగా, జారుడుగా ఉండే 18 మెట్లను ఎక్కి శబరిమల ఆలయం చేరాలి.

17. శబరిమల, ప్రసిద్ధ తీర్థస్థలం

17. శబరిమల, ప్రసిద్ధ తీర్థస్థలం

కేరళలోని శబరిమల, ప్రసిద్ధ అయ్యప్ప ఆలయం. ప్రతీ ఏడాది ఇక్కడకి 50మిలియన్ల భక్తులు సందర్శనకి వస్తారు. దానివల్ల ప్రపంచంలోనే ప్రసిద్ధ తీర్థస్థలాలలో ఒకటిగా మారింది.

18. మకరసంక్రాంతి

18. మకరసంక్రాంతి

దేశవ్యాప్త భక్తులు దట్టమైన అడవుల గుండా, ఏటవాలు పర్వతాల నుంచి, కఠిన వాతావరణంలో అయ్యప్ప ఆశీర్వాదం కోసం ప్రతి సంవత్సరం జనవరి 14న ఇక్కడికి వస్తారు. ఆరోజును మకరసంక్రాంతి లేదా పొంగల్ అని కూడా అంటారు. ఆరోజు అయ్యప్పే స్వయంగా దివి నుంచి దీపం ఆకారంలో కిందకి వస్తాడని భావిస్తారు. ఆ దీపపు వెలుగును ‘మకర విలకు' అని కూడా అంటారు.

19. తిరిగి రావటం

19. తిరిగి రావటం

భక్తులు స్వామికి పెట్టిన నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించి, 18 మెట్లు దిగి, వెనక్కి నడుస్తూ, స్వామిని చూస్తూ వెనక్కి వస్తారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Do you know the story of Ayyappa?

    Lord Ayyappan, or simply Ayyappa, is a popular Hindu deity worshiped mainly in South India. Ayyappa is believed to have been born out of the union between Lord Shiva and Vishnu (in female form, as the mythical enchantress Mohini)…
    Story first published: Thursday, November 30, 2017, 8:30 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more