Latest Updates
-
పకోడీలు, బజ్జీలు బోర్ కొట్టాయా? అయితే ఈ కరకరలాడే మునగకాయ స్నాక్ ట్రై చేయండి! -
డిన్నర్, బ్రేక్ ఫాస్ట్ ఏ టైంకి తింటున్నారు? ప్రాణగండం ఉంది జాగ్రత్త! -
సోదరి లేకపోతే ఎవరు రాఖీ కట్టవచ్చు.. రక్షాబంధన్ ఉద్దేశం, నియమాలు తెలుసుకోండి.! -
మై బ్రదర్, మై సూపర్ హీరో..మీ సోదరుడికి రాఖీ విషెస్ చెప్పండిలా -
టేస్టీ అండ్ క్రంచీ స్నాక్ ..కరకరలాడే శనగపిండి మసాలా పల్లీలు ఇలా చేసుకోండి -
తెల్ల ఇడ్లీ కాదు..అసలైన శక్తి ఉన్న నల్ల ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
నేపాల్ ను వణికించిన జలప్రళయం.. వరదల్లో చిక్కుకుంటే ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి? -
Budha nakshatra gochar 2026 : పూర్వఫల్గుణి నక్షత్రంలోకి బుధుడు..ఆగస్టు 29 నుంచి ఈ 4 రాశులకు అగ్నిపరీక్షే! -
ఇంట్లో ఇడ్లీ, దోశ పిండి లేదా? అయితే కప్పు బియ్యంతో మల్లెపూవు లాంటి మెత్తని నీర్ దోశ చేసుకోండిలా! -
చూస్తేనే నోట్లో నీళ్లూరుపోయే హెల్తీ రాగి బిస్కెట్లు..ఓవెన్ లేకుండానే ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం పొందాలంటే శుక్రవారం మామిడి పండ్లు నైవేద్యం పెట్టండి!
శుక్రవారం అంటే.. అమ్మవారికి ఎంతో ప్రీతికరం. అందులోనూ లక్ష్మీదేవికి ప్రతిరూపం శుక్రవారం. కాబట్టి ఇంట్లో అమ్మవారికి రకరకాల పూలతో అలంకరించి, నైవేద్యం సమర్పించి పూజలు చేయడం వల్ల ఆ తల్లి ఆశీస్సు పొందవచ్చు. అలాగే శుక్రవారం మహిళలు ఎరుపు లేదా ఆకుపచ్చ వంటి రంగుల దుస్తులు ధరించి, కాళ్లూ, చేతులు, ముఖానికి పసుపు రాసుకుని లక్ష్మీదేవిని పూజిస్తే.. ఆ తల్లి కరుణా కటాక్షాలు ఉంటాయి. అలాగే ఆ ఇంటి సిరిసంపదలు, ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి.
శ్రీమహాలక్ష్మి విష్ణుమూర్తి గుండెల్లో ఉంటుంది అయితే ఆవిడా ఈ కలియుగానికి మూల స్తంభం అయితే శ్రీమహాలక్ష్మి కరుణ పొందాలంటే చాలా రకాలా పద్ధతులు ఉన్నాయి. అందులో ఇప్పుడు మనం చెప్పుకోబోయాది ఆతి ముఖ్యమైనది మరియు చాలా శుభదాయాకం. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి మనం చాలా రకాల పూజలు, పువ్వులు, నియామాలు పాటించాము అయితే ఇప్పుడు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పని ఇప్పుడు మనం చెయ్యబోతున్నాం.

ప్రతి శుక్రవారం మనం లక్ష్మీదేవి ఫోటో లేదా ప్రతిమను శుభ్రం చేసి గంధం మరియు కుంకుమ బొట్టు పెట్టాలి అలాగే వివిధరకాల పరిమళం కలిగిన పువ్వులను సమర్పించాలి.
లక్ష్మీదేవికి నమస్కారం చెబుతూ ఆహ్వానించే స్తోత్రం మహాలక్ష్మి అష్టకం ఇది కనీసం ఒక్కసారైనా చదవాలి.

ఇప్పుడు పూజ లో ఆఖరి ఘట్టం నైవేద్యం సమర్పించడం, అయితే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన నైవేధ్యాలలో మామిడి పండ్లు చాలా ప్రీతికరం, అవునండి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి మామిడిపండ్లను కనుక నైవేద్యంగా పెడితే అష్టైశ్వర్యాలు మీ సొంతం అంతే కాకుండా ఆ కుటుంబంలో ఎప్పుడు డబ్బుకి లోటు ఉండదు అలాగే వ్యాపారస్తులు కూడా ఇలాగా చెయ్యడం ద్వారా వ్యాపారాల్లో ఉన్నత స్తితికి వెళ్తారు.

అమ్మవారికి రెండు మామిడి పండ్లు (బాగా పండినవి) పచ్చివి అస్సలు వాడరాదు.
నైవేద్యంగా పెట్టి, అది కుటుంబం మొత్తం తీసుకుంటే ఆ ఇంట్లో డబ్బుకి లోటు ఉండదు, అలాగే ఆర్ధికంగా ఎదగాలి లేదా వ్యాపారం అభివృద్ధి అవ్వాలంటే నైవేద్యం పెట్టిన మరో రెండు తియ్యని మామిడి పండ్లను ఒక ముత్తైదువకి బొట్టు పెట్టి ఇస్తే మీ ఇంట్లో ధనం వర్షంలా కురుస్తుంది.
అలాగే శ్రీమహాలక్ష్మికి తియ్యని మామిడి రసం లేదా మామిడి ముక్కలు నైవేద్యంగా పెట్టి అది ఉదయాన్నే టిఫిన్ తినే ముందు మొదటి ఆహారంగా ఇవి తీసుకున్న లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సుఖ సంతోషాలు సిద్దిస్తాయి.

అలాగే నైవేద్యం పెట్టిన మామిడిపండ్లు మొత్తం కుటుంబ సభ్యులకు ఇవ్వాలి ఇలాగా చేస్తే పిల్లల్లో చెడు గ్రహ దోషాలు మరియు కుటుంబంలో దారిద్ర్యం మొత్తం పోతాయి.
ఒకవేళ ఆర్ధిక భాదలు బాగా ఇబ్బంది పెడుతుంటే మాత్రం రోజు ఈ రకంగా చేస్తే చాలా త్వరగా అప్పుల బాధలు ఆర్ధిక సమస్యలు దూరం అవుతాయి.



Click it and Unblock the Notifications