Latest Updates
-
చికెన్, మటన్ బిర్యానీలను మరిపించే స్పైసీ టమాటా బిర్యానీ..కుక్కర్ లో ఈజీగా చేసేయండిలా.. -
తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది! -
రెస్టారెంట్ రుచిని మించేలా ఇంట్లోనే బిసిబేలే బాత్.. సులభంగా ఎలా చేయాలంటే? -
కరివేపాకు vs వేప ఆకు..పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల్లో ఏది బెస్ట్ అంటే..! -
నవరాత్రి స్పెషల్: రుచితో పాటు ఆరోగ్యం.. జీర్ణశక్తిని పెంచే అద్భుతమైన తమలపాకు కేసరి ప్రసాదం -
నోరూరించే ఆమ్లెట్ పులుసు.. పుల్లపుల్లగా, కారంకారంగా రుచి అదరహో! -
దీపావళికి ముందే ధ్వజ యోగం.. ఈ 4 రాశుల జాతకులు కోటీశ్వరులు కావడం ఖాయమా? -
నల్ల పాలు తాగుతున్న తెలుగు హీరోయిన్..ప్రయోజనాలేంటో,ఎలా చేసుకోవాలో తెలుసా? -
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ!
మీరు ఏ లోహ పాత్రలను పూజలు, వ్రతాలకై వాడుతున్నారు? మనుస్మృతి ప్రకారం అవి సరైనవా, కాదా?
మీరు ఏ లోహ పాత్రలను పూజలు, వ్రతాలకై వాడుతున్నారు? మనుస్మృతి ప్రకారం అవి సరైనవా, కాదా?
మనం దేవునికి ప్రార్థనలు సమర్పించేటప్పుడు, నిజమైన భక్తుడు భగవంతుని ప్రేమ పొందాలంటే, ఎటువంటి నియమాలను పాటించనవసరం లేదని మనం అనుకుంటాం. అవును, ఇది నిజమే, కానీ మీరు ఇంకొక నిజాన్ని గురించి కూడా తెలుసుకోవలసి ఉంది . కొన్ని లోహాలు ప్రతికూల శక్తులను ఆకర్షించి, అనుకూల పవనాలను వికర్షిస్తాయి. దీనివలన భక్తుని ఏకాగ్రత దెబ్బతింటుంది. ఇది ఎవరికి కూడా ఆమోదయోగ్యం కాదు.
మనుస్మృతి
హిందూ మతానికి సంబంధించిన సాహిత్యంలో మనుస్మృతి అతి పురాతనమైన వాటిలో ఒకటి. ఈ పుస్తకంలో, ప్రపంచంలోని మానవ విలువలు, బాధ్యతలు, నీతి మరియు ఎంపికలను గురించి విపులంగా తెలియజేయబడ్డాయి. ఈ పుస్తకంలో సంఘంలో నాలుగు వర్ణాలవారి విభజనను గురించి తెలియజేయబడింది.

ఇందులో యుద్ధాల సమయంలో రాజులు పాటించవలసిన ధర్మాలను గురించి తెలుపబడింది. స్త్రీల హక్కులు, మానవ ప్రవర్తనలు మరియు వ్యవహార సరళి గురించి కూడా ఉంది. దీనిలోని ఒక విభాగంలో, ప్రతిరోజూ పూజలో పాటించవలసిన విధివిధానాలు గురించి వివరింపబడింది.
మనుస్మృతి అనుసారం, పూజ చేయడంలో కొన్ని లోహాలను ఉపయోగించడాన్ని నిషేధించడమైనది. మనుస్మృతి లోని ఒక శ్లోకంలో పూజకు ఏ, ఏ లోహాలతో చేసిన సామాగ్రిని వాడరాదు తెలుపబడింది. అల్యూమినియం, ఇనుము లేదా కృత్రిమ లోహాలతో తయారు చేయబడిన పూజా సామాగ్రిని వినియోగించరాదు.
అల్యూమినియం
అల్యూమినియంను రుద్దినప్పుడు, నల్లని పొడి వంటి పదార్ధం ఏర్పడుతుంది. ఈ పొడి పూజలకు అపవిత్రమైనదిగా భావిస్తారు. కనుక, ఈ లోహాన్ని పూజల్లో వాడరాదు.
ఇనుము
ఇనుము అనే లోహం, గాలితో లేదా నీటితో చర్య జరిపినప్పుడు, తుప్పు పడుతుంది. ఇది ఇనుము నాణ్యత తగ్గిందని అర్ధం. ఇటువంటి వస్తువులను పూజల కొరకు వినియోగించడం అశుభం కనుక ఇనుప వస్తువులను పూజలకు వాడరాదు.
ఉక్కు
ఉక్కు అనుకూల శక్తిని అడ్డుకుంటుందని చాలామంది విశ్వసిస్తారు. వాతావరణంలోని సాత్విక తత్వాలు ఉక్కు అంత సులువుగా అందుకోదు. పైగా ప్రతికూల శక్తిని త్వరగా ఆకర్షిస్తుంది. కనుక ఈ లోహాన్ని పూజలకై వినియోగించరాదు.
మనుస్మృతి అనుసారం కృత్రిమంగా తయారు చేయబడిన లోహాలు లేదా సహజమైనవి కానీ మూలకాలను పూజలకు వినియోగించరాదు. ఇవి ప్రతికూల శక్తిని ఎక్కువగా ఆకర్షిస్తాయి. పూజ గదిలో లేదా వాతావరణంలో ఉండే అనుకూల లేదా సాత్విక తత్వాలను ఇవి ఆకర్షించలేవు. కనుక,రాగి లేదా ఇత్తడి వంటి సహజ లోహాలు వాడటం ఉత్తమం.
మట్టి, వెండి, రాగి లేదా బంగారు పాత్రలు పూజ చేయడానికి విశిష్టమైనవని ప్రతీతి. ఈ సామాగ్రి ప్రతికూల అంశాలను ఆకర్షిస్తాయి. బంగారం మరియు వెండి ఖరీదైన లోహాలైనందున రాగి, ఇత్తడి లేదా రాతి సామాగ్రిని వాడటం మంచి ప్రత్యామ్నాయం
పాత సామాగ్రి ఇంకా శుభకరమైనవి. గుర్తుపెట్టుకోవలసిన ఇంకొక విషయం ఏమిటంటే, ఎంత పాత వస్తువయితే, అంత శుభప్రదమైనవి. పూజలకు వినియోగించే ఏ వస్తువైనా, పూజ గదిలో ఉండే అనుకూల దైవిక శక్తిని గ్రహిస్తాయి. సమయం గడిచేకొద్దీ, దేవుని విగ్రహాలు మనం చేసే పూజలు, వ్రతాలు మూలంగా దైవిక శక్తిని పొంది ఉంటాయి. కనుక ఆ పరిసరాల్లో ఉంచే ఏ వస్తువైనా, దైవికంగా మారుతుంది. కనుక మనం పూజలకు పురాతన లోహ సామగ్రి వాడటం ఉత్తమం.
అంతేకాక, దీపపు కుందెల వంటి పూజాసామగ్రి ఉదాహరణకు, సరస్వతి దేవి ముందు వెలిగించిన దీపాన్ని, గణపతికి కూడా వాడినట్లైతే, దానిలో భగవంతుని సాత్విక శక్తి ఉంటుంది కానీ, ప్రత్యేకించి సరస్వతి లేదా వినాయకునికి సంబంధించిన ధాతువు ఉండకపోవచ్చు.
కనుక ఒక దేవుని పూజకు వినియోగించిన సామాగ్రిని వేరొక దేవుని పూజకై వినియోగించకపోవడమే మంచిది.



Click it and Unblock the Notifications
