Latest Updates
-
అన్నం,చపాతీ,బగారా రైస్ లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్..రెస్టారెంట్ స్టైల్ పుదీనా చికెన్ గ్రేవీ ఎలా చేసుకోవాలంటే.. -
ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ బటర్ మష్రూమ్ మసాలా.. ఇలా చేస్తే రుచి అదుర్స్! -
ఇన్స్టాగ్రామ్లో మీ పిల్లలు సేఫేనా? హనీట్రాప్ ముఠాల వలలో పడకుండా కాపాడుకోండిలా! -
సహజీవనం తర్వాత విడిపోతే అత్యాచారమా? సుప్రీంకోర్టు తీర్పుతో షాకింగ్ నిజాలు! -
భార్యను భర్తకు దూరంగా ఉండాలట! ఫ్యామిలీ కోర్టు వింత తీర్పుపై హైకోర్టు షాకింగ్ రియాక్షన్ -
పసుపు, తేనె కలిపి తీసుకుంటే శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే..ఆ సమస్యకు కూడా ఇదే పవర్ ఫుల్ మెడిసిన్! -
హైదరాబాద్లో వాతావరణం మారుతోంది! గర్భిణులు, పసిబిడ్డల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి -
సమ్మర్ కూల్ డెజర్ట్..మజా వచ్చే మామిడి పాయసం..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ప్రొటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండే పెసర రొట్టె..బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎందులో అయినా సూపర్! -
పంచదార లేకుండానే అమృతం లాంటి సొరకాయ పాయసం..గిన్నెలు గిన్నెలు లేపేయడం గ్యారెంటీ!
చనిపోయిన వాళ్ల ఫోటోలు పూజ గదిలో ఎందుకు పెట్టుకోకూడదు ?
హిందువులు పూజలు, వ్రతాలు, నోములు ఎక్కువగా చేస్తారు. దేవుడిని ప్రతి రోజూ పూజించడం హిందువుల ఆనవాయితీ. ఇష్టదైవం, ఇంటి దైవం అని.. ఇలా ప్రతి రోజూ ఆయా దేవుళ్లకు ప్రత్యేక పూజలు, వ్రతాలు నిర్వహిస్తారు. ప్రసాదాలు, నైవేద్యాలు సమర్పించి వరాలు కోరుకుంటారు. ఏ చిన్న సమస్య వచ్చినా.. దేవుడా అంటూ.. మొరపెట్టుకోవడం, ఆలయాలకు వెళ్లడం కూడా హిందువుల ఆచారం. నిత్యం దేవుడిని పూజిస్తే.. మానసిక ప్రశాంతత, ఆర్థిక పరిస్థితి, శ్రేయస్సు, సంతోషం కలుగుతాయని బలంగా నమ్ముతారు.
అలాగే దేవుళ్లతో పాటు.. కుటుంబ సభ్యులను కూడా గౌరవిస్తారు. ముఖ్యంగా తరతరాలుగా వస్తున్న ఆచారం ప్రకారం తాతలు, ముత్తాతలను కూడా గౌరవిస్తారు. చనిపోయిన వాళ్ల ఫోటోలను కూడా ఇంట్లో పెట్టుకుని పూజిస్తారు. వాళ్ల ఆత్మకు ప్రశాంతత కలగాలని.. నిత్యం పూజలు చేయడం, నైవేద్యాలు సమర్పించడం చేస్తారు. వాళ్ల గుర్తుగా ఇంట్లో కంపల్సరీ.. ఫోటోలు పెట్టుకుని పూజిస్తారు.

సాధారణంగా పండుగల సమయంలో, పెళ్లిళ్ల సమయంలో.. చనిపోయిన వాళ్ల ఆశీస్సులు తీసుకుంటారు. అలాగే సమాధుల వద్ద కొబ్బరికాయలు కూడా కొట్టే ఆచారం ఉంది. కానీ.. కొంతమంది దేవుడి గదిలో చనిపోయిన వాళ్ల ఫోటోలు పెట్టుకుని పూజిస్తూ ఉంటారు. కానీ ఇలా దేవుడి గదిలో చనిపోయిన వాళ్ల ఫోటోలు పెట్టుకోవడం ఏమాత్రం మంచిది కాదని వాస్తు శాస్త్రం చెబుతోంది. పూజ గదిలో చనిపోయిన వాళ్ల ఫోటోలు ఎందుకు పెట్టుకోకూడదు ? వాస్తు ప్రకారం చనిపోయిన పూర్వీకుల ఫోటోలు ఎక్కడ పెట్టుకోవాలి ? ఎక్కడ పెట్టుకుంటే మంచిది ?

ఫోటోలు
మరణం అనేది అనుకోకుండా వచ్చేది. మనం ఎంతగానో ఇష్టపడే వాళ్లు చనిపోయినప్పుడు వాళ్ల జ్ఞాపకాలను, ప్రేమను గుర్తుచేసుకుంటూ ఉంటాం. వాళ్ల గుర్తుగా వాళ్లకు సంబంధించిన ఫోటోలను ఇంట్లో పెట్టుకుంటాం.

పూజగదిలో
అనారోగ్యంతో చనిపోయిన వాళ్ల ఫోటోలను చాలామంది ఇళ్లంతా పెట్టుకుంటారు. మరికొందరు పూజ గదిలో పెట్టుకుంటారు. ఇలా వాళ్లపై ఉన్న ప్రేమ, గౌరవాన్ని చూపిస్తారు.

గోడలకు
కొంతమంది చనిపోయిన వాళ్ల ఫోటోలను ఇంట్లో గోడలకు వేలాడదీస్తే.. మరికొందరు పూజగదిలో పెట్టుకుని పూజిస్తారు.

ఆత్మశాంతి కోసం
నిత్యం చనిపోయిన వాళ్లను పూజిస్తే.. వాళ్ల ఆత్మకు శాంతి కలుగుతుందని భావిస్తారు. కానీ.. ఇలా దేవుడి పక్కనే వాళ్ల ఫోటోలను కూడా పెట్టి పూజిస్తున్నామని గుర్తించలేకపోతారు.

సమాధులు
చనిపోయిన రోజు, జయంతి రోజు వాళ్ల సమాధులు సందర్శించి కుటుంబ సభ్యులు నివాళులు అర్పిస్తారు.

పూజగదిలో
వాస్తు శాస్త్రం ప్రకారం పూజ గదిలో చనిపోయిన వాళ్ల ఫోటోలు పెట్టడం మంచిది కాదు.

దేవుడి ఆగ్రహం
పూజగదిలో చనిపోయిన వాళ్లు ఫోటోలు పెట్టడం వల్ల దేవుళ్లు ఆగ్రహిస్తారని తత్వవేత్తలు చెబుతున్నారు.

దురదృష్టం
దేవుడి గదిలో చనిపోయిన వాళ్లు ఫోటోలు పెట్టుకుని పూజలు నిర్వహించడం వల్ల దురదృష్టంతో పాటు, ప్రశాంతత కోల్పోవడం, శ్రేయస్సు, ధనం కోల్పోవడం కూడా జరిగే అవకాశాలున్నాయని వాస్తు శాస్త్రం హెచ్చరిస్తోంది.

వాస్తు ప్రకారం
వాస్తు శాస్త్రం ప్రకారం పూజగది ఈశాన్యం దిశగా ఉండాలి. చనిపోయిన పెద్దవాళ్ల ఫోటోలు వాయువ్య దిశగా ఉండాలి.

నెగటివ్ ఎనర్జీ
ఈ నియమాలు పాటించడంలో పొరపాట్లు జరిగితే.. ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ప్రసరిస్తుంది.

మానసిక ప్రశాంతత
ఫోటోలు, పూజ గది వాస్తు ప్రకారం లేకపోతే.. కుటుంబ సభ్యులు మానసిక ప్రశాంతత కోల్పోతారు.

మహా పాపం
వ్యాధులు, అనారోగ్య సమస్యలతో చనిపోయిన తల్లిదండ్రుల ఫోటోలు పూజగదిలో దేవుడి ఫోటోలతో పాటు పెట్టుకుని పూజించడం మహా పాపమని హిందూ మంతం కూడా చెబుతోంది.

సమాన గౌరవం ఇచ్చినట్టే
ఇలా దేవుళ్లతో పాటు, మనుషుల ఫోటోలు పెడితే.. మనుషులను, దేవుడితో సమానంగా పూజిస్తున్నట్లు అవుతుందని చెబుతారు.

దేవుడి ఫోటోల కింద మాత్రమే
ఇలాంటి పొరపాటు వల్ల జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కావాలంటే... దేవుడి ఫోటోల కింద మాత్రమే చనిపోయిన వాళ్ల ఫోటోలు పెట్టుకోవచ్చని హిందూమతం సూచిస్తోంది.



Click it and Unblock the Notifications