For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Magha Purnima 2023: మాఘ పౌర్ణమి రోజు ఇవి దానం చేస్తే శ్రేయస్సు, సంపద సిద్ధిస్తాయి, పాపాలు పోతాయి

మాఘ పౌర్ణమి రోజు దానాల వల్ల శుభం కలుగుతుంది. అయితే ఈ రోజు ఎలాంటి వస్తువులు దానం చేస్తే ఎలాంటి లాభాలు చేకూరుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

|

హిందూ పంచాంగం ప్రకారం ప్రతి నెలా పౌర్ణమి, అమావాస్యలు వస్తాయి. హిందూ పురాణాల ప్రకారం మాఘ మాసానికి, ఈ నెలలో వచ్చే పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంది. మాఘ పౌర్ణమికి దేశంలోని పుణ్యక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. ఈ పవిత్రమైన రోజున నదిలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని హిందువుల విశ్వాసం. అలాగే మాఘ పౌర్ణమి రోజు దానధర్మాలు చేయడం వల్ల విశేష ప్రయోజనాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

Donate these on Magha Purnima to get wealth and happiness in Telugu

మాఘ మాసం రోజుల్లో నదిలో స్నానాలు చేస్తే పుణ్యం వస్తుందని, పాపాలు తొలగిపోతాయని అంటారు. అలాగే ఈ నెలలో ఇష్టదేవతలను పూజిస్తే మంచి జరుగుతుందని హిందువుల విశ్వాసం. మాఘ పౌర్ణమి రోజు సూర్యుడిని, మహాలక్ష్మీని పూజిస్తే శ్రేయస్సు, సంపద సిద్ధిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. మాఘ పౌర్ణమి రోజు దానాల వల్ల శుభం కలుగుతుంది. అయితే ఈ రోజు ఎలాంటి వస్తువులు దానం చేస్తే ఎలాంటి లాభాలు చేకూరుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మాఘ పౌర్ణమి 2023 శుభ సమయం:

మాఘ పౌర్ణమి 2023 శుభ సమయం:

మాఘ పూర్ణిమ ప్రారంభం - ఫిబ్రవరి 4వ తేదీ శనివారం రాత్రి 9.29 గంటలు

మాఘ పూర్ణిమ ముగింపు - ఫిబ్రవరి 5వ తేదీ ఆదివారం రాత్రి 11.59 గంటలు

ఫిబ్రవరి 5వ తేదీన మాఘ పౌర్ణమిగా జరుపుకుంటాం. ఆదివారం రోజు ఉదయం 7.07 గంటల నుండి పగలు 12.13 వరకు సర్వార్థ సిద్ధి యోగం ఉంటుంది. ఇది చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతోంది.

ఆహారం:

ఆహారం:

అన్నదానానికి మించిన దానం మరొకటి లేదని శాస్త్రాలు చెబుతున్నాయి. పేదలకు, నిరాశ్రయులకు, ఆకలితో ఉన్నవారికి ఆహారం దానం చేయడం మహా పుణ్యం. మాఘ పౌర్ణమి నాడు అన్నార్థులకు ఆహారం దానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయి. దానం చేసిన వారికి మానసిక ప్రశాంతత లభిస్తుంది. సంతోషంగా కలుగుతుంది.

దుస్తులు:

దుస్తులు:

మాఘ పౌర్ణమి నాడు దుస్తులు దానం చేయడం చాలా మంచిది. పాత దుస్తులను ఉతికి ఎవరికైనా అవసరంలో ఉన్న వారికి దానం చేయవచ్చు. లేదంటే కొత్త దుస్తులు కొని కూడా దానం చేయవచ్చు. అయితే దానం చేసినప్పుడు ఆ దానం వారికి ప్రయోజనం చేకూరుస్తుందా లేదా అనేది గమనించుకోవాలి. చేసే దానం స్వీకరించే వారికి ఎలాంటి ప్రయోజనం చేకూర్చకపోతే దాని వల్ల ఉపయోగం లేదని శాస్త్రాలు చెబుతున్నాయి.

పుస్తకాలు:

పుస్తకాలు:

మాఘ పూర్ణమి రోజు పుస్తకాలు కూడా దానం చేయవచ్చు. ప్రజలు తమ పాత పుస్తకాలను పాఠశాలలకు, లైబ్రెరీలకు, అవసరమైన వ్యక్తులకు దానం చేయవచ్చు. ఇది జ్ఞానాన్ని విద్యను పెంపొందించడంలో సహాయపడుతుంది. అలాగే ఇంట్లో పడి ఉన్న పుస్తకాలను విరాళంగా ఇవ్వడం ద్వారా ఎదుటివారి అవసరం తీరుతుందని పండితులు చెబుతున్నారు.

డబ్బు:

డబ్బు:

విద్య, ఆరోగ్యం, ఆహారం, జీవన సాగించడానికి డబ్బు చాలా కీలకం. ఏ పనికైనా డబ్బు కావాల్సిందే. అలాంటి డబ్బును కూడా మాఘ పౌర్ణమి రోజు దానం చేయవచ్చు. తోచినంత, చేతనైనంత మేర పేదలకు, నిరాశ్రయులకు డబ్బు దానం చేయడం వల్ల శుభం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

English summary

Donate these on Magha Purnima to get wealth and happiness in Telugu

read this to know Donate these on Magha Purnima to get wealth and happiness in Telugu
Story first published:Saturday, February 4, 2023, 11:25 [IST]
Desktop Bottom Promotion