For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నవ గ్రహాల పూజా విధానంలో చేయదగిన చేయకూడని అంశాల గురించిన పూర్తి వివరాలు

|

నవ గ్రహాలు అనే తొమ్మిది దైవిక గ్రహాలు మానవ జీవితాలపై గొప్ప ప్రభావాలను కలిగి ఉంటాయని అందరికీ తెలిసిన విషయమే. నవ గ్రహాలు వరుసగా సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహువు మరియు కేతువుగా ఉన్నాయి.

సూర్యుడు వాస్తవానికి ఒక నక్షత్రం అయినప్పటికీ, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు మరియు శని గ్రహాలు సౌర వ్యవస్థలోని ప్రధాన గ్రహాలుగా ఉన్నాయి. చంద్రుడు ఉపగ్రహం కాగా, రాహువు మరియు కేతువులు చంద్రుడికి ఉత్తర మరియు దక్షిణ దిశలుగా ఉన్న ఛాయా గ్రహాలుగా ఉన్నాయి. ఇవి ఒక నిర్దిష్టమైన సమయంలో సూర్య చంద్రులను ఆక్రమించడం ద్వారా, గ్రహణాలు ఏర్పడడం జరుగుతుందని చెప్పబడింది.

Dos And Don’ts Of Worshipping Navagrahas

ఒక శిశువు యొక్క పుట్టిన సమయం ఇచ్చినప్పుడు, ఇచ్చిన సమయం ప్రకారం, నవ గ్రహాల యొక్క ఖచ్చితమైన స్థానాలను లెక్కించబడి జన్మ కుండలిలో పొందుపరచడం జరుగుతుంది. జీవితంలోని ప్రధాన సంఘటనలు అయిన ఆనందం, ఆరోగ్యం, అనారోగ్యం, దుఃఖం, ప్రమాదాలు, ఉద్యోగం, వైవాహిక జీవితం, ముహూర్తం, సంతాన యోగం, విద్య, కలహాలు, సంబంధాలు మరియు మరణం వంటి అంశాలని, పుట్టిన సమయాన్ని అనుసరించి, జ్యోతిష్య శాస్త్ర పండితులు అంచనా వేయగలరు అని నమ్ముతారు.

Dos And Don’ts Of Worshipping Navagrahas

జీవితంలో ఎదురయ్యే కొన్ని అవరోధాల సమయాలలో ఈ జన్మ కుండలిని పర్యవేక్షించవలసి ఉంటుంది. క్రమంగా జన్మ కుండలి జీవితంలో సరైన మార్గాన్ని ఎంచుకోవడంలో సహాయపడుతుందని చెప్పబడుతుంది. తీసుకునే ప్రతి ప్రధాన నిర్ణయాలలో కూడా జన్మ కుండలిని అనుసరించినప్పుడు ఉత్తమ ఫలితాలను చూసినవారు ఎందఱో ఉన్నారు. ముఖ్యంగా వివాహ సంబంధాలు, ఉద్యోగ ప్రయత్నాలు, లేదా ఎంపికలు, వివాహ ముహూర్తాలు, గృహ ప్రవేశాలు మొదలైనవి జన్మ కుండలి ద్వారా సూచించడం జరుగుతుంది.

Dos And Don’ts Of Worshipping Navagrahas

జన్మ కుండలి ఎల్లప్పుడూ అనుకూలమైన ఫలితాలనే ఇస్తుంది అనుకోవడం పొరపాటే. అవి రాబోవు కాలంలో ఎదురయ్యే, ప్రమాదాలను సూచిస్తూ ఉండవచ్చు కూడా. ఇటువంటివి తరచుగా, నవ గ్రహాలు ఎంచుకున్న ప్రమాద స్థానాల మూలంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. కొన్ని సమయాల్లో, ప్రత్యర్థి గ్రహాలు జన్మ కుండలిలో అననుకూల స్థానాలను ఆక్రమిస్తాయి. అటువంటి సమస్య తలెత్తుతున్నప్పుడు, నవగ్రహాలను స్వాంతన పరచడానికి నివారణా చర్యలను నిర్వహించటం ముఖ్యంగా చెప్పబడుతుంది. క్రమంగా గ్రహ దోష నివారణ, శాంతి హోమం వంటివి జ్యోతిష్యుల సూచనలపై నిర్వహించబడుతాయి.

Dos And Don’ts Of Worshipping Navagrahas

ఈ గ్రహాల అధిపతులైన దేవుళ్ళను జ్యోతిష్కులు సూచించిన సూచనల ప్రకారం పూజించడం ద్వారా మెరుగైన ఫలితాలను పొందగలరని నమ్మడమైనది. నివారణా ఆచారాలు లేదా 'పరిహరాలు' జరుపుతున్నప్పుడు కొన్ని చేయదగిన మరియు చేయకూడని అంశాలు కూడా ఉన్నాయి. నేడు, నవ గ్రహాలను ఆరాధించేటప్పుడు మీరు మనసులో ఉంచుకోవలసిన అంశాల గురించిన మరింత సమాచారాన్ని ఈ వ్యాసంలో పొందుపరచడం జరిగింది. మరిన్ని వివరాల కోసం వ్యాసంలో ముందుకు సాగండి.

Dos And Don’ts Of Worshipping Navagrahas

నవ గ్రహాల పూజా విధానంలో చేయదగిన మరియు చేయకూడని అంశాల గురించిన పూర్తి వివరాలు :

ఆరాధన లేదా పరిహారం అనేవి వాటి కొరకు నియమించబడిన రోజులలో మాత్రమే చేయవలసి ఉంటుంది. వీటిలో సమయం మరియు ముహూర్తం అత్యంత ముఖ్యమైన అంశాలుగా ఉంటాయి. వీటిని అనుసరించడం ద్వారా, మీ జీవితంలో గొప్ప మార్పులను, పురోగతిని చూడవచ్చునని చెప్పబడింది. కొన్ని సందర్భాలలో మీరు చేసే తప్పిదాల కారణంగా ఫలితాలు రాకపోగా, ప్రతికూల ప్రభావాలను చూడవలసి ఉంటుంది. కావున, ఈ పరిహారాలను అనుసరించేటప్పుడు, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరిగా ఉంటుంది.

Dos And Don’ts Of Worshipping Navagrahas

పరిహారాలను అనుసరిస్తున్నప్పుడు, అనేక మంది ప్రజలు ఉపవాసాలను చేయడం గమనించే ఉంటారు. ఇది తప్పనిసరి కానప్పటికీ, అలా చేయడం మాత్రం చాలా మంచిదిగా చెప్పబడుతుంది. అంతేకాకుండా మీరు చేసే కార్యక్రమాలకు ఉత్తమ ఫలితాలు అందేలా ప్రోత్సాహమిస్తుంది. మీరు పూజించే దేవత ఆధారితంగా కొన్ని నియమాలు మరియు ఆహార పరిమితులను అనుసరించడం మీకు తప్పక మేలుచేస్తుంది. ఉదాహరణకి వినాయకునికి సమర్పించే కుడుములు, ఉండ్రాళ్ళు వలె. పరిహారాలను అనుసరించే రోజున తీసుకునే ఆహారం తప్పనిసరిగా శాఖాహారం అయి ఉండాలని నిర్ధారించుకోండి. శాఖాహారాన్ని పాటించడం అనుసరించాల్సిన సాధారణ నియమాలలో ఒకటిగా ఉంటుంది. పొరపాటున కూడా మద్యపానం, ధూమపానం, మాంసం వంటివి ముట్టరాదని గుర్తుంచుకోండి.

Dos And Don’ts Of Worshipping Navagrahas

శరీరంతో పాటుగా, మీ మనస్సు కూడా నిష్కల్మషంగా, శుభ్రంగా ఉండాలని గుర్తుంచుకోండి. కల్మషంతో కూడిన ఆలోచనలు ఒక విజయవంతమైన పరిహారాన్ని ఏమాత్రం ఇవ్వలేవని గుర్తుంచుకోండి. నవ గ్రహాలను పూజించేటప్పుడు లైంగిక పరమైన, కక్షా పూరిత ధోరణితో కూడిన ఆలోచనలు మనసులో ప్రవేశించకుండా జాగ్రత్త వహించాలి. సూర్యుడు ఉదయించిన తర్వాత, లైంగిక పరమైన లేదా ద్వేష పూరిత ఆలోచనలు కలుగడం, లేదా కార్యములు జరిగిన ఎడల, ఆ రోజున నవ గ్రహాల ఆరాధనను నివారించడం ఉత్తమం.

Dos And Don’ts Of Worshipping Navagrahas

నవ గ్రహాలను పూజించేటప్పుడు సమర్పణలు అనేవి ఎల్లప్పుడూ స్వాగతంగానే ఉంటాయి. పండ్లు, పువ్వులు, వస్త్రం, దీపం, ధూపం, ధాన్యాలు, మొదలైనవి ఇందులో భాగంగా ఉంటాయి. దీపం కోసం నెయ్యి లేదా నువ్వుల నూనెను వినియోగించవచ్చు. వీటిలో ఏది ఎంచుకోవాలి అనడానికి నిర్దిష్టమైన సూచనలేవీ లేవు. కావున పండితుల సూచనల ప్రకారం ఎంచుకోవడం మంచిది. సమర్పణల వెనుక ఉన్న మంచి ఉద్దేశం కారణంగా, కొన్ని రకాల వస్తువుల ఎంపికలో నిర్దిష్ట ప్రామాణికాలు ఉండవు అన్నది పండితుల మాట.

నవ గ్రహాలకు ఆహారాన్ని మరియు ఇతర వస్తువులను నైవేద్యంగా ఉంచిన తర్వాత, ఆ ప్రసాదాన్ని మీ స్నేహితులకు, ప్రియమైన వారికి మరియు కుటుంబాల మధ్యన పంపిణీ చేయవలసి ఉంటుంది. మీ జాతక చక్రంలోని దోషాలను నివారించడానికి పూజలను నిర్వహించినప్పుడు ఈ చర్య ప్రముఖంగా చెప్పబడుతుంది. ప్రసాదం పంపిణీ చేయడం ద్వారా, ఇతరులలో కూడా భక్తి భావన పెంచడం, సంబంధ బాంధవ్యాలు బలపడడం జరుగుతుంది. మరియు ఆ ప్రసాదం ద్వారా, వారికి కూడా పరిహార ఫలాన్ని ఇచ్చిన వారవుతారు. ఇటువంటివన్నీ కుటుంబ పరంగానే కాకుండా, సామాజికంగా కూడా సానుకూల ఫలితాలను ఇస్తాయని చెప్పబడింది.

పూజ లేదా పరిహారం జరుపుకునే సమయంలో మీరు తరచుగా నవ గ్రహాలను చూస్తూ చేయవలసి ఉంటుంది. దేవతను చూడకుండా చేసే ఏ పరిహారాలు కూడా ప్రతికూల ప్రభావాలనే కలిగిస్తాయని చెప్పబడింది. పూజ జరుగుతున్న సమయంలో దేవతల ముందు శిరస్సును వంచి ఉండటం అనాదిగా వస్తున్నా సంప్రదాయ పద్ధతిగా ఉంటుంది. నిజానికి, ఇది కేవలం గౌరవ సూచకంగా ఉంటుంది. కానీ మీలో సానుకూల ప్రభావాలను సృష్టించే పూజను లేదా పరిహార పద్దతులను అనుసరిస్తున్నప్పుడు, ఆ దేవతలను తరచూ చూస్తుండాలని చెప్పబడింది.

నవగ్రహాలను ఇతర దేవుళ్ళతో సమానంగా చూస్తే తప్పా ?

నవ గ్రహాలకు ఇతర దేవుళ్ళతో సమానంగా ప్రాధాన్యతను ఇచ్చి పూజించడం కూడా సరైనది కాదని సూచించడమైనది. నవ గ్రహాలను, ముఖ్యంగా శివునికి సమానంగా పరిగణించటం ఒక పాపం. ఇలా చేసిన ఎడల మీకు శాపం కలుగుతుందని చెప్పబడుతుంది.

దేవాలయంలో ఉన్నప్పుడు, మీరు ఇతర దేవతలను ఆరాధించిన తరువాత మాత్రమే నవ గ్రహాలకు మీ గౌరవాన్ని చెల్లించవలసి ఉంటుంది. పూజలు చేసేటప్పుడు, మొదటగా ఇతర దేవతలకు ప్రార్ధన చేసిన తర్వాతనే, నవ గ్రహాలకు పరిహరాన్ని చేయవలసి ఉంటుంది.

శనివారం నాడు నవ గ్రహాలు చుట్టూ తొమ్మిది సార్లు ప్రదక్షిణం చేయడం మంచిదిగా సూచించబడుతుంది. కానీ, వారంలోని ఇతర రోజులలో అలా చేయటం తప్పుగా పరిగణించబడుతుంది. శనివారం మినహా, మిగిలిన రోజుల్లో అనవసరంగా నవ గ్రహాల చుట్టూ తిరుగుతున్న ప్రజలపైన శని గ్రహం యొక్క ప్రతికూల ప్రభావాలు అధికంగా ఉంటాయని చెప్పబడింది.

శనివారం మినహా మిగిలిన రోజులలో నవ గ్రహాలను పూజించేటప్పుడు, 9 మార్లు కాకుండా ఒకసారి మాత్రమే వాటి చుట్టూ తిరగడం ఉత్తమంగా చెప్పడమైనది.

నవ గ్రహాలను ప్రదక్షించునప్పుడు పఠిoచవలసిన మంత్రం :

“ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ”

ఈమంత్రాన్ని పఠిస్తూ ప్రదక్షిణం చేసిన ఎడల, ఇతర అవాంచనీయ ఆలోచనలకు దూరంగా, కేవలం దేవుని మీదనే దృష్టి సారించేందుకు వీలవుతుందని చెప్పబడింది.

ఏది ఏమైనా అపసవ్య దిశలో రాహువు మరియు కేతు గ్రహాల చుట్టూ తిరగకూడదని గుర్తుంచుకోండి. ఇలా చేయడం ద్వారా రాహు కేతువుల దృష్టిని మీ మీద పడే అవకాశాలు ఉన్నాయని పండితులు సూచిస్తుంటారు.

మరికొన్ని సూచనలు :

• శని దేవుని ఆరాధించేటప్పుడు మీరు శనికి ఎదురుగా నిలబడకూడదు.

• నవ గ్రహాల చుట్టూ తిరిగేటప్పుడు మీ చేతులను మడవకూడదని (చేతులు కట్టుకోవడం కూడదు) చెప్పబడింది.

• నవ గ్రహాల చుట్టూ తిరుగునప్పుడు దేవతలపై మనసును అంకితం చేసి ఉండాలి కానీ, ఇతరులతో లేదా మీలో మీరు మాట్లాడడం వంటివి చేయరాదు. ఇటువంటి చర్యలు ప్రతికూల ప్రభావాలను తీసుకొస్తాయని చెప్పబడింది.

• నవ గ్రహాలు ముందు ఎన్నటికీ సాష్టాంగ నమస్కారాలు చేయరాదని గుర్తుంచుకోండి.

• ఒక దీపం వెలిగించి ఉంటే, మరొక వ్యక్తి యొక్క దీపాన్ని మీ దీపం వెలిగించడానికి వినియోగించరాదు. దేవాలయంలోని దీపం నుండి అగ్నిని ఉపయోగించుకోండి లేదా అగ్గిపెట్టెలు వంటి వేరే ప్రత్యామ్నాయాలను అనుసరించండి.

ఈవిదంగా నవ గ్రహాలను పూజించునప్పుడు లేదా పరిహారాలను నిర్వహించునప్పుడు, పైన చెప్పిన జాగ్రత్తలను అనుసరిస్తూ జాగ్రత్తలు వహించవలసినదిగా సూచించడమైనది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, ఆరోగ్య, జీవనశైలి, ఆహార, వ్యాయామ, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి

English summary

నవ గ్రహాల పూజా విధానంలో చేయదగిన చేయకూడని అంశాల గురించిన పూర్తి వివరాలు :

Dos And Don’ts Of Worshipping Navagrahas
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more