For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Navratri 2020 : దుర్గాదేవిని 9 రకాల పూలతో పూజిస్తే శుభం కలుగుతుందట...!

నవరాత్రుల వేళలో దుర్గాదేవికి తొమ్మిది రకాల పూలను ఎందుకు సమర్పిస్తారో తెలుసుకుందాం...

|

మన దేశంలో ఏ పండుగ వచ్చినా.. ఏ శుభకార్యం జరుపుకోవాలన్న పువ్వులు అనేవి ముఖ్య పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా హిందు దేవుళ్లను ఆరాధించే ప్రతి ఒక్కరూ పువ్వులను కచ్చితంగా వినియోగిస్తారు.

Durga Puja Special : flowers offered to goddess durga

పూజల సమయంలో దేవుళ్లకు పువ్వులను సమర్పించడం.. ఏదైనా పూజతో సంబంధం ఉన్న అతి ముఖ్యమైన ఆచారాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.

Durga Puja Special : flowers offered to goddess durga

మీకు అందుబాటులో ఉన్న పువ్వులతో మీరు ఏదైనా పూజలు చేస్తే.. ప్రత్యేకమైన దేవతలకు అంకితం చేయడంలో కొన్ని పువ్వులు ఉత్తమమైనవి. ఈ సందర్బంగా హిందువుల పండుగలలో అతిపెద్ద పండుగ అయిన నవరాత్రి ఉత్సవాలు, దుర్గాపూజ కొద్దిరోజుల్లో (అక్టోబర్ 17-25 వరకు) రాబోతోంది. ఈ సందర్భంగా మీరు దుర్గామాతకు ఏ పూలు సమర్పించాలి... అమ్మవారికి ఏయే పూలు ఇస్తే శుభం కలుగుతుందో అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Navratri 2020 : దుర్గా దేవి ఆయుధాలలో ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత... అవేంటో తెలుసా...Navratri 2020 : దుర్గా దేవి ఆయుధాలలో ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత... అవేంటో తెలుసా...

తొలిరోజు-మందారం..

తొలిరోజు-మందారం..

నవరాత్రి వేళల్లో తొలిరోజు అమ్మవారికి మందారం పూలతో పూజించాలి. ఉత్తర భారతంలో తొలిరోజు అమ్మవారిని శైలపుత్రిగా అలంకరించి పూజలు చేస్తారు. ఈ రూపంలో ఆమె హిమాలయ కుమార్తెగా దర్శనమిస్తారు. మీరు మందార పువ్వులతో పాటు దేవతకు నెయ్యిని కూడా అర్పించవచ్చు.ఈ రెండు వస్తువులంటే శైలపుత్రి దేవికి చాలా ఇష్టం.

రెండో రోజు-చామంతి..

రెండో రోజు-చామంతి..

నవరాత్రుల సమయంలో రెండోరోజు అమ్మవారిని బ్రహ్మాచారిణిగా అలంకరిస్తారు. పార్వతీదేవి ఈ రూపంలో కొన్నేళ్ల పాటు కఠినమైన తపస్సు చేసింది. ఆమె కాఠిన్యం మరియు తపస్సుతో సంతోషించిన శివుడు ఆమెను తన భార్యగా అంగీకరించాడు. ఈ సందర్భంగా అమ్మవారికి చామంతి పూలతో పూజలు చేయాలి. ఇలా చేసిన భక్తులందరినీ ప్రశాంతమైన మరియు స్వచ్ఛమైన జీవితం గడిపేలా అమ్మవారు ఆశీర్వదిస్తారని నమ్ముతారు.

మూడో రోజు - కమలం

మూడో రోజు - కమలం

నవరాత్రుల వేళ మూడో రోజు దుర్గాదేవిని చంద్రఘంట అలంకారంలో పూజిస్తారు. ఈ దేవతకు తీపి వస్తువులు, పాలు, మరియు తామరపువ్వులు అంటే ఇష్టం. వీటిని అమ్మవారిని పూజిస్తే మీకు సంతోషకరమైన మరియు సుదర్ఘీ జీవితాన్ని అమ్మవారు ప్రసాదిస్తారు.

నాలుగోరోజు - మల్లెపూలు..

నాలుగోరోజు - మల్లెపూలు..

నవరాత్రుల సమయంలో నాలుగోరోజు అమ్మవారిని కుష్మాండ అవతారంలో అలంకరిస్తారు. ఈ అమ్మవారికి మల్లెపూలు (జాస్మిన్) పూలంటే ఇష్టం. ఈ దేవతకు వీటిని సమర్పించడం వల్ల ఆమె ఆశీర్వాదంతో పాటు మీకు తెలివి, బలం మరియు శక్తి లభిస్తుంది.

Navratri 2020 : దేవీ నవరాత్రుల తేదీలు.. శుభ ముహుర్తం.. పూజా ప్రాముఖ్యత్య గురించి తెలుసుకుందామా...!Navratri 2020 : దేవీ నవరాత్రుల తేదీలు.. శుభ ముహుర్తం.. పూజా ప్రాముఖ్యత్య గురించి తెలుసుకుందామా...!

ఐదోరోజు-ఎల్లో రోజ్..

ఐదోరోజు-ఎల్లో రోజ్..

నవరాత్రుల వేళ అమ్మవారిని స్కందమాతగా అలంకరిస్తారు. ఈ సమయంలో అమ్మవారికి పసుపు గులాబీ(ఎల్లో రోజ్) పూలను సమర్పించడం వల్ల మీ జీవితంలో శాంతి లభిస్తుంది. మీరు ఈ అమ్మవారిని పూజించే సమయంలో పువ్వులతో పాటు అరటిపండ్లను సమర్పించవచ్చు. ఆరోగ్యం మరియు సంత్రుప్తికరమైన జీవితంలో ఆమె ఆశీర్వాదాలను పొందడంలో మీకు సహాయపడుతుంది.

ఆరో రోజు-బంతిపూలు..

ఆరో రోజు-బంతిపూలు..

దుర్గాదేవిని నవరాత్రుల్లో ఆరో రోజు కాత్యాయాని మాతగా అలంకరించి ఆరాధిస్తారు. ఈ అమ్మవారికి బంతిపూలంటే ఇష్టం. ఒకవేళ మీకు ఈ పూలు దొరక్కపోతే మీరు పసుపు మల్లెలను.. తేనే వంటి వస్తువులతో అమ్మవారిని పూజించవచ్చు.

ఏడో రోజు - క్రిష్ణ కమల్..

ఏడో రోజు - క్రిష్ణ కమల్..

నవరాత్రి వేడుకల్లో అమ్మవారిని కలరాత్రి దుర్గాదేవిగా అలంకరించి పూజిస్తారు. ఈ సమయంలో అమ్మవారికి క్రిష్ణ కమల్ పువ్వులతో పూజించాలి. ఇలా అమ్మవారిని ఆరాధించడం వల్ల మీకు జీవితంలో నిర్భయంగా మరియు ఒత్తిడి లేకుండా ఉంటుంది.

ఎనిమిదో రోజు - అరేబియా జాస్మిన్..

ఎనిమిదో రోజు - అరేబియా జాస్మిన్..

నవరాత్రి వేళ ఎనిమిదో రోజు అమ్మవారిని మహా గౌరీ రూపంలో పూజిస్తారు. శివుడు తన తపస్సుతో సంతోషించి ఆమె ముందు కనిపించిన తర్వాత దుర్గాదేవి ఈ రూపాన్ని తీసుకుంది. ఈ దేవత ఆహారం తీసుకోకుండా కొన్నేళ్ల పాటు కఠినమైన తపస్సు చేసినందున ఆమె శరీరం నల్లగా మారింది. ఆ సమయంలో శివుడు ఆమెపై గంగజలాన్ని పోశాడు. అప్పుడే ఆమె తెల్లరంగులోకి మారిపోయింది. ఈ సందర్భంగా అమ్మవారికి అరేబియా జాస్మిన్ గా పిలవబడే మొగ్గ పువ్వులను అర్పించి.. మహాగౌరిని పూజించాలి.

తొమ్మిదో రోజు-చంపా పూలు..

తొమ్మిదో రోజు-చంపా పూలు..

దుర్గా దేవి యొక్క చివరి అవతారం సిద్ధిధాత్రి. ఈ దేవతను చంపా పూలతో పూజిస్తే.. మీకు దైవిక జ్ణానం, శక్తి, బలం మరియు వివేకం వంటి వాటితో ఆశీర్వదిస్తుంది. ఈ దేవతకు చంపా పూలంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ పూలను అమ్మవారికి అర్పిస్తే మీకు ఫలప్రదంగా ఉంటుంది.

ఈ రకమైన పూలు మీకు దొరకకపోతే.. మీరు దేవుళ్లను ఆరాధించలేరని కాదు.. ఈ పువ్వులంటే దేవతలు ఇష్టపడటం వల్ల మీకు అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుతుంది.

English summary

Durga Puja Special : flowers offered to goddess durga

Flowers have great importance when it comes to worshipping Hindu Gods. This Navratri, offer specific flowers to the different forms of Goddess Durga. Scroll down the article to read which flowers can be offered to the different forms of the Goddess.
Desktop Bottom Promotion