For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హిందూ పురాణాల ప్రకారం వివాహాల్లో రకాలు - అష్టవిధ వివాహాలు...

మన భారతీయ వివాహ వ్యవస్థలో రకాలు - అష్టవిధ వివాహాలు...

By Staff
|

ప్రాచీన భారతీయ వివాహ వ్యవస్థను పరిశీలిస్తే అష్టవిధ వివాహాలు కనిపిస్తాయి. ఆనాటి సామాజిక పరిస్థితులను బట్టి అష్టవిధ వివాహాలు ఆచరణలో ఉన్నప్పటికీ, వాటిలో చతుర్విధ వివాహాలు మాత్రమే ప్రసిద్ధి చెందాయి.

వాటిలో ఒకటి బ్రాహ్మీ వివాహం కాగా మిగతా మూడు స్థానాలను 'గాంధర్వ వివాహం' ... 'క్షత్రియ వివాహం' ... 'రాక్షస వివాహం' ఆక్రమించాయి.

అయితే వీటిలో కూడా ఆనాటి సమాజంలోని వారు 'బ్రాహ్మీ వివాహానికే ఎక్కువగా మొగ్గుచూపారు. ఈ వివాహల వల్ల వధువరులు సుఖ సంతోషాలు పొందుతారని తెలియజేశారు. అవి

1. బ్రాహ్మ్మము

1. బ్రాహ్మ్మము

విద్యాచారాలు గల వరునికి కన్యనిచ్చి చేసే వివాహం. మంచి గుణవంతుడు అయిన వరునకు వస్థ్రాభరనములు ధరింప చేసి పూజించి కన్యాదానం చేయుట వరదక్షినం అనవచ్చు.దక్షిణం ఇవ్వడం శాస్త్ర సాంప్రదాయం. తులసి దళం కుడా దక్షిణగా ఇవ్వొచ్చు.

2. దైవ వివాహం -

2. దైవ వివాహం -

తన యజ్ఞయాగాదులను ప్రారంభం నుంచి పురోహితకర్తగా ఉన్న వానిని పూజించి కన్యాదానం చేయుట అంటే అతనిని దైవంగా భావించి ప్రీతి నోన్దించుట. అంటే యజ్ఝయాగాదులు జరిపించిన పురోహితునికి ఇవ్వవలసిన రుసుముకునకు బదులుగా కన్యాదానం చేయడం.

3. ఆర్షం -

3. ఆర్షం -

ధర్మార్ధంగా , గోమిదునంను గ్రహించి దానికి బదులుగా కన్యాదానం చేయుట అంటే ఇదొక విధమైన కన్యాశుల్కం. అనబడు ఒలి అంటే బదులకు బదులు. కన్యాశుల్కంగా వరుడి నుంచి ఒక జత ఆవు-ఎద్దులను లేదా ధనమును తీసుకుని పెళ్ళి చేయడం.

4. ప్రాజాపత్యం -

4. ప్రాజాపత్యం -

నేను ఇంకొక ఆశ్రముముని స్వీకరించక గృహస్తామునే ఉండి గృహస్థ ధర్మములు నిర్వహిస్తాను అని వరునిచే ప్రమాణం చేయించి కన్యాదానం చేయుట . ఇది కాశి యాత్ర పేరున వివాహంలో కలదు.ఎట్టి పరిస్థితులలో నేను నా భార్యను వదలను అని ప్రమాణం చేయుట. కట్నం ఇచ్చి పెళ్ళి చేయడం. అలాగే కేవలం సంతానం కోసం చేసుకునే వివాహం. ఈ ప్రక్రియలో కట్నం, కన్యాశుల్కం అనే ప్రశక్తి ఉండదు.

5. రాక్షసం

5. రాక్షసం

కన్య మొరపెట్టుకోనినను వినక , ఆమె బందువుల ఇష్టాలతో ప్రమేయం లేకుండా వారిని ఎదిరించి, బెదిరించి బలవంతంగా ఎత్తుకోనిపోయి వివాహం ఆడుట. అయితే ఇది ఆరోజులలో బలాబలాల ప్రదర్శన పైన మేటి వీరునిగా అందరిని గెలిచి కన్యని తీసుకుని పోయి వివాహం ఆడుట .ఇది చొర పద్ధతి. ఇలాంటి వివాహాలు చాలా పురాణాలలో కానవస్తాయి.

6. అసురం -

6. అసురం -

ఇదోరకం కన్యాశుల్కం. వరుడు పిల్లకు, కన్యదాతకు కొంత ముట్టజెప్పి వివాహం ఆడుట. దీనిని ఓలి మనువు అంటారు.

7. గాంధర్వం -

7. గాంధర్వం -

ప్రేమించి పెళ్లి చేసుకొవడం . వధూవరులు ఇష్టపడి చేసుకునే వివాహం. పెద్దల అనుమతితో ప్రమేయము లేక ఇరువురు ఇష్టంతో పాణిగ్రహణము చేసుకొనడం.

8. పైశాచికం -

8. పైశాచికం -

దీనిని "పిశాచ పీడ" అని అంటారు. నిద్రలోగాని , మైకములో గాని , తన శీల విషయంలో పరాకుగా ఉన్న కన్యను ఆకస్మికంగా మెరుపుదాడి చేసి సంబోగించి చేసుకోను వివాహమును, ఏదో మిషతో శీలం చేరిచి తిరిగి ఆమెనే వివాహం ఆడుట పైశాచిక వివాహం అనబడును.

ఈ విధములైన అష్టవిధ వివాహాలు యాజ్ఝావల్కస్మ్రుతిలో కానవస్తాయి. ఇవే కాక హిందూ సాంప్రదాయంలో స్వయం వరం అనే మరొక సాంప్రదాయ వివాహం చూడవచ్చు. శివధనుస్సును విరిచి శ్రీరాముడు సీతను పెళ్ళాడినది. మత్యమంత్రమును ఎక్కుపెట్టీ ద్రౌపదిని అర్జునుడు చేపట్టినది ఈ పద్దతినే..

English summary

Eight Types of Hindu Marriages According to Manusmriti

The expression ‘forms of marriage” normally refers to the four major forms of marriage such as — Monogamy, Polygamy, Polyandry and Group Marriage — as mentioned by anthropologist Malinowski. But in the context of the Hindu Marriage System the expression “forms of marriage” denotes “the method of consecrating a marriage union.”
Desktop Bottom Promotion