శ్రీకృష్ణుడుకు అత్యంత ఇష్టమైనవి

By: DEEPTHI
Subscribe to Boldsky

హిందువులకి, శ్రీకృష్ణుడు అంతుపట్టని అంశంగానే ఉండిపోయాడు. మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడు ప్రపంచాన్ని రాక్షసుల నుంచి ప్రతిసారీ రక్షించటానికి అవతరిస్తాడు.

అతను అల్లరి 'బాల గోపాలుడు’ మరియు బృందావనంలో 'గోపికల’ ప్రేమికుడు ; కురుక్షేత్ర యుద్ధానికి ఆయనే కారణం మరియు పరిష్కారం కూడా ; జరాసంధుడి వల్ల జరిగిన దాడి నుంచి యాదవులను రక్షించటంలో రాజకీయ పాత్ర పోషించినది కూడా శ్రీకృష్ణుడే.

జన్మాష్టమి పండగ సందర్భంలో, శ్రీకృష్ణుడిని మీ ఇంటి చంటిబిడ్డగా భావిస్తారు. జన్మాష్టమి అతని పుట్టినరోజు అందుకని మీకు అతని అన్ని ఇష్టమైన విషయాలు తెలిసి ఉండాలి.

యువరాణిని కిడ్నాప్ చేసిన చిలిపి కృష్ణుడి.. ఆసక్తికర లవ్ స్టోరీ..!

శ్రీకృష్ణుడి గురించి అన్ని విషయాలు తెలుసుకోవడం వలన ఈ పండగ కళ మరింత పెరుగుతుంది. మీ స్నేహితుడు, మార్గదర్శి, తత్వవేత్త అయిన కృష్ణుడు భారత సంస్కృతిని, మీ జీవితాన్ని అనేకరకాలుగా ప్రభావితం చేసాడు.

మీకు తెలియాల్సిందల్లా శ్రీకృష్ణుడికి ఏవి ఇష్టమని. అతను మనకెంతో ప్రియమైనవాడు కాబట్టి మనకి అతనికి ఇష్టమైనవన్నీ పెట్టాలనిపిస్తుంది. కృష్ణుడికి చిన్నతనంలో పాలు, వెన్న అంటే ప్రాణం.

గోపికల ఉట్టిలను కొట్టడం ఎంతో ప్రసిద్ధి చెందిన కథలు. అందుకే, ఆయనకి జన్మాష్టమి నాడు వెన్న మిశ్రిని నైవేద్యంగా పెడతారు. శ్రీకృష్ణుడి గురించి తెలియాల్సిన విషయాలన్నీ చదవండి.-

కృష్ణాష్టమి స్పెషల్: శ్రీకృష్ణుడు నుంచి నేర్చుకోవలసిన జీవిత పాఠాలు!

1. వెన్న మిశ్రి

1. వెన్న మిశ్రి

శ్రీకృష్ణుడికి ఇష్టమైన పదార్థాలు వెన్న, మిఠాయిలు, వాటితో ఉన్న అనేక కథలు. చిన్నికృష్ణుడికి పెట్టడానికి ఇవెంతో ముఖ్యపదార్థాలు.

2. ఇష్టమైన పువ్వు

2. ఇష్టమైన పువ్వు

శ్రీకృష్ణుడి అవతారంలో మహావిష్ణువుకి, అన్ని విలాసాలు ఇష్టం. సువాసనలు వెదజల్లే మల్లె, మోగ్రా, పారిజాతం పువ్వులు అతనికి ఇష్టం. చిన్నికృష్ణుడికి ఉయ్యాల అలంకరిస్తున్నప్పుడు వీటిని మర్చిపోకండి.

3. ఇష్టమైన ఆకు

3. ఇష్టమైన ఆకు

శ్రీకృష్ణుడు ఎప్పుడూ తులసి ఆకులతో బంధాన్ని కలిగిఉంటాడు. దీనికో ఆసక్తికర కథ కూడా ఉంది. తులసి నిజానికి మహారాణి అయిన వృంద, మహావిష్ణువు భక్తురాలు. కానీ ఆమె భర్త శంఖాసురుడిని చంపటానికి మహావిష్ణువు ఆమెను మోసం చేసాడు. తనతోనే ఎల్లప్పుడూ ఉంటాననే వరం, విష్ణుమూర్తి ఇచ్చాక ఆమె తన జీవితాన్ని ముగించింది.

4. ఇష్టమైన రంగు

4. ఇష్టమైన రంగు

శ్రీకృష్ణుడికి ఇష్టమైన విషయాల గురించి మాట్లాడుకునేప్పుడు మీరు ఇష్టమైన రంగు గూర్చి తెలుసుకోవాలనుకుంటారు.విగ్రహాలను రకరకాల రంగుల్లో అలంకరించినా ఎక్కువగా వాడేది పసుపు మాత్రమే. బాలగోపాలుడ్ని మీ ఇంటికి ఆహ్వానించటానికి ఈ ఏడాది పసుపు ధోవతులు, ఎర్ర తలపాగాలను కొనండి.

5. పాలు మరియు తేనె

5. పాలు మరియు తేనె

ఇది కేవలం నైవేద్యమే కాదు, చాలా ఇళ్ళలో చిన్ని కృష్ణుడి విగ్రహాలను పాలు,తేనెలలో స్నానం చేయిస్తారు. జన్మాష్టమి నాడు పంచామృతంగా కూడా పాలు మరియు తేనెలను వాడతారు.

6. నల్లనివాడు కూడా కదా మరి!

6. నల్లనివాడు కూడా కదా మరి!

అతనికి పసుపంటే ఇష్టమని ముందే తెలుసుకున్నారు. నీలిరంగును ఎలా మర్చిపోతారు?కృష్ణుడికి ఉన్న అనేక పేర్లలో ‘నీలాంబరుడు' అంటే నీలి వస్త్రాలు ఇష్టమైనవాడని అర్థం. విగ్రహాలు, చిత్రాలలో కృష్ణుడు నీలివస్త్రం ధరించడం చూసే ఉంటారు.

7. తలలో నెమలిపింఛం

7. తలలో నెమలిపింఛం

శ్రీకృష్ణుడి గురించి తెలుసుకోవాల్సిన విషయాలలో ముఖ్యమైనది ఇది. దీని నుంచి అతన్ని ఎవరూ విడదీయలేరు. ప్రతి చిత్రం, విగ్రహంలో చేతికి, తలలో కృష్ణుడి నెమలి పింఛాన్ని చూసేవుంటారు.

English summary

Favourite Things Of Lord Krishna | All You Should Know About Lord Krishna | Favourite Things That Krishna Loves | Things That Krishna Loves The Most

Read to know the favourite things of lord Krishna.These are the things that Krishna loves the most.
Story first published: Thursday, August 10, 2017, 18:00 [IST]
Subscribe Newsletter