For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రథసప్తమితో పాటు ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు, వ్రతాలివే...

ఫిబ్రవరి నెలలో ముఖ్యమైన పండుగలు, వ్రతాల గురించి తెలుసుకుందాం.

|

మన దేశంలో ప్రతి ఏటా ప్రతి నెలా ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎందుకంటే మన భారతదేశం సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లకు పుట్టినిల్లు. అప్పుడే జనవరి నెలలో మనం సంక్రాంతి సంబరాలను ఘనంగా జరుపుకున్నాం.

Festivals and Vrats in the month of February 2021

ఇప్పుడు ఫిబ్రవరి నెలలోకి కూడా అడుగు పెట్టేశాం. హిందూ క్యాలెండర్ ప్రకారం, ఈ నెలలో రథసప్తమి, నవరాత్రులతో, వసంత పంచమి పండుగతో పాటు వ్రతాలు, శుభముహుర్తాలు ఎన్నో ఉన్నాయి.

Festivals and Vrats in the month of February 2021

ఈ సందర్భంగా ఫిబ్రవరి నెలలో ఏయే రోజు ఏయే పండుగలు, వ్రతాలు జరుగుతాయి.. ఏయే తేదీలలో ఉపవాసాలు ఉంటారు అనే వివరాలను పూర్తిగా తెలుసుకుందాం...

Astrology Remedies : ఈ పరిహారాలు పాటిస్తే మంచి జాబ్ కొడతారంట...! ఉద్యోగులకు సమస్యలన్నీ తొలగిపోతాయట...!Astrology Remedies : ఈ పరిహారాలు పాటిస్తే మంచి జాబ్ కొడతారంట...! ఉద్యోగులకు సమస్యలన్నీ తొలగిపోతాయట...!

ఫిబ్రవరి 7వ తేదీ..

ఫిబ్రవరి 7వ తేదీ..

2021వ సంవత్సరంలోని రెండో నెల అయిన ఫిబ్రవరిలో ఏడో తేదీ క్రిష్ణ పక్షం యొక్క ఏకాదశిని షట్టిల ఏకాదశి అని అంటారు. ఈరోజున విష్ణుమూర్తిని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. అలాగే, ఈరోజున ఉపవాసం ఉంటారు.

ఫిబ్రవరి 9న

ఫిబ్రవరి 9న

హిందూ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి తొమ్మిదో తేదీన ఆ పరమేశ్వరునికి అంకితం చేయబడింది. ఈ రోజున ప్రదోష్ వ్రతం చేస్తూ పార్వతీపరమేశ్వరులను ఆరాధిస్తారు. ఈరోజున కూడా చాలా ఉపవాసం ఉంటారు.

ఫిబ్రవరి 10న..

ఫిబ్రవరి 10న..

ఫిబ్రవరి 10వ తేదీన మాస శివరాత్రి జరుపుకుంటారు. ఈరోజున శివ భక్తులుకు ఆ భోళాశంకరుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈరోజున ఎంతో భక్తిశ్రద్ధలతో ఉపవాసం ఉండి శివుడిని ఆరాధిస్తారు.

ఫిబ్రవరి 11న..

ఫిబ్రవరి 11న..

ఈరోజున మౌని అమావాస్య. ఈరోజును హిందువులు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈరోజున గంగా నదిలో లేదా ప్రవహించే నీటిలో ఉదయాన్నే స్నానం చేస్తారు. అనంతరం దేవాలయాలకు వెళ్లి పూజలు చేస్తారు.

టెంపుల్స్ లో ఎంత టెక్నాలజీ దాగి ఉందో తెలుసా...టెంపుల్స్ లో ఎంత టెక్నాలజీ దాగి ఉందో తెలుసా...

ఫిబ్రవరి 12న

ఫిబ్రవరి 12న

ఈరోజున నవరాత్రులు ప్రారంభమయ్యే రోజు. ఈరోజున దుర్గాదేవికి అంకితమివ్వబడింది. ఈ సమయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలను చేస్తారు.

ఫిబ్రవరి 15న..

ఫిబ్రవరి 15న..

ఫిబ్రవరి 15వ తేదీ అయిన సోమవారం రోజున వినాయక చతుర్థిని జరుపుకుంటారు. ఈరోజున ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

ఫిబ్రవరి 16న..

ఫిబ్రవరి 16న..

హిందూ మతాన్ని విశ్వసించే వారికి వసంతి పంచమి అనేది పండుగ. ఈరోజున చాలా మంది భక్తులు సరస్వతి దేవిని ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. ఇలా చేయడం వల్ల ఆ అమ్మవారి దీవెనలు లభిస్తాయని చాలా మంది నమ్మకం.

ఫిబ్రవరి 19న..

ఫిబ్రవరి 19న..

ఈ రోజున దేశవ్యాప్తంగా రథసప్తమి వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా మన ఏపీలోని శ్రీకాకుళం అరసవల్లిలోని సూర్యదేవాలయంలో, ఒడిశాలోని కోణార్క్ టెంపుల్ లో ప్రత్యేక పూజలు చేస్తారు.

ఫిబ్రవరి 20న..

ఫిబ్రవరి 20న..

ఫిబ్రవరి 20వ తేదీన భీష్మ అష్టమి అంటారు. ఈరోజున మహాభారతంలోని భీష్మపితామహుడికి అంకితం చేశారు. భీష్మాష్టమి రోజున చాలా మంది ఉపవాసం ఉంటారు.

ఫిబ్రవరి 21న..

ఫిబ్రవరి 21న..

ఈరోజున మాస నవరాత్రి ముగుస్తుంది. దీన్నే గుప్త నవరాత్రి అని కూడా ఉంటారు. ఈరోజున మాంసాహారం తీసుకోకూడదు.

ఫిబ్రవరి 23న..

ఫిబ్రవరి 23న..

ఈరోజున మరో ఏకాదశి వస్తుంది. ఈ ఏకాదశిని జయ ఏకాదశి అని అంటారు. ఈ పవిత్రమైన రోజున భక్తులందరూ ఉపవాసం ఉండి ఎంతో భక్తిశ్రద్ధలో పూజలు చేస్తారు.

ఫిబ్రవరి 24న..

ఫిబ్రవరి 24న..

ఈ పవిత్రమైన రోజున ప్రదోష్ వ్రతం నిర్వహిస్తారు. అదే సమయంలో పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇలా చేయడం వల్ల తమ కష్టాలన్నీ తొలగిపోయి, తమ కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు.

ఫిబ్రవరి 27న..

ఫిబ్రవరి 27న..

ఈరోజున పౌర్ణమి వస్తుంది. ఈరోజున చంద్రుడిని ఆరాదించడం వల్ల ప్రత్యేక ఫలితాలు వస్తాయని చాలా మంది నమ్మకం. అదేవిధంగా ఈ పౌర్ణమి రోజున స్నానం, విరాళాలు ఇవ్వడం వంటి అనేక కార్యక్రమాలను వాటిని ధర్మంగా జరుపుకుంటారు

English summary

Festivals and Vrats in the month of February 2021

To know about those festivals that will be celebrated in February month, check out this article.
Desktop Bottom Promotion