Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
January 2022 Festival Calendar:జనవరిలో సంక్రాంతితో పాటు వచ్చే ముఖ్యమైన పండుగలు, వ్రతాలివే...
2022 సంవత్సరంలోని జనవరి నెలలో వచ్చే పండుగలు మరియు వ్రతాలు ఎప్పుడెప్పుడొచ్చాయో చూసెయ్యండి.
మరికొద్ది గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ 2021 సంవత్సరానికి గుడ్ బై చెప్పేయనున్నారు. అదే సమయంలో ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా.. సంతోషకరంగా 2022 కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొత్త ఏడాదిలోని తొలి నెల(జనవరి)లో ఉపవాసాలు, పండుగలు కూడా ప్రారంభం కానున్నాయి.

గత రెండు సంవత్సరాలుగా చాలా పండుగలు కళ తప్పాయి. చాలా మంది ప్రజల్లో కూడా ఉత్సాహం తక్కువగానే కనిపించింది. దీనంతటికి కారణం కరోనా మహమ్మారినే. ప్రస్తుతం టీకాలు అందుబాటులో ఉన్నప్పటికీ.. కరోనా కొత్త వేరియంట్లు మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. అయితే 2022 సంవత్సరంలో అయినా బూస్టర్ డోస్ లతో అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారని చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. జనవరి నెల అనగానే ప్రతి ఒక్కరికీ సంక్రాంతి, పొంగల్, కోడి పందేలు, జల్లికట్టు ఉత్సవాలే గుర్తుకొస్తాయి. ఈ సందర్భంగా ఈ నెలలో వచ్చే ప్రధానమైన ఉపవాసాలు, పండుగలు, ముఖ్యమైన తేదీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

01 జనవరి 2022
2022 ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం, జనవరి ఒకటో తేదీన మాసిక శివరాత్రి వేడుకలను జరుపుకుంటారు.

02 జనవరి 2022
2022 ఆంగ్ల నూతన సంవత్సరంలో జనవరి రెండో తేదీన తమిళనాడు ప్రాంతంలో హనుమాన్ జయంతిని ఘనంగా జరుపుకుంటారు. అదే రోజున దర్శ అమావాస్య కూడా వచ్చింది. ఈ అమావాస్యనే పౌష్య అమావాస్య అని కూడా అంటారు. ఈ ప్రత్యేకమైర రోజున ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

06 జనవరి 2022
ఆంగ్ల నూతన సంవత్సరంలోని తొలి నెలలో ఆరో రోజున వినాయక చతుర్థిని జరుపుకుంటారు. ఆ మరుసటి రోజే అంటే జనవరి ఏడో తేదీన స్కంద షష్టి వస్తుంది.

09 జనవరి 2022
హిందూ క్యాలెండర్ ప్రకారం జనవరి నెలలో తొమ్మిదో తేదీన భాను సప్తమి వచ్చింది. ఈ ప్రత్యేకమైన రోజున సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇదే రోజున గురు గోవింద్ సింగ్ జయంతి వేడుకలను జరుపుకుంటారు.

10 జనవరి 2022
జనవరి నెలలో పదో తేదీన బనద అష్టమి వచ్చింది. ఇదే రోజున మాస దుర్గాష్టమి సందర్భంగా అమ్మ వారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ ప్రత్యేకమైన రోజున ఉపవాసాలు కూడా ఉంటారు.

12 జనవరి 2022
జనవరి నెలలో 12వ తేదీన స్వామి వివేకానంద జయంతి జరుపుకుంటారు. ఈరోజునే యువజన దినోత్సవంగా దేశ వ్యాప్తంగా వేడుకలు నిర్వహిస్తారు.

13 జనవరి 2022
హిందూ క్యాలెండర్ ప్రకారం, జనవరి 13వ తేదీన వైకుంఠ ఏకాదశి వచ్చింది. ఈ పవిత్రమైన రోజున విష్ణుమూర్తి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా తిరుమల దేవస్థానంలో ఉత్తర ద్వార దర్శన సౌకర్యం కల్పిస్తారు. ఇదే రోజున భోగి పండుగ కూడా ప్రారంభమవుతుంది. ఉత్తర భారతంలో లోహ్రి అనే పేరుతో సంబరాలు జరుపుకుంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో కోడి పందేలు జోరుగా సాగుతాయి. అదే విధంగా తైలాంగ్ స్వామి జయంతిని జరుపుకుంటారు.

14 జనవరి 2022
జనవరి 14వ తేదీన మకర సంక్రాంతి పండుగను తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటారు. ఈ సమయంలో రైతుల పంట చేతికొచ్చిన సందర్భంగా ఆనందంగా సంబరాలు జరుపుకుంటారు. ఇతర రాష్ట్రాల్లో పొంగల్ పేరిట ఈ పండుగను జరుపుకుంటారు. ఇదే రోజున ఉత్తరాయానం ప్రారంభమవుతుంది. సూర్యుడు ధనస్సు నుండి మకరరాశిలోకి ప్రవేశిస్తాడు.

15 జనవరి 2022
జనవరి 15వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో కనుమ పండుగను జరుపుకుంటారు. ఇదే రోజున ప్రదోష వ్రతం కూడా వస్తుంది. తమిళనాడులో మట్టు పొంగల్ గా జరుపుకుంటారు. ఈ సమయంలోనే జల్లి కట్టు పోటీలను నిర్వహిస్తారు.

17 జనవరి 2022
ఈ రోజున పౌర్ణమి వస్తుంది. ఈ పౌర్ణమిని శాకాంబరి పౌర్ణమిగా పిలుస్తారు. ఈరోజున పౌష పూర్ణిమ వ్రతం చేస్తారు. ఆ మరుసటి రోజే అంటే జనవరి 18వ తేదీన మాఘ మాసం ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత వారం రోజులకు అంటే జనవరి 25వ తేదీన కాలాష్టమి ప్రారంభమవుతుంది.

31 జనవరి 2022
జనవరి నెలఖారులో అంటే 30వ తేదీన మాసిక శివరాత్రి వస్తుంది. ఇదే రోజున ప్రదోష వ్రతం కూడా నిర్వహిస్తారు. 31వ తేదీన అమావాస్య వస్తుంది. ఈ అమవాస్యనే దర్శ అమావాస్య అని పిలుస్తారు.
జనవరి 14వ తేదీన మకర సంక్రాంతి పండుగను తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటారు. ఈ సమయంలో రైతుల పంట చేతికొచ్చిన సందర్భంగా ఆనందంగా సంబరాలు జరుపుకుంటారు. ఇతర రాష్ట్రాల్లో పొంగల్ పేరిట ఈ పండుగను జరుపుకుంటారు. ఇదే రోజున ఉత్తరాయానం ప్రారంభమవుతుంది. సూర్యుడు ధనస్సు నుండి మకరరాశిలోకి ప్రవేశిస్తాడు.
జనవరి నెలలో ఒకటో తేదీన నూతన సంవత్సరం సందర్భంగా చాలా మందికి సెలవులు లభిస్తాయి. అలాగే జనవరి 14వ తేదీన మకర సంక్రాంతి రోజున పండుగ సెలవు లభిస్తుంది. అనంతరం 26వ తేదీన రిపబ్లిక్ డే సందర్భంగా సెలవు వస్తుంది. మరి కొందరికి జనవరి 30వ తేదీన గాంధీ వర్ధంతి సందర్భంగా సెలవు దొరుకుతుంది.



Click it and Unblock the Notifications
